Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
భార్యలను మార్చుకున్న ఫ్రెండ్స్..గ్రామాల్లోకి వైఫ్ స్వాపింగ్ కల్చర్!
ఇప్పటిదాకా వైఫ్ స్వాపింగ్ కల్చర్ విదేశాల్లోనే ఉంది..మనదేశంలో లేదు అని వింటూ వచ్చాం. ఆల్రెడీ ఈ కల్చర్ మనదేశంలో గ్రామాల్లోకి పాకిపోయిందని ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తే అర్థమవుతోంది. తాజాగా ఓ గ్రామంలో నివసించే ఇద్దరు ఫ్రెండ్స్ పరస్పర అంగీకారంతో తమ భార్యాలను మార్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయంలో గ్రామంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అందరిని దృష్టిని ఆకర్ఫించింది. చివరకి పోలీసుల ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. అసలేం జరిగిందో ఇక్కడ చూడండి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాట్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మణ్‌పూర్ గ్రామానికి చెందిన అనుప్ యాదవ్, పప్పు కోరి అహ్మదాబాద్‌లో పనిచేసేవారు. ఒకరి కష్టంలో మరొకరు అండగా నిలిచేవారు. బతుకుదెరువు కోసం అహ్మదాబాద్ వచ్చి, ఒకే గదిలో ఉంటూ ప్రాణస్నేహితులుగా మారిన వీరి బంధం, చివరకు భార్యలను మార్చుకునేంత విపరీత స్థాయికి చేరుకుంది. కలిసి పనిచేస్తూ, కష్టసుఖాలు పంచుకుంటూ పెరిగిన వీరి స్నేహం ఎంతో ఆదర్శంగా ఉండేది. కానీ ఆ నమ్మకం పునాదుల మీదే ద్రోహం అనే సౌధాన్ని నిర్మించారు.

నా భర్త నన్ను బలవంతంగా తన స్నేహితుడు పప్పుతో కలిసి జీవించమని ఒత్తిడి చేశాడు అని అనుప్ భార్య కన్నీళ్లతో ఆరోపిస్తుండగా.. నేను ఊళ్లో లేని సమయంలో అనుప్ నా భార్యతో సంబంధం పెట్టుకుని, ఆమెను తనతో తీసుకెళ్లిపోయాడు అని పప్పు పోలీసుల దగ్గర వాపోయాడు. ఒకప్పుడు ప్రాణమిచ్చుకునే స్నేహితులు, ఇప్పుడు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ పరువును బజారుకీడ్చారు.
వివాహం బంధమా? లేక వ్యాపార ఒప్పందమా?
ఈ కథలో అత్యంత దిగ్భ్రాంతికరమైన మలుపు.. పప్పు భార్య సెటిల్‌మెంట్ కోసం డిమాండ్ చేసినప్పుడు వెలుగులోకి వచ్చింది. తనను వదిలేసినందుకు పరిహారంగా రూ.5 లక్షల నగదు, ఒక కొత్త బైక్ కావాలని ఆమె డిమాండ్ చేయడం పెను సంచలనం సృష్టించింది. ఇది చూస్తుంటే ఏడు జన్మల బంధంగా భావించే వివాహం, ఇప్పుడు కేవలం ఓ వ్యాపార ఒప్పందంగా మారిపోయిందా అనే సందేహం కలుగుతోంది. ప్రేమ, నమ్మకాల స్థానంలో డబ్బు, డిమాండ్లు చోటుచేసుకుంటున్నాయనడానికి ఈ ఘటనే నిలువుటద్దం.
సంబంధాలు ఎందుకు దారితప్పుతున్నాయి?
పాశ్చాత్య దేశాల్లో వైఫ్ స్వాపింగ్ లేదా స్వింగింగ్ అనే సంస్కృతి ఉన్నప్పటికీ భారతీయ సమాజంలో ఇది క్షమించరాని నేరం, సామాజిక తప్పిదం. భార్యాభర్తల మధ్య సంభాషణ లోపించడం, పరస్పర అపనమ్మకం, ఒత్తిళ్లు వంటివే ఇలాంటి విపరీత పోకడలకు కారణమని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం, కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోవాలి కానీ భాగస్వాములను మార్చుకోవడం పరిష్కారం కాదు. ఇది బంధాలను శాశ్వతంగా నాశనం చేయడమే కాక, చట్టపరమైన చిక్కులను, జీవితాంతం మోయలేని సామాజిక అవమానాన్ని మిగులుస్తుంది.



Click it and Unblock the Notifications