Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
భర్తలు మిస్ అవుతున్న ఈ చిన్న విషయం.. విడాకులకి దారితీస్తుందని తెలుసా.?
దేశంలో ఇటీవలి కాలంలో నమోదవుతున్న విడాకుల కేసుల్లో 60 నుంచి 70 శాతం వరకు భార్యలే ముందుగా భర్తల నుంచి విడాకులు కోరుతున్నట్లుగా సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇందుకు చాలా కారణాలు దారితీస్తున్నాయని అంటున్నారు.

పెళ్లి అంటే తమ భవిష్యత్తు జీవితానికి సంబంధించి ఎన్నో ఊహించుకుంటారు అమ్మాయిలు. తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి స్వీకరించిన ప్రేమ, ఆప్యాయత, బాధ్యత ఇవన్నీ తమ జీవితంలోకి వచ్చే భర్త నుంచి పొందాలని.. అదే అనురాగం భర్తపై చూపించి ఆ బంధాన్ని మిగిలిన జీవితమంతా పదిలంగా ఉంచుకోవాలని భావిస్తారు. అయితే పెళ్లి తర్వాత కొన్ని పరిస్థితులు తమను అసంతృప్తి గురి చేసి ఆ బంధానికి వీడ్కోలు చెప్పేలా చేస్తున్నాయని సైకాలజిస్ట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు రావడానికి వివాహేతర సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు కొంతవరకూ కారణమైతే.. కనిపించని కొన్ని చిన్న చిన్న విషయాలు ఎక్కువగానే విడాకులకు దారి తీస్తున్నాయి. భార్య విషయంలో భర్త వ్యవహరించే కొన్ని సందర్భాలు ఆమెను నిరాశకు, అసంతృప్తికి గురి చేస్తున్నాయి. దీంతో కలిసి ఉండటం కంటే విడిపోవడమే మేలుగా భావిస్తున్నారు.
వివాహ బంధం పదిలంగా, సంతోషంగా ఉండాలంటే దంపతుల మధ్య ప్రేమ తప్పనిసరి. వారి మధ్య సంతోషకరమైన సందర్భాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఏ బాధ్యతను, ఒత్తిడి అయినా తట్టుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. పెళ్లయిన తొలి నాళ్లలో ఇద్దరి మధ్య అనురాగం బాగానే ఉన్నా.. పిల్లలు కలిగి వారి చదువు, కుటుంబీకుల బాధ్యతలు, ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ ఒక్కసారిగా పెరిగాక పరిస్థితులు చాలా వరకు మారతాయి.
ఈ క్రమంలో భార్యాభర్తలు గడిపే సమయం చాలా తక్కువ ఉంటుంది. ఆ సమయంలో కూడా వ్యక్తిగత విషయాలు, ప్రేమ చిగురించే అంశాలు కూడా గొడవలు, ఇంటి విషయాల గురించే చర్చకు వస్తుంటాయి. దీంతో మహిళలు తమ వివాహ జీవితంలో ఏవైతే ఆశించారో అవి క్రమంగా తగ్గిపోతుంటాయి. కొన్నాళ్ల వరకు పరిస్థితులు అర్థం చేసుకుని సహనంగా ఉన్న మహిళలు.. ముఖ్యంగా 40 వయసు దాటాక అసహనానికి గురై మిగిలిన జీవితమంతా ఇలాగే గడపాలా అనే ఆందోళనలో పడిపోతుంటారని పలు అధ్యయనాల్లో తేలిందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.
బాధ్యతలు, ఒత్తిడి, బిజీ లైఫ్‌లో పడి భార్యకి సంబంధించిన విషయాలు భర్త మరిచిపోవడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. భార్యలు చేసిన పనికి ప్రశంసలు ఇవ్వకపోవడం, చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లు లేకపోవడం, అభినందనలు లేకపోవడం, ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, సమయం ఇవ్వకపోవడం వంటివి భార్యలను మానసికంగా నిరాశకు గురిచేస్తున్నాయి.

ఇదే ప్రశ్న భర్త ముందు ఉంచినప్పుడు.. ఏం చేసినా కుటుంబం కోసమే కదా చిన్న విషయాలకు ఎందుకు ఎమోషనల్ అవ్వడం అంటూ ఎదురు దాడికి దిగడంతో వారి మనోవేదన ఇంకా ఎక్కువై ప్రాధాన్యత, ప్రేమ లేని చోట ఉండటం ఎందుకు అనే భావన భార్యలో కలుగుతుంది. పెళ్లయి 15, 20 ఏళ్లు దాటిన మహిళల్లో ఇలాంటి అసహనం ఎక్కువగా కనిపిస్తోంది. ఎలాంటి అనుభూతి లేని బంధాన్ని మరమనిషిలా మిగతా జీవితం ఎందుకు భరించాలనే ఆలోచనతో భార్యలే ఎక్కువగా విడాకులు కోరుతున్నారు.
వివాహేతర సంబంధాలు, ఆర్థిక పరిస్థితుల కంటే కూడానూ ఇలాంటి మనోవేదనకి గురిచేసే సందర్భాలే వారిని విడాకులు కోరుకునేందుకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో భర్తలు తమ దాంపత్యంలో ఇలాంటి పొరపొచ్చాలకి తావివ్వకుండా దొరికిన ప్రతి సమయాన్ని భార్యతో సంతోషంగా గడిపేందుకు కేటాయించడం ద్వారా ఆ బంధం బలపడుతుందని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
