Latest Updates
-
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.!
మూమూలు ఆడది కాదు భయ్యో..7 నెలల్లోనే 25 పెళ్లిళ్లు..రాష్ట్రానికొకడితో సంసారం!
ఓ మహిళ పెళ్లిళ్లలో కొత్త రికార్డు సృష్టించింది. కేవలం 23 ఏళ్ల వయస్సుకే 25మంది పెళ్లి చేసుకుంది. అది కూడా కేవలం 7 నెలల్లోనే 25 పెళ్లిళ్లు చేసుకుంది. రాష్ట్రానికో మొగుడిని సెట్ చేసుకుంది. అయితే దీని వెనుక ఈమె పెద్ద స్కెచే వేసింది. ఈమె చేసిన పనికి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇదెక్కడికి ఆడదిరా బాబు అని ఈమె కథ విన్న నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈమో పెద్ద కామిస్ట్ ఏమో అని కొందరు,డబ్బు కోసం ఏదైనా చేసే వ్యక్తి ఇలానే ఉంటదని మరికొందరు ఇలా భిన్న రకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహరాజ్ గంజ్ ప్రాంతానికి చెందిన అనురాధా పాశ్వాన్(23)కి స్థానిక నివాసితో పెళ్లి అయింది. అనురాధ ఓ హాస్పిటల్ లో పని చేసేది. అయితే భర్తతో గొడవల కారణంగా మొగుడ్ని వదిలేసి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కి వెళ్లిపోయింది. అక్కడ అనురాధ కి కొన్ని వాట్సాప్ గ్రూప్ ల ద్వారా ఫేక్ మ్యారేజ్ స్కామ్ చేసేటోళ్లతో పరిచయం ఏర్పండి. ఇదేదో బాగుంది హాయిగా పెళ్లి చేసుకోవడం..తర్వాత వాడిని మోసం చేసి వాడి ఇంట్లో బంగారం,డబ్బు ఎత్తుకుపోవడం చేస్తే లైఫ్ సెట్ అయిపోయిద్దని భావించింది. చిన్న చిన్న టౌన్స్ లో ఉండే పెళ్లికోసం ఎదురుచూస్తుండే బ్యాచిలర్స్ ని టార్గెట్ గా పెట్టుకుంది.

ఇద్దరు ఏజెంట్లు మా దగ్గర పెళ్లీడుకొచ్చిన అమ్మాయి ఫొటో ఉంది చూడండి అంటూ బ్యాచిలర్స్ ని టార్గెట్ చేస్తుండేవాళ్లు. అంతేకాకుండా ఎదురు కట్నం ఇవ్వాలి అని అడుగుండేవాళ్లు. సరేలే పెళ్లి అయితే చాలులే అని అనుకునే కొందరు బ్యాచిలర్స్ ఈ ఫేక్ మ్యారేజ్ బ్రోకర్లకు డబ్బులు చెల్లించి అనురాధని పెళ్లి చేసుకునేటోళ్లు. అయితే పెళ్లి అయిన మరుసటి రోజే ఇంట్లోని బంగారం,నగలతో అనురాధ జంప్ అయ్యేది. ఇలా బాగానే డబ్బు వెనకేసుకుంది. అయితే ఇంకా ఇంకా అని ఆమెలో పుట్టిన అత్యాస ఆమెను దొరికిపోయేలా చేసింది.
మే3,2025న రాజస్తాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ సిటీకి చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్ లో అనురాధ వ్యవహారం మొత్తం బట్టబయలైంది. విష్ణు శర్మ పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్ లో.."సునీత,పప్పు మీనా ఇద్దరు ఏజెంట్లు అనురాధని నాకు పరిచయం చేశారు..వారికి 2 లక్షలు ఇచ్చి అనురాధని పెళ్లి చేసుకున్నా.. ఏప్రిల్ 20న మా పెళ్లి అయ్యింది. అయితే పెళ్లయిన తర్వాత మే 2న నేను బయట నుంచి ఇంటికొచ్చేసరికి అనురాధ ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకొని జంప్ అయ్యింది. క్యాష్, గోల్డ్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకొని పారిపోయింది"అని తెలిపాడు.
విష్ణు శర్మ కంప్లెయింట్ తో పోలీసులు రంగంలోకి దిగి అనురాధని పట్టుకునేందుకు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పెళ్లి చేసుకోడానికి అమ్మాయి కోసం చూస్తున్నట్లుగా నటించాడు..దీంతో అతనికి పెళ్లి చేసుకోడాకి ఈ అమ్మాయిని చూడండని ఓ ఏజెంట్ అనురాధ ఫొటో పంపాడు. దీని తర్వాత అనురాధ ఎక్కడ ఉందనేది పోలీసులు ట్రాక్ చేశారు. భోపాల్ లో ఉందని తెలుసుకొని అక్కడి వెళ్లి ఆమెను అరెస్ట్ చేశారు. ఈమె గ్యాంగ్ లోని చాలామందిని గుర్తించామని,మొత్తం నెట్ వర్క్ ని అంతమొందించేందుకు ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ జరుగుతుందని పోలీసులు తెలిపారు.



Click it and Unblock the Notifications