Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
గ్రేట్ లవ్: భర్త కిడ్నీ అమ్మి ఆ డబ్బులతో ప్రియుడితో జంప్ అయిన మహిళ
ఇవాళ ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కావడంతో ఎక్కడ చూసిన ప్రేమికుల సందడే కనిపిస్తోంది. టీవీ ఆన్ చేసినా, ఏ వార్త చూసినా, ఎవరిని కదిలించినా అన్నీ ప్రేమ ఊసులే కనబడుతున్నాయి. అయితే ఓ మహిళ తన ప్రియుడితో చేసిన ఓ పని ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమయింది. ఓ వివాహిత తన భర్త కిడ్నీ అమ్మి ఆ డబ్బులతో లవర్ తో లేచిపోయింది.
ఈమెది మామూలు ప్రేమ కథ కాదురో అంటూ సోషల్ మీడియాలో కూడా ఈ మహిళపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరగ్గా తాజాగా జరిగిన సంఘటన మాత్రం పెద్ద హైలెట్ గా మారింది.

అసలేం జరిగింది
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లాలో ఓ మహిళ తన భర్త, పదేళ్ల వయస్సున్న కూతురుతో నివాసముండేది. కూలిపనులు చేసుకుంటూ భార్యాభర్తలు జీవనం సాగించేవాళ్లు. హాయిగా కూలి చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో ప్రశాంతంగా ఉండే వీరి జీవితంలో ఓ రోజు పిడుగుపడింది.ఫేస్ బుక్ లో అకౌంట్ చేసిన మహిళకి రవిదాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మొదట్లో మెసేజ్ లు చేసుకునేటోళ్లు..తర్వాత ఫోన్ లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రవిదాస్ మహిళను రెచ్చగొట్టాడు. నీ భర్తను వదిలి నాతో వస్తే నిన్ను బాగా చూసుకుంటా అని చెప్పడంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇదే సమయంలో ప్రియుడితో పాటు తాను ఆనందంగా ఉండాలని భావించి ఓ స్కెచ్ వేసింది.
నీది ఒక కిడ్నీ అమ్మితే మన ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవడంతో పాటు మన కూతరికి చదువుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు,కూతురి చదువుతో పాటు పెళ్లికి ఉపయోగపడుతాయని భర్తకు చెప్పి నమ్మించింది. భార్య పట్టుబట్టడంతో చేసేదేమీ లేక అతను తన కిడ్నీని రూ.10 లక్షలకు విక్రయించాడు. ఆ డబ్బుతో తన కుటుంబ సమస్యలు తీరిపోతాయని, అందరూ సంతోషంగా ఉండొచ్చని భావించాడు. డబ్బు తీసుకొచ్చి భార్యకు ఇచ్చాడు. అయితే తన పథకం ప్రకారం ఆ డబ్బు తీసుకొని ప్రియుడితో జంప్ అయింది ఆ మహిళ. విషయం తెలుసుకొని లబోదిబోమంటూ భర్త పోలీసులను ఆశ్రయించాడు. కిడ్నీని అమ్మిన తర్వాత డబ్బుతో కూతురు భవిష్యత్ బాగుపడుతుందని అనుకున్నానని, కానీ భార్య దురుద్దేషాన్ని పసిగట్టలేకపోయానని వాపోయారు. ఎలాగైనా తనకు, తన కూతురికి న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు.
ఈ క్రమంలో తన భార్య బరాక్ పూర్ లోని సుభాష్ నగర్ లో రవిదాస్ తో ఉంటోందని తెలుసుకున్నాడు. పోలీసుల సాయంతో కుటుంబంతో పాటు వారు ఉన్న ప్రాంతానికి వెళ్లగా తన భర్తతో మాట్లాడడానికి భార్య నిరాకరించింది. ఇంట్లోనే ఉండి తలుపు గడియ పెట్టుకుంది. ఏం చేసుకుంటావో చేసుకోపో డివోర్స్ ఇస్తానని తే్చి చెప్పింది. పదేళ్ల కూతురు మీద కూడా కనికరం చూపించలేదు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంకా నయం నిన్ను చంపకుండా కిడ్నీతో సరిపెట్టింది బతుకు బ్రో అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ మహిళకు కఠిన శిక్ష విధించాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications