10 చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

లక్ష్మీ అమ్మవారు తన భక్తులకి సంపదలు, అన్ని అదృష్టాలను వరంగా ప్రసాదించే దేవత. ఆమె హిందూమతంలో చాలా శక్తివంతంగా, ఎక్కువగా పూజింపబడే దేవత. లక్ష్మీదేవిని ఉద్దేశించిన మంత్రాలను పఠించటం వలన అదృష్టం కలిసొస్తుంది.

పాజిటివ్ తరంగాలను సృష్టించే అర్థవంతమైన పదాలే మంత్రాలు. ఇవి పఠించటం వలన విశ్వం నుంచి కోరుకున్న విషయాలు మీ వద్దకు ఆకర్షింపబడతాయి. ఈ మంత్రాలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే శక్తివంతమైన మంత్రాలు.

ఇంట్లో ఎలాంటి లక్ష్మీ దేవి ఫోటోలు ఉంటే అష్టఐశ్వర్యాలు పొందుతారు..?

ఒకసారి మీరు లక్ష్మీమంత్రాలను చదవటం మొదలుపెడితే, ఏకాగ్రత కుదరటానికి కొంచెం సమయం పడుతుంది. ఏకాగ్రత కుదిరాక, భక్తులకి అనంత సంపదలు, అదృష్టాలు ప్రవాహంలా వచ్చిపడతాయి. ఈ మంత్రశక్తి, దేవతానుగ్రహం కలవటానికి 40 నుంచి 50 రోజుల వరకూ పడుతుంది.అది కూడా భక్తుని ఏకాగ్రత మరియు భక్తిమీద ఆధారపడివుంటుంది.

Mantras to chant during diwali

లక్ష్మీమంత్రం ఉపాసన ప్రారంభించడం

లక్ష్మీమంత్రాలు చాలానే ఉన్నాయి. మేము అత్యంత శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలను ఇక్కడ పొందుపరిచాం. అందులో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక వైబ్రేషన్ ను, చుట్టూ శక్తిని సృష్టిస్తాయి. ఒక్కొకటి అదృష్టం,సంపద మరియు సుఖాన్ని తెస్తాయి. లిస్టును ఒకసారి చదివి మీకు అవసరమైన మంత్రాన్ని జపించండి.

సాధారణంగా అందరూ శుక్రవారం నుంచి మంత్రోపాసన మొదలుపెడతారు. మీరు పౌర్ణమి రోజునుంచి కూడా మొదలుపెట్టవచ్చు. దీపావళి కూడా లక్ష్మీ మంత్రాన్ని పఠించడానికి మంచిరోజే.

కమలాల విత్తనాలతో తయారయిన జపమాల కానీ, స్ఫటిక జపమాలతో కానీ మీ మంత్రపఠనాన్ని లెక్కపెట్టుకోవచ్చు. మీకు డబ్బు అవసరం అంతగా లేకపోతే, మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకు డబ్బు అవసరం చాలావుంటే, 108సార్లను 5రౌండ్లు పఠించండి. ఎక్కువసార్లు జపించటం వలన మీకే ఎక్కువ లాభం జరుగుతుంది.

లక్ష్మీ మంత్రాల లిస్టు

లక్ష్మీ బీజమంత్రం 1

'శ్రీం’

లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ముఖ్యమంత్రం శ్రీం. దీన్నే స్విచ్ పదంగా కూడా వాడతారు. స్విచ్ పదం అంటే శక్తిని ఒక స్థాయినుండి మరొక స్థాయికి మార్చగలదు. క్లీం, హ్రీం, క్రీం ఇవన్నీ స్విచ్ పదాలకి ఉదాహరణలు. ఇవేవీ శ్రీం అంత శక్తివంతం కాదు.

Mantras to chant during diwali

లక్ష్మీ బీజమంత్రం 2

॥ ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః ॥

ఇది శ్రీం ని వాడే పూర్తి బీజమంత్రం.

లక్ష్మీ బీజమంత్రం 3

॥ ఓం శ్రింగ్ శ్రియే నమః ॥

ఇది మరొక బీజమంత్రం. తేడా ఏంటంటే ఇందులో శ్రీం శబ్దం లేదు.

లక్ష్మీ మంత్రం

ఓం హ్రింగ్ శ్రింగ్ క్రీంగ్ శ్రింగ్ క్రీంగ్ క్లింగ్ శ్రింగ్ మహాలక్ష్మి మం గృహే ధనం పూరే పూరే చింతయై దూరే దూరే స్వాహా ॥

ఈ మంత్రాన్ని ఆఫీసుకి లేదా పనిచేసే చోటకి వెళ్ళేముందు జపించాలి. ఇది అన్ని చింతలను దూరం చేసి మీ ఇంటిని సకల సంపదలతో నింపేస్తుంది.

లక్ష్మీ గాయత్రి మంత్రం

॥ ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్నయై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం ॥

అనువాదం –

శ్రీ అయిన తల్లి మరియు మహావిష్ణువు భార్య అయినా ఓ లక్ష్మీదేవీ, మీకు నమస్కరిస్తున్నాం. మమ్మల్ని మేధస్సు, సంపద మరియు అదృష్టంతో దీవించండి.

లక్ష్మీ కటాక్షం పొందాలంటే.. ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలి ?

మహాలక్ష్మి మంత్రం

ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా।

మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయా ఓం ॥

అనువాదం –

ఓ మహాలక్ష్మీ, చెడునంతా అంతం చేసి మమ్మల్ని కాంతివంతమైన, సుఖసంతోషాలతో కూడిన భవిష్యత్తులోకి నడిపించు.

మహాలక్ష్మి మంత్రం (తాంత్రికం)

'ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ ఐంగ్ సౌంగ్ ఓం హ్రింగ్ కా ఎ ఈ లా హ్రింగ్ హ స కా హ ల హ్రింగ్ సకల హ్రింగ్ సౌంగ్ ఐంగ్ క్లింగ్ హ్రింగ్ శ్రింగ్ ఓం”

మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోటానికి ఇది శక్తివంతమైన తాంత్రిక మంత్రం.

లక్ష్మి నరసింహ మంత్రం

॥ ఓం హ్రింగ్ క్షరౌంగ్ ష్రింగ్ లక్ష్మి నృసింఘే నమః ॥

॥ఓం క్లింగ్ క్షరౌంగ్ శ్రింగ్ లక్ష్మి దేవ్యై నమః ॥

ఈ మంత్రాన్ని నరసింహుడిని ఆయన భార్య మహాలక్ష్మి అమ్మవారిని కలిపి పూజించటానికి వినియోగిస్తారు.

ఏకాదశాక్షర్ సిద్ధ లక్ష్మీమంత్రమ్

॥ ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ శ్రింగ్ సిద్ధ లక్ష్మ్యై నమః ॥

ఈ లక్ష్మీ మంత్రం మీకు సిద్ధిని పొందటానికి ఎంతో ఉపయోగపడుతుంది.

శ్రీ దక్షిణ లక్ష్మీస్తోత్రం

'త్రైలోక్య పూజితే దేవే కమల విష్ణు వల్లభే

యయతవం అచల కృష్ణే తథాభవమయి శ్రితా

కమల చంచల లక్ష్మీ చలాభూతిర్ హరిప్రియ

పద్మ పద్మాలయ సమ్యక్ ఉచై శ్రీ పద్మ ధరణీ

ద్వాదశైతాని నామాని లక్ష్మీ సంపూజ్య య పడేత్

స్థిర లక్ష్మిర్భవేత్ తస్య పుత్రధర అభీశః

ఇతి శ్రీ దక్షిణ లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం '

అనువాదం –

ఓ మహాలక్ష్మీ, నీవు ముల్లోకాలలో పూజించబడతావు. మహావిష్ణువు పట్టమహిషివి, భగవాన్ శ్రీకృష్ణుడి భార్యవి. ఓ కమలా! నీవు నాతోనే స్థిరంగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. ఓ చంచలమైన దేవతా, సమృద్ధికి అధినేత్రివైన నీవు ఒకచోటి నుంచి మరొకచోటికి వెళ్ళిపోతూనే ఉంటావు. ఓ ప్రియమైన శ్రీహరి, ఓ పద్మావతి, మీరు ఎప్పటికీ ఆహ్లాదకరమైనవారే. సంపదకి అధినేత్రీ, నువ్వు అత్యున్నతమైనదానివి, కమలంలో నివసించేదానివి. లక్ష్మీ అమ్మవారిని 12 పేర్లను నిష్టతో జపించేవారివద్ద నీవు ఎప్పుడూ స్థిరంగా ఉండుగాక. అతనికి భార్యాబిడ్డల సంతోషం కలకాలం దక్కుగాక. దక్షిణలక్ష్మీ స్తోత్రం ఇలా సమాప్తమైనది.

English summary

10 Most Powerful Lakshmi Mantras

A mantra is a collection of meaningful words that creates a vibration or an aura that attracts the desired effects from the universal energy. The mantras dedicated to Goddess Lakshmi are no exception to this definition. If anything, they are counted among the most powerful of mantras.
Subscribe Newsletter