For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జీవితంలోని అన్ని సమస్యలను దూరం చేసే 7 కృష్ణ భగవానుని మంత్రాలు

మీ జీవితంలోని అన్ని సమస్యలను దూరం చేసే 7 కృష్ణ భగవానుని మంత్రాలు

|

శ్రీ కృష్ణ భగవానునికి అంకితం చేయబడిన మంత్రాలను స్మరించుకోవడం ద్వారా, పాప పంకిలమైన చర్యలతో నిండిపోయిన కలియుగం శుద్ది చేయబడుతుందని నమ్మబడినది. క్రమంగా ఈ మంత్రాలు ఆధ్యాత్మిక సౌష్టవం మరియు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయని చెప్పబడినది.

7 Lord Krishna mantras for all problems in life,

మీ జీవితంలోని అన్ని సమస్యలను దూరం చేసే 7 కృష్ణ భగవానుని మంత్రాలు

1. విజయావకాశాల కోసం శ్రీ కృష్ణ భగవానుని మంత్రం :

1. విజయావకాశాల కోసం శ్రీ కృష్ణ భగవానుని మంత్రం :

హిందీలో: ఓం కృష్ణా శరణ్ మమః !!

తెలుగులో : ఓం శ్రీ కృష్ణా శరణం మమః !!

అర్ధం : ' కృష్ణా, నీ ఆశ్రయంలో నాకింత చోటును ప్రసాదించు స్వామీ, నా ఈ జీవితం నీ సేవకే అంకితం.'

ఫలితం : శ్రీ కృష్ణుని యొక్క పేరుతో కూడిన ఈ మంత్రం, వ్యక్తి జీవితంలోని అన్ని శోకాలను, దుఃఖాలను పటాపంచలు చేసి, మానసిక శాంతికి తోడ్పాటునందిస్తుందని చెప్పబడినది.

2. శ్రీ కృష్ణుని మూల మంత్రం :

2. శ్రీ కృష్ణుని మూల మంత్రం :

హిందీలో : ఓం కృష్ణాయ నమః !!

తెలుగులో : ఓం కృష్ణాయ నమః !!

అర్ధం : నా వందనాన్ని స్వీకరించు

ఫలితం : దైనందిక జీవనంలో ఒడిదుడుకుల నుండి ఉపశమనం కోసం.

3. కృష్ణ గాయత్రి మంత్రం :

3. కృష్ణ గాయత్రి మంత్రం :

హిందీలో : "ఓం దేవకీనందనాయ విద్మహే ధీమహీ తన్మై కృష్ణా ప్రచోదయాత్"

తెలుగులో : "ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహీ తన్మై కృష్ణా ప్రచోదయాత్"

ఫలితం : జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి మానసిక ప్రశాంతత పొందడం కోసం.

4. హరే కృష్ణ మంత్రం :

4. హరే కృష్ణ మంత్రం :

ఈ 16 పదాల వైష్ణవ మంత్రం, అత్యంత ప్రజాదరణ పొందిన కృష్ణుని మంత్రంగా ఉంది. మొట్టమొదటి సారిగా కలి సాంతరణ ఉపనిషత్తులో లిఖించబడినట్లు చెప్పబడినది.

హరే కృష్ణ హరే, కృష్ణ కృష్ణ హరే హరే !

హరే రామ హరే రామ, రామ రామ హరే హరే !!

ఫలితం : ఈ దైవిక మంత్రం భక్తులను ఆధ్యాత్మిక విమానంలో ఒక ప్రపంచం నుండి మరొక దైవిక ప్రపంచంలోనికి తీసుకుని వెళ్లి, వారి ఆత్మను శ్రీ కృష్ణునితో నేరుగా అనుసందానిస్తుందని నమ్ముతారు.

5. కృష్ణుని భక్తి మంత్రం :

5. కృష్ణుని భక్తి మంత్రం :

"జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద్ శ్రీ అద్వైత గధాధర్ శ్రీ వాసది గౌర్ భక్త బృంద"

అర్థం : ఈ మంత్రం, కృష్ణుడికి చెందిన గొప్ప భక్తులను సూచిస్తుంది మరియు వారి ప్రశంసలను కృష్ణునికి చేరవేసే మాధ్యమంగా ఉంటుంది.

6. శ్రీ కృష్ణ భగవానుని ని దైవిక ఆశీర్వాదానికై :

6. శ్రీ కృష్ణ భగవానుని ని దైవిక ఆశీర్వాదానికై :

శ్రీ కృష్ణ గోవిందా హరే మురారే, హే నాథా నారాయణ వాసుదేవాయ !

ఫలితం : శ్రీ కృష్ణుడి యొక్క దయ మరియు ఆశీర్వాదాన్ని పొందేందుకు ఉద్దేశించబడిన మంత్రమిది.

7. దేవ దేవుడైన శ్రీ కృష్ణ భగవానుని “క్లీం మంత్రం” :

7. దేవ దేవుడైన శ్రీ కృష్ణ భగవానుని “క్లీం మంత్రం” :

తక్షణ ఫలితాలకై ఉద్దేశించబడిన మంత్రంగా చెప్పబడిన మంత్రమిది.

మంత్రం : ఓం క్లీం కృష్ణాయ నమః !

కానీ ఈ మంత్రోచ్చారణ కొన్ని నియమాలతో నిర్దేశించబడినది. మీ ఆలయ పూజారిని సంప్రదించడం ద్వారా వివరాలను తెలుసుకుని పాటించండి.

ఫలితం : ఎటువంటి క్లిష్ట సమస్యనైనా తొలగించే కృష్ణ మంత్రంగా చెప్పబడినది.

శ్రీ కృష్ణ భగవానుని మంత్రాలు పఠించుట ఎలా ?

శ్రీ కృష్ణ భగవానుని మంత్రాలు పఠించుట ఎలా ?

శ్రీ కృష్ణ భగవానుని మంత్రాన్ని పఠించుటకు అనువైన సమయంగా బ్రహ్మ ముహూర్తం నిర్దేశించబడినది. ఈ బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 నుండి 6 గంటల మధ్య ఉంటుంది. ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి, ఉతికిన బట్టలు ధరించి కృష్ణుని పటం ముందు కూర్చుని, 108 సార్లు గుణకాలలో మంత్రాలను పఠించవలసి ఉంటుంది. ఏ మంత్రమైనా మీ మనసుకు తోచిన మంత్రాన్ని పఠించవచ్చు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆద్యాత్మిక, ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

7 Lord Krishna mantras for all problems in life

Recitation of the mantras dedicated to Sri Krishna is believed to be a great purifying act in the age of Kalyuga where sinful acts gain importance. These mantras provide spiritual solace and peace of mind which is unmatched.
Story first published: Tuesday, August 28, 2018, 17:07 [IST]
Desktop Bottom Promotion