For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవితంలో కష్టాలు తొలగించి సంతోషాన్ని ప్రసాదించే మంత్రాలు, పూజలు

జీవితంలో కష్టాలు తొలగించి సంతోషాన్ని ప్రసాదించే మంత్రాలు, పూజలు

By Swathi
|

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు దేవుడిపై భారం వేయాలంటారు. కానీ కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు ఆ దేవుడు నాకు ఎందుకు ఇలాంటి శిక్ష విధిస్తున్నాడో అని భావిస్తుంటారు. మరికొందరు దేవుడా నీవే దిక్కు అని చెబుతుంటారు. కొంతమంది ఎలాంటి సమస్యనైనా, ఒడిదుడుకులనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.

గాయత్రి మంత్రం ఎందుకంత శక్తివంతమైనది ? విశిష్టత ఏంటి ? గాయత్రి మంత్రం ఎందుకంత శక్తివంతమైనది ? విశిష్టత ఏంటి ?

అయితే ఆధ్యాత్మికతపై మనసు లగ్నం చేయడం వల్ల మనకు, మన మనసుకి ఎంతో శక్తి సామర్థ్యాలు అందుతాయని మన భారతీయులు విశ్వసిస్తారు. ఇతరులపై జాలి, కరుణ చూపించగలుగుతారు. కాబట్టి జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి కొన్ని రకాల పూజలు, మంత్రాలు సహాయపడతాయి. మీకున్న సమస్య నుంచి బయటపడి సంతోషకరమైన జీవితం అనుభవించడానికి కొన్ని రకాల పూజలు, మంత్రాలు ఉపయోగపడతాయి. అవేంటో చూద్దాం..

బుద్దుడు

బుద్దుడు

ప్రపంచంలోనే అత్యంత గొప్ప గురువు బుద్ధుడు. కాబట్టి ఎలాంటి సమస్యలు, ఆందోళనలు ఉన్నా.. ఓమ్ మని పద్మే హమ్ అని స్మరించుకోండి. ఈ మంత్ర జపం చేయడం వల్ల భయం తొలగిపోయి, మనసులో ఉన్న ఆందోళనలు తగ్గిస్తుందని బుద్ధుడు వివరించాడు.

వినాయకుడి మంత్రం

వినాయకుడి మంత్రం

అన్ని రకాల ఒడిదుడుకులను మహా గణపతి మంత్రం తొలగిస్తుంది. కాబట్టి చాలా పవర్ ఫుల్ మంత్రమైన ఓం గం గణపతయే నమహ అని స్మరించుకోవడం వల్ల సమస్యలు తొలగిపోయి.. ఎల్లప్పుడూ మీకు రక్షగా ఉంటానని ఆ మహా గణపతి వివరిస్తాడు.

లక్ష్మీ మంత్రం

లక్ష్మీ మంత్రం

సంపద, శ్రేయస్సు ప్రసాదించే దేవతగా హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తారు. కాబట్టి ఓం శ్రీ మహా లక్ష్మియే స్వాహా అని స్మరించుకోవడం వల్ల వైవాహిక సంపద పొందగలుగుతారు. అలాగే.. జీవితంలో శ్రేయస్సు పొందుతారు.

రుద్రాభిషేక పూజ

రుద్రాభిషేక పూజ

రుద్రాభిషేక పూజ మరో పవిత్రమైనది. శివుడి అద్భుతమైన అనుగ్రహం పొందాలంటే.. ఈ పూజ చాలా మంచిది. రుద్రాభిషేకం పూజలో భాగంగా 11 రకాల పదార్థాలతో అభిషేకం నిర్వహించి, 108 శివనామాలు స్మరిస్తారు. ఈ పూజ చేయించడం వల్ల జీవితంలో విజయం సాధించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. గ్రహదోషాలు తొలగిపోతాయి.

విజయానికి

విజయానికి

మీరు విజయం సాధించడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కానప్పుడు జేహి విధి హోయి నాత్ హిట్ మోరా కరాహు సో వేగి దాస్ మెయిన్ తోరా అని స్మరించుకోవాలి. అంటే ఓ శివదేవా నేను మీ భక్తుడిని, నేను ఏం చేయాలో నాకు తెలియదు, కాబట్టి నాకు ఏది మంచిదో అది చేసే శక్తిని ప్రసాదించు అని అర్థం. ఈ మంత్రంలోని పరమార్థం జీవితంలో సక్సెస్ అవడానికి దారి చూపించు అని.

కాలసర్ప దోష నివారణ పూజ

కాలసర్ప దోష నివారణ పూజ

ఏడు గ్రహాలు ఒకేదగ్గర ఉన్న సమయంలో రాహు, కేతువు ఉంటే దాన్నికాల సర్ప యోగం అంటారు. ఈ సమయంలో పుట్టిన వాళ్లకు జీవితంలో అనేక రకాల సమస్యలు, జీవితాంతం ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి ఈ దోషం నివారించడానికి ఈ కాలసర్పదోష పూజ చేయించుకోవాలి.

హనుమంతుడి పూజ

హనుమంతుడి పూజ

సూర్యోదయానికి ముందు హనుమాన్ చాలీసా మంత్రం జపిస్తూ ఆంజనేయస్వామికి పూజ చేయడం వల్ల మీకు, మీకుటుంబానికి మంచి జరుగుతుంది. భయం తొలగించి, ధైర్యాన్ని ఇస్తుంది ఈ పూజ. జీవితంలో అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది.

శనిదేవుడికి అభిషేకం

శనిదేవుడికి అభిషేకం

శని శింగాపూర్ లో స్వయంభువుగా వెలసిన అత్యంత శక్తివంతమైన శనీశ్వరుడుకి శనిదోషం తొలగించే అద్భుతమైన శక్తి ఉంది. కాబట్టి ఈ ఆలయాన్ని సందర్శించి తైలాభిషేకం నిర్వహించడం వల్ల కీడు, వివాహ సంబంధ దోసాలు, సమస్యలు తొలగిపోతాయి.

పార్థివ శివలింగ పూజ

పార్థివ శివలింగ పూజ

శివుడికి నిర్వహించే పూజల్లో ఇది చాలా శక్తివంతమైనది. మట్టితో చేసిన 108 శివలింగాలకు గంగానది దగ్గర అభిషేకం నిర్వహిస్తారు. ఈ పూజ ఓంకారేశ్వర్, కాశీ జ్యోతిర్లింగం ఆలయాల్లో నిర్వహిస్తారు. కాబట్టి ఈ పూజ చేయించుకోవడం వల్ల గ్రహ దోషాలు, అనారోగ్య సమస్యలు, ఒత్తిడి తొలగిపోతుంది.

English summary

9 chants and poojas to ensure a great life ahead

9 chants and poojas that will ensure you a great life ahead. Chanting is a spiritual discipline believed to improve listening skills, heightened energy and more sensitivity toward others.
Desktop Bottom Promotion