Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శ్రీనివాసుని రక్తపు చుక్కలే..శేషాచలం ఎర్రచందనం!..రెడ్ గోల్డ్ కథ మీకు తెలుసా?
శేషాచలం అడవులు.. కేవలం అపారమైన జీవవైవిధ్యానికే కాదు, ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎర్రచందనం వృక్షాలకు ప్రసిద్ధి. ఈ చెక్కకున్న అంతర్జాతీయ మార్కెట్, విలువ అందరికీ తెలిసిందే. కానీ ఈ చెట్ల రంగు ఎందుకు అంత దట్టమైన ఎరుపు రంగులో ఉంటుంది? దాని వెనుక దాగిన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటి?
పురాణాలలో దీనికి సమాధానం
కృతయుగంలో భృగు మహర్షి శాపం కారణంగా మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి వస్తుంది. ఆమెను వెతుక్కుంటూ మహావిష్ణువు కూడా భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిగా శేషాచలం కొండల్లోని ఒక పుట్టలో ఆశ్రయం పొంది ఘోర తపస్సు చేయడం ప్రారంభిస్తారు.

ఆహారం, నీరు లేకుండా శ్రీనివాసుడు తపస్సులో నిమగ్నమై ఉంటాడు. ఇది చూసిన బ్రహ్మ, శివుడు ఆందోళన చెంది, శ్రీనివాసుడి ఆకలి తీర్చడానికి ఒక ఉపాయం పన్నుతారు. వారు ఆవు, దూడ రూపాలను ధరించి ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు పశువుల మందలో కలుస్తారు.
ప్రతిరోజూ పశువుల కాపరి ఆ ఆవుల మందను మేత కోసం శేషాచలం కొండలకు తీసుకువచ్చేవాడు. ప్రతిరోజూ ఆ ఆవు శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న పుట్టపై తన పాలను ధారగా కురిపించి ఆయన ఆకలిని తీర్చేది. అయితే ప్రతిరోజూ ఆవు పాలు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన పశువుల కాపరి ఒకరోజు ఆవును రహస్యంగా వెంబడిస్తాడు.
పుట్టపై ఆవు పాలు కురిపించడం చూసి ఎవరో మాయగాడు తన రాజుగారి పాలను దొంగిలిస్తున్నాడని భావించి, ఆగ్రహంతో తన చేతిలోని గొడ్డలిని ఆవుపైకి విసురుతాడు.
ఆ గొడ్డలి దెబ్బ ఆవుకు తగలకుండా, పుట్టలో ఉన్న శ్రీనివాసుడు స్వయంగా పుట్ట నుండి బయటకు వచ్చి అడ్డుపడతాడు. ఆ గొడ్డలి వేటు నేరుగా శ్రీనివాసుడి నుదుటిపై తగులుతుంది. ఆ దెబ్బకు ఆయన శిరస్సు నుండి రక్తం ధారగా కారుతుంది. శ్రీనివాసుడి నుదుటి నుండి రక్తం ధారగా కారి, శేషాచలం నేలపై చిందుతుంది.
ఆ రక్తమే ఎర్ర చందనం
అలా నేలపై పడిన శ్రీనివాసుని రక్తపు చుక్కలు పడిన ప్రతిచోటా మొలకలు పుట్టి అవి ఎర్రని అంతర్భాగంతో, విశిష్టమైన సుగుణాలతో కూడిన వృక్షాలుగా పెరిగాయి. అవే నేటి ఎర్ర చందనం చెట్లు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
సాక్షాత్తూ శ్రీవారి రక్తంతో పుట్టిన కారణంగానే ఆ చెక్క అంతటి పవిత్రతను, శక్తిని, ఎరుపు రంగును సంతరించుకుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఎర్రచందనం కేవలం ఒక కలపగా కాకుండా, దైవాంశ సంభూతంగా పరిగణించబడుతుంది.
ఎర్రచందనం చెక్కని పూజా కార్యక్రమాలలో దేవతా విగ్రహాల తయారీలో, యజ్ఞయాగాదులలో విరివిగా ఉపయోగిస్తారు.ఈ చెక్కలో రోగనిరోధక శక్తిని పెంచే, చర్మాన్ని కాపాడే అద్భుతమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయని నమ్ముతారు.
శేషాచలం కొండల్లో పెరిగే ప్రతి ఎర్రచందనం చెట్టు శ్రీవారి త్యాగానికి, కరుణకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ నమ్మకమే ఎర్రచందనాన్ని కేవలం ఒక ఖరీదైన వస్తువుగా కాకుండా, కోట్లాది మంది భక్తుల హృదయాల్లో ఒక దైవిక సంపదగా మార్చింది.



Click it and Unblock the Notifications