Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
కాకి తల మీద వాలితే మరణం..! మూడ నమ్మకమా? సైన్సా..?
కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా మూఢ నమ్మకాలను నమ్మి మనుషులను బలిస్తున్న సంఘటనలను మనం అప్పుడప్పుడు టీవీల్లో, పేపర్లో చూస్తూ వుంటాం. చదువు కోనివారు ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మి మోసపోతుంటే నమోద్దని చెప్పి వారిని చైతన్య వంతుల్ని చేయవలసిన చదువుకున్న వారే ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్ముతూ తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉంటే వారిని ఏమనాలి. అలాంటిదే ఒక సంఘటన ఆ మద్య బెంగూళూర్ లో జరిగింది. ఒక ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి కేవలం తన తలమీద కాకి తన్నిందని తనకు ఏదో జరుగుతుందన్న అపోహతో ఆత్మహత్య చేసుకున్నాడు.
సహజంగా హిందూ సంప్రదాయంలో కాకిని అపశకునంగా భావిస్తారు. కాకి అరవడమే ఆలస్యం. అరే మీ ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారని బంధువులు అనడం మనం చూస్తూనే ఉంటాం. పట్టణాల్లో లేకపోయినా పల్లె సీమల్లో ఇప్పటికీ అదే మాట వాడుతుంటారు. కాకి: ఇది వచ్చి వాలితే మంచి జరుగుతుందని కొందరు, చెడు జరుగుతుందని కొందరు నమ్ముతారు. కాకి సందేశాల్ని మోసుకొస్తుందని, అది అరిస్తే బంధువులు కానీ శుభవార్త కానీ వస్తుందని చాలామంది అంటారు. కొందరేమో... కాకి నల్లగా ఉంటుంది కాబట్టి, నలుపు పాపానికి, విషాదానికి ప్రతీక కాబట్టి చెడు జరుగుతుందని అంటారు.
కొన్ని సార్లు కాకి అరుస్తున్నట్లు ఆ అరుపు ఏంటిరా అని తిట్టుకోవడం సాధారణ విషయమే. కానీ కాకి కాళ్లు తలకు తగిలితే కచ్చితంగా తల స్నానం చేయమంటారు పెద్దలు. అది తెలిసి చెబుతారో తెలియక చెబుతారో గానీ...ఇందులో శాస్త్రీయ కోణం దాగి ఉంది. అదేంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

కాకి తల మీద వాలడం గురించి కొన్ని శాస్త్రీయ కారణాలు
కాకి తినే ఆహారం మనకు ముక్కుపుటలు అదిరేపోయేలా ఉంటుంది. చచ్చిపోయిన ఎలుకను, చనిపోయిన జంతువుల మాంసాన్ని, కుళ్లి పోయిన పదార్థాలను చాలా కమ్మగా తింటుంది కాకి.

కాకి తాకితే తలస్నానం ఎందుకు చేయాలి..?
జంతువుల కళేబరాల పై వాలి కాకులు వాటి మాంసాన్ని జుర్రు కుంటాయి. అలా చాలా సేపు కాకి వాలడం వల్ల ఆ జంతువులకు ఉన్న సూక్ష్మక్రిములు, అనారోగ్య కారక పదార్థాలు దాని కాలి వేళ్లల్లో అంటుకుంటాయి.

కాకి తాకితే తలస్నానం ఎందుకు చేయాలి..?
అంతే కాదు.. కాకికి అవి చుట్టుకుంటాయి. కాకికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువే. కుళ్లినవి తిన్నా దానికి ఏం కాదు. కానీ ఆ కాకి ఎగిరొచ్చి మనషుల తలల మీద వాలినప్పుడు ఆ సూక్ష్మ క్రిములు, అనారోగ్య కారక పదార్థాలు మన తల మీద పడతాయి.

కాకి తాకితే తలస్నానం ఎందుకు చేయాలి..?
ఫలితంగా ఆ క్రిములు తల నుంచి చెవుల్లోకి, చేతుల్లోకి చివరకు శరీరంలోకి ప్రవేశించి రోగాలు వస్తాయి. కొన్ని సార్లు కాళ్లతో తల మీద రక్కడంతో రక్తస్రావం అవుతుంది. వేగంగా ఎగిరే కాకి అంతే వేగంతో కాలిగోటితో తన్నుతాయి.

కాకి తాకితే తలస్నానం ఎందుకు చేయాలి..?
ఫలితంగా గాట్లు పడతాయి. ఆ గాట్ల ద్వారా శరీరంలోకి ప్రమాదకర సూక్ష్మక్రిములు చేరి రోగాల బారిన పడే వీలుంది. అందుకే వెనుకటి కాలం పెద్దలు కాకి వాలితే వెంటనే తల స్నానం చేయాలని చెప్పేది.

కాకి తాకితే తలస్నానం ఎందుకు చేయాలి..?
తల స్నానం చేయడం వల్ల మురికి, అనారోగ్యకారక పదార్థాలు తొలగిపోతాయి. రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యే ఇది.

కాకి తాకితే తలస్నానం ఎందుకు చేయాలి..?
ఇది మూఢనమ్మకం అనే ప్రచారం ఉంది. మూఢ నమ్మకంలోనే సైన్స్ దాగుందన్నది నిజం. మూఢ నమ్మకాలు మంచిది కాదు. కానీ పెద్దలు చెప్పే మాటల్లోని అంతరార్ధం తెలుసుకుంటే చాలు. మనకు మేలు జరుగుతుంది.

కాకి తాకితే తలస్నానం ఎందుకు చేయాలి..?
శని మహాత్మునికి, కాకికి సంబంధం ఏమిటి? కాకకి భూసుండి, అనే వారు శ్రీ మహావిష్ణువుని తిట్టటం వల్ల, కాకిగా పుట్టాడు. కాక భూసుండి వంశస్తులు శ్రీ హరిని పూజించారు, అప్పుడు శ్రీహరి వారికి వరం ఇచ్చాడు.

కాకి తాకితే తలస్నానం ఎందుకు చేయాలి..?
కాకి శనికి వాహనముగా ప్రమకటించి, పితృదేవతలకు సమర్పించే ఆహారం కాకుల ద్వారా అందాలని వరం ఇచ్చాడు. అలా కాకికి , శని భగవానునికి సంబంధం ఏర్పడినది.

కాకి తాకితే తలస్నానం ఎందుకు చేయాలి..?
కాకి శని వాహనం కాబట్టి.. కాకి తగిలితే.. శని దోషం జరుగుతుందని, యముడి రాకకి సంకేతమని భయపడతారు. కానీ.. దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

కాకి తాకితే తలస్నానం ఎందుకు చేయాలి..?
కాకి నెత్తిమీద తంతే , ఉన్న ఆస్తిపోవటం లేదా మ్రుత్యుభయం అని అర్ధం. దీనికి విరుగుడ 3 శనివారాలు నవగ్రహాలకు శని శ్లోకం పటిస్తూ 108 ప్రదక్షిణాలు చేయటం లేదా 3 శనివారాలు ఆంజనేయునికి తమలపాకులతో అర్చన, పూజ చేయటం మంచిది.

కాకి తాకితే తలస్నానం ఎందుకు చేయాలి..?
కాకి వాలిన వారూ, కాకి కాలి గోళ్ళు తగిలిన వారూ , ముఖ్యంగా శిరస్సు మీద వాలిన వారూ, తప్పనిసరిగా భగవత్ ఆలయానికి వెళ్లి 108 సార్లు ధ్యానం తప్పనిసరిగా చేయాలి.

కాకి తాకితే తలస్నానం ఎందుకు చేయాలి..?
అలా జరిగినప్పుడు ఒక్కోసారి తలలో ఉండే సున్నిత భాగం ఇబ్బందిపడే అవకాశం ఉంది. అందుకే దైవ ధ్యానం చేస్తే చాలు.

కాకి తాకితే తలస్నానం ఎందుకు చేయాలి..?
హిందు మైథాలజీ ప్రకారం కాతి నెత్తిమీద వాలినప్పుడు మన పూర్వీకులు లేదా పితృదేవతలకు మన జీవితంలో సంబంధం కలిగి ఉన్నట్లు భావించాలి. కాబట్టి, పిత్రుదేవుళ్ళను సంతోష పరచడానికి కొన్ని పూజలు చేయించాలి. దేవాలయాల్లో దీపాలు పెట్టాయిలి, శనిమహాత్మ దేవాలయ దర్శనం చేసి రావాలి.



Click it and Unblock the Notifications
