Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
'ఆదిపురుష్'లో ఈ మిస్టేక్స్‌పైనే ఫ్యాన్స్ ఆగ్రహం, అవేంటంటే..
భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ మూవీపై ఏ సినిమాపై రానంత నెగెటివిటీ వస్తోంది. జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి. పాత్రల వేషాధారణ, పాత్రల పేర్లు, వస్త్రాధారణ, డైలాగులు ఇలా అన్నింటిపై సోషల్ మీడియాలో తెగ మీమ్స్ షేర్ చేస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని విమర్శిస్తున్నారు.
అందరికీ రామాయణం గురించి తెలుసు. 1970ల నుంచి వస్తున్న రామాయణ సినిమాలు చూస్తూ వస్తున్నారు ప్రజలు. రామాయణం అనగానే అప్పటి వేషాధారణ, బాడీ లాంగ్వేజీ, డైలాగులు, హావభావాలు ఇలా అన్నీ గుర్తుకు వచ్చేస్తుంటాయి. ఆదిపురుష్ లో ఇవేవీ పాత కాలపు సినిమాలతో మ్యాచ్ అవ్వలేదు. ఆదిపురుష్ లో పాత్రల పేర్లు కూడా రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, రావణుడు అని కాకుండా.. రాఘవుడు, జానకి, శేషు, భజరంగీ, లంకేషుడు అని పిలవడం కూడా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అలాంటి కొన్ని పొరపాట్ల వల్ల ఆదిపురుష్ మూవీపై ఇంతగా నెగిటివిటీ వస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాముడి రూపం:
మనకు తెలిసిన రాముడి రూపానికి మీసాలు ఉండవు. అలాగే రాముడు అంటేనే నీలమేఘశ్యాముడు. సాధారణ వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ ఆదిపురుష్ లో కనిపించిన రాఘవుడికి మీసాలు ఉన్నాయి. నీలమేఘశ్యాముడు కూడా కాదు. కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తాడు. అలాగే జీసస్ లా దుస్తులు ధరించడంపైనా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

2. రావణుడి లుక్:
రావణుడు అంటే గంభీరమైన రూపంతో పెద్ద కిరీటంతో ఒంటి నిండా నగలతో కనిపిస్తాడు. ఆదిపురుష్ లో లంకేషుడు విచిత్రమైన వేషాధారణలో స్పైకీ హెయిర్ స్టైల్ తో కనిపిస్తాడు.\

3. జీర్ణించుకోలేని డైలాగులు:
"జో హుమారి బెహ్నో కో హాత్ లగాయేంగే, ఉంకీ లంక లగా దేంగే" (మా సోదరీమణులకు హాని చేసేవారి భూమికి నిప్పు పెడతాము). "కప్డా తేరే బాప్ కా.. తెల్ తేరే బాక్ కా, ఆగ్ బి తేరే బాప్ కి.. తో జలేగి బి తేరే బాప్ కి" (గుడ్డ మీ నాన్నదే.. నూనె మీ నాన్నదే.. నిప్పు మీ నాన్నదే.. కాలేది కూడా మీ నాన్నదే..) ఇలాంటి జీర్ణించుకోలేని డైలాగులు చాలానే ఉన్నాయి.

4. ఇంద్రజిత్ లుక్:
ఆదిపురుష్ లో ఇంద్రజిత్ లుక్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. టాటూ ఆర్టిస్ట్ లా ఉన్నాడంటూ విమర్శిస్తున్నారు. లుక్ భిన్నంగా ఉండాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.

5. లంకేషుడి 10 తలలు:
ఆదిపురుష్ మూవీలో లంకేష్ పాత్రపైనా విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. రావణుడి అంటే 10 తలలు. అయితే ఈ 10 తలలను ఇష్టమొచ్చినట్లుగా పెట్టేసి కొత్త లుక్ ట్రై చేసినా.. ఆ లుక్‌ను ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే విపరీతమైన విమర్శలు వస్తున్నాయి.

6. చారిత్రక తప్పిదాలు:
* కుంభకర్ణుడి చేత ఆంజనేయుడ్ని కొట్టించడం
* కుంభకర్ణుడికి తెలియకుండా రాముడు బాణం వేసి చంపడం
* మహాసాధ్వి మండోదరిని విధవగా చూపించడం
* వాల్మీకి రామాయణం ప్రకారం సీత.. లక్ష్మణుడిని శంకిస్తుంది. అది చూపించకపోవడం
* సీత రావణుడిని కంటితో చూసినట్లు రామాయణంలో లేదు.. అలాగే రావణుడితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు గడ్డిపోచతో మాట్లాడింది తప్పా.. రావణుడి ముఖం చూడలేదు
* లంక బంగారుమయం, దానిని కుబేరుడి నుంచి రావణుడు లాక్కున్నాడు. కానీ ఆదిపురుష్ లో బూత్ బంగ్లాలు చూపించడం
* స్త్రీల ముఖాన బొట్టులేకపోవడం, శివభక్తుల నుదుటన శివ నామాలు లేకపోవడం
* సీతమ్మ వారి వస్త్రాధారణ మోడర్న్ గా ఉండటం



Click it and Unblock the Notifications
