Latest Updates
-
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు!
Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ రోజునే అందరూ బంగారం, వెండిని ఎందుకు కొంటారంటే...!
సనాతన ధర్మం ప్రకారం, అక్షయ తృతీయ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు.

ఈ ఏడాది అంటే 2023లో ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం నాడు ఉదయం 7:49 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే ఏప్రిల్ 22వ తేదీన తెల్లవారు జామున 12:21 గంటల వరకు కొనసాగనుంది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు.

ఈరోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు. అలాగే ఈ పవిత్రమైన రోజున కొత్త పనులు ప్రారంభించడం, శుభకార్యాలు చేయడం, కొత్త వ్యాపారాలు చేయడం వంటివి చేస్తారు.
అదే విధంగా వైశాఖ మాసంలోని మూడో రోజున వచ్చే అక్షయ తృతీయ రోజునే చాలా మంది బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఈరోజునే ఎందుకు కొనాలనుకుంటారు. ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యతలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

లక్ష్మీదేవికి స్వాగతం..
అక్షయ అంటే క్షయం కానిది(తరగనిది). అంటే ఈ పవిత్రమైన రోజున మనం ఏదైనా పని చేస్తే, ఆ పని కచ్చితంగా అక్షయమవుతుందని చాలా మంది నమ్మకం. ఈరోజు ఏ పూజ చేసినా.. ఏ దానమైనా.. ఏ పుణ్య కార్యం చేసినా దాని ఫలితం అక్షయం అవుతుందని పండితులు చెబుతున్నారు. అదే విధంగా అక్షయ తృతీయ రోజున ఏ వస్తువు కొనుగోలు చేసినా.. అది ఎప్పటికీ తమతోనే ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకే బంగారం కొనడం ద్వారా లక్ష్మీదేవికి స్వాగతం పలకొచ్చని చాలా మంది భావిస్తారు.

విష్ణుమూర్తి పూజలు..
పురాణాల ప్రకారం, తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది కాబట్టి అక్షయ తృతీయకు చాలా విశేషముంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష చేపట్టి.. ఏ పుణ్య కార్యం చేసినా దాని ఫలితం అక్షయంగానే ఉంటుందని పండితులు చెబుతారు. ఈ తిథి రోజున అక్షయుడైన విష్ణుమూర్తిని పూజిస్తారు. అందుకే ఈరోజును అక్షయ తృతీయ అని పిలుస్తారు.

పురాణాలను పరిశీలిస్తే..
రావణాసురుడు లంకను ఆక్రమించుకోవడానికి ముందు కుభేరుడు లంకా నగరాన్ని పాలించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. కుభేరుడు.. శివుని, బ్రహ్మదేవుని ఆశీస్సుల కోసం తపస్సు చేశాడు. దీని ఫలితంగా ఎన్నో వరాలను పొందాడు. అల్కాపురి నగరాన్ని దేవతల వాస్తు శిల్పి అయిన విశ్వ కర్మ.. కుభేరుడి కోసం కైలాస పర్వతం దగ్గర నిర్మించాడు. అక్షయ తృతీయ రోజున కుభేరునికి స్వర్గ సంపద సంరక్షకుని పాత్ర లభించందని పండితులు చెబుతారు. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం ద్వారా, కుభేరుని ఆరాధించడం వల్ల తమ కుటుంబంలో ఐశ్వర్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

అక్షయ పాత్ర..
మరో కథనం మేరకు.. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, శ్రీక్రిష్ణ పరమాత్ముడు వారిని కలిశాడు. ఆ సమయంలో ద్రౌపది తనకు భోజనం వడ్డించలేకపోయింది. అయితే క్రిష్ణుడు అక్కడ ఉన్న వంటపాత్రలో ఉన్న చిన్న మెతుకును ఆహారంగా స్వీకరించి, పాండవులకు తనపై ఉన్న ప్రేమ తన ఆకలి తీరుస్తుందని చెబుతూ.. పాండవులకు అక్షయ పాత్రని వరంగా ఇచ్చాడు.

అనునిత్యం ఆహారం..
అప్పటి నుంచి పాండవులు వన వాసంలో ఉన్నంత కాలం ఈ అక్షయ పాత్ర అనునిత్యం ఆహారం అందించేది. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల తమ కుటుంబానికి అనంత సౌభాగ్యం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ రోజు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
సనాతన ధర్మం ప్రకారం, అక్షయ తృతీయ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే 2022లో మే 03వ తేదీ మంగళవారం నాడు ఈ పవిత్రమైన పండుగ వచ్చింది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు. ఈరోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు.



Click it and Unblock the Notifications