Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, నేటి నుంచి భక్తులకు పండుగ
కలియుగ వైకుంఠదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతి వారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు.
ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27వ తేదీ ఆదివారం నుంచి 29వ తేదీ మంగళవారం వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీవారి మూలవిరాట్ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు.
భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు. అంకురార్పణ కారణంగా శనివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయం చాలా పవిత్రమైనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ప్రతి రోజు 50 వేల నుంచి సుమారు 1 లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

భారతదేశం నుంచి కాకుండా విదేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చి వెలుతుంటారు. ఏడాది పొడవునా శ్రీవారి భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంటుంది. తిరుమలకు చేరుకుని తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు స్వామివారిని భక్తిశ్రద్దలతో పూజిస్తుంటారు.
ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, టీటీడీ సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల శ్రీవారి ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి.
1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ శ్రీహరి, పారుపత్తేదార్ తులసీ ప్రసాద్ తో పాటు టీటీడీ అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో జరగనున్న పవిత్రోత్సవాలను ఎస్ వీబీసీ చానల్ లో ప్రసారం చెయ్యడానికి సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీవారి పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం అవుతున్న ఆదివారం టీటీడీ పాలక మండలి సభ్యులుగా నియమించబడిన సీ. మోహిత్ రెడ్డి, నేరాసు నాగసత్యం, సుదర్శన్ వేణు టీటీడీ సభ్యులుగా శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు.



Click it and Unblock the Notifications