Latest Updates
-
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.!
Ashadha Amavasya 2022:ఈ అమావాస్య వేళ ఈ పరిహారాలు పాటిస్తే.. పితృ దోషాలు తొలగిపోతాయట...!
ఆషాఢ అమావాస్య వేళ పితృ దోషం, కాలసర్ప దోషం పోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ మతం ప్రకారం, ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే విధంగా ప్రతి నెలలో ప్రతి ఒక్కరోజుకు ఏదో ఒక ప్రాముఖ్యత అనేది కచ్చితంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో మనలో చాలా మంది కష్టాల నుండి విముక్తి కోసం, పాపాల నుండి ప్రాయశ్చితం కోసం ఏవేవో పరిహారాలను పాటిస్తూ ఉంటాం. అందులో భాగంగా అమావాస్య తిథి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి, భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాం. అనంతరం దాన ధర్మాలు వంటివి చేస్తూ ఉంటాం. అయితే ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకు మాత్రం ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ పవిత్రమైన రోజున పితృ తర్పణం మరియు శ్రాద్ధం చేయడం ద్వారా పూర్వీకుల మోక్షాన్ని పొందుతారని, కుటుంబ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య ఆషాధి అమావస్య అని కూడా అంటారు. ఈ నేపథ్యంలో ఆషాఢ అమావాస్య ఎప్పుడొచ్చింది? ఈరోజున ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అమావాస్య శుభ ముహుర్తం..
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆషాఢ మాసం నాలుగో నెల. ఛైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసం తర్వాత ఆషాఢం వస్తుంది. 2022 సంవత్సరంలో ఆషాఢం అమావాస్య జూన్ 28వ తేదీ నుండి జూన్ 29వ తేదీ బుధవారం వరకు ఉంటుంది. అందుకే అమావాస్య ప్రారంభ తిథిని 29వ తేదీగా పరిగణిస్తారు.
అమావాస్య ప్రారంభ తిథి : జూన్ 28న మంగళవారం ఉదయం 5:52 గంటలకు
అమావాస్య తిథి ముగింపు : జూన్ 29న బుధవారం ఉదయం 8:21 గంటలకు

పాటించాల్సిన పరిహారాలు..
* ఆషాఢ అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి.
* పవిత్రమైన గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఒకవేళ అది మీకు వీలు కాకపోతే నదిలోని నీటిని బాటిల్ లో నింపుకుని వాటిని మీ ఇంట్లో స్నానం చేసే పాత్రలో వేసుకుని స్నానం చేయండి.
* సూర్యోదయం సమయంలో సూర్యభగవానుడికి నీరు అర్పించండి.
* ఈరోజున నది తీర ప్రాంతానికి వెళ్లి పూర్వీకులను స్మరించుకోవాలి. పితృ ఆరాధన చేయాలి.
* వారి ఆత్మ శాంతి కోసం ఈరోజున ఉపవాసం ఉండాలి.
* నిరుపేదలకు విరాళాలు ఇవ్వండి (మీ సామర్థ్యం మేరకు)
* ఆషాఢ అమావాస్య రోజున పూర్వీకుల నుండి మోక్షం పొందడానికి, బ్రాహ్మణులను లేదా పురోహితులను ఇంటికి పిలిచి గౌరవంగా విందు ఏర్పాటు చేయాలి. మీ సామర్థ్యం మేరకు దక్షిణ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల దోషం నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్మకం.
* ఈ పవిత్రమైన రోజున వెండితో చేసిన సర్పానికి ప్రత్యేక పూజలు చేయాలి.
* ఈరోజున ఉదయాన్నే రావి చెట్టుకు నీరు అర్పించి, సాయంకాలం వేళ దీపాన్ని వెలిగించాలి.
* చీమలకు పంచదార కలిపిన పిండిని, చేపలకు పిండి బాల్స్ ను ఆహారంగా ఇస్తే శుభ ఫలితాలను పొందుతారు.
* ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు.
గమనిక : ఇక్కడ ప్రచురించబడిన సమాచారం కొందరు పండితులు తెలిపిన సమాచారం మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నది మాత్రమే. ఈ కథనానికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. వీటిని పరిగణనలోకి తీసుకునే ముందు మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించి తుది నిర్ణయం తీసుకోగలరు.



Click it and Unblock the Notifications