Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
అష్టదిక్పాలకులు ఆధీనంలోనే మీ ఇళ్లు ఉంటాయి.. వారిని ప్రసన్నం చేసుకుంటే అన్నీ సుఖాలే
అష్టదిక్పాలకులు ఆధీనంలోనే మీ ఇళ్లు ఉంటుంది.. వారిని ప్రసన్నం చేసుకుంటే అన్నీ సుఖాలే
మనం చదువుకునే రోజుల్లో 'అష్టదిక్పాలకులు' అనే పదాన్ని చదివే ఉంటాం. ఆ అష్టదిక్పాలకులు ఎవరో తెలుసా?నాలుగు ప్రధాన దిక్కులతో పాటు.. నాలుగు దిక్కుల మూలలకు కాపలాగా ఉండే వారినే అష్టదిక్పాలకులు అంటారు. ప్రతి ఇంటికి ఎనిమిది దిక్కులు ఉంటాయి.
ఒక్కో దిక్కును ఒక్కో దేవత పరిపాలిస్తుంటారు. ఆ ప్రకారం తూర్పు దిక్కుకు అధిష్టాన దేవత ఇంద్రుడు. ఈయన సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడు కనుక ఈ భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. ఈ దిక్కులో బావులు, బోర్లు నిర్మించటం వల్ల శుభం చేకూరుతుంది.

పడమర దిక్కుకు వరుణ దేవుడు
పడమర దిక్కునకు అధిష్టాన దేవత వరుణ దేవుడు. తూర్పు దిక్కుకన్నా తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఎత్తుగా ఉండే విధంగా చూసుకున్నట్లయితే సర్వశుభములు కలుగుతాయి. పడమర భాగంలో మంచి నీటి బావులు, బోరులు నిర్మించుకోవచ్చు. అయితే ఇవి విదిశలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉత్తర దిక్కుకు కుబేరుడు
ఉత్తర దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగానూ విశాలంగానూ ఈ దిశ ఉండాలా చూసుకోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు ఏర్పాటు చేసుకోవటం మంచిదే. దీనివల్ల విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరుగే అవకాశం ఉంది.

దక్షిణానికి యముడు
అలాగే దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తరదిశ ఖాళీ స్థలం కన్నా ఈ దిశలో తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.

ఈశాన్య దిక్కుకు ఈశ్వరుడు
ఈశాన్య దిక్కుకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగా, పల్లంగానూ ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కనుక ఈ దిశలో నీరు... బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భక్తి జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.

ఆగ్నేయానికి అగ్నిదేవుడు
ఆగ్నేయానికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు. అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవటం శుభం. బావులు, గోతులు... ఇతర దిశలకన్నా ఎక్కువ పల్లంగా ఉంచటం ఎంత మాత్రం మంచిదికాదు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు స్థిరాస్థులు కోల్పోవటం జరుగుతుంది.

వాయవ్యానికి వాయువు
వాయవ్యానికి అధిష్టాన దేవత వాయువు. నైరుతి,ఆగ్నేయ దిశలకన్నా పల్లంగానూ, ఈశాన్య దిక్కుకన్నా మిర్రుగానూ ఉండాలి. అదే విధంగా ఈ దిశలో నూతులు,గోతులు ఉండకుండా చూసుకోవాలి. ఈ దిశ ఈశాన్యం కన్నా హెచ్చుగా పెరిగి ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల పుత్ర సంతతికి హాని, అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉంది.

నైరుతికి నివృత్తి
నైరుతి దిక్కుకు అధిష్టాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్న దిక్కులకన్నా ఈ దిశ తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. ఈ దిశలో ఎక్కువగా బరువులు వేయటం శుభం. ఈ దిశలో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.

అష్టదిక్పాలకుల సతీమణుల పేర్లు
ఇక అష్టదిక్పాలకుల భార్యల పేర్లు చాలా మందికి తెలియవు.
వీరికి భార్యలు కూడా ఉన్నారు. వీరి పేర్లను పరిశీలిస్తే.. ఇంద్రుని భార్య శనీదేవి, అగ్నిదేవుని భార్య స్వాహాదేవి, యముని భార్య శ్యామలాదేవి, నిర్భతి భార్య దీర్ఘాదేవి, వరుణుని సతీమణి కాళికాదేవి, వాయుదేవుని భార్య అంజనాదేవి, కుబేరుని భార్య చిత్రరేఖాదేవి, ఈశానుని భార్య పార్వతీదేవి.

పూజలు
ఈ అష్టదిక్పాలకులకు కొందరు ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. దాని వల్ల ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖంగా జీవించగలుగుతారు.
ఇక అష్టదిక్పాలకులకు మధ్యలో మరో దిక్కును ఉంచి నవదిక్పాలకులను పూజించిన సందర్భాలూ ఉన్నాయి. హిందువుల మత విశ్వాసంలో ఈ అష్టదిక్పాలకులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మన వాస్తు శాస్త్రమంతా ఈ అష్టదిక్కుల మీదే ఆధారపడి ఉంది. ఆయా దిక్కులకు అధిపతులైన దేవతల లక్షణాలకు అనుగుణంగా వాస్తులోని చాలా సూత్రాలు రూపొందింపబడి ఉన్నాయి.

మంత్రాలు
మన పురాతన ఆలయాలలోని పైకప్పుల మీద సైతం ఈ అష్టదిక్పాలకుల ప్రతిమలు ఉండటాన్ని గమనించవచ్చు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతునికి తాము ప్రతినిధులం అన్న సూచనను బహుశా వీరు అందిస్తుంటారేమో! ఇలా ఎనిమిది దిక్కులకూ కూడా దేవతలకు పాలకులుగా భావించడం హిందూ ధర్మంలోనే కనిపిస్తుంది.
ఈ అష్టదిక్పాలకులకు చెందిన మంత్రాలను పూజించడం వలనా, వారికి సంబంధించిన యంత్రాలను ఆరాధించడం వల్ల సకల శుభాలూ కలుగుతాయన్నది భక్తుల నమ్మకం. వీరినే కాకుండా కొందరు ఊర్ధ్వ దిక్కుకి బ్రహ్మనూ, అధో దిక్కుకు విష్ణువునూ పాలకులుగా భావిస్తుంటారు. ఇక అష్టదిక్పాలకులు ఆధీనంలోనే ఇళ్లు ఉంటుంది.. కాబట్టి వారిని ప్రసన్నం చేసుకుంటే అన్నీ సుఖాలే ఉంటాయని చాలా మంది నమ్మకం.



Click it and Unblock the Notifications
