Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
తిరుమల దర్శనం ఇలా చేసుకుంటే ఫలితం వుండదు.. ప్రముఖ జ్యోతిష్యులు హరిశ్రీనివాస దీక్షితులు సూచనలు..!
వేదాంతం హరిశ్రీనివాస దీక్షితులు. జ్యోతిష్య రంగంలో దాదాపు 25 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తూ ఎన్నో అవార్డులను, రివార్డులనూ పొందారు. గత ముప్పై సంవత్సరాలుగా బోడుప్పల్‌లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చక స్వామిగా పనిచేస్తున్నారు. వాస్తు రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఉపాయాలు కూడా చెబుతూ వారి గురువుగారి ఆశీస్సులతో ధనపరంగా, కీర్తి పరంగా మంచి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. వాస్తు, జ్యోతిష్యంలో, ప్రశ్నాశాస్త్రంలో, పురోహితంలో ఎవరికి ధర్మ సందేశం విషయంలో కానీ, ఎవరికి సలహాలు ఇవ్వడానికైనా సదా సిధ్దంగా వుంటారు. జ్యోతిష్య శాస్త్రాన్ని చాలా రహస్యమైనదిగా పెద్దలు చెబుతాంటారు. ఈ శాస్త్రాన్ని బహిర్గతం చేసి దాన్ని అభాసుపాలు చేసే వారు కూడా వున్నారని అంటున్నారు మన వేదాంతం హరిశ్రీనివాస దీక్షితులు. శాస్త్రాన్ని శాస్త్రంగానే పాటిస్తూ ముందుకు వెళ్లున్నామని ప్రముఖ జ్యోతిష్యులు, పురోహితులు వేదాంతం హరిశ్రీనివాస దీక్షితులు చెబుతున్నారు. ఆయన చెప్పిన మరిన్ని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల గురించి చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి. తిరుమల అంటే తమిళంలో తిరు అంటే శ్రీ, మల అంటే కొండ. అందువల్ల తమిళనాడులో తిరుమల క్షేత్రాన్ని తిరుమల అన్నారు. మనకు వున్న ఏడుకొండలల్లో వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి అని అంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి వెంకటాద్రిలో వున్నాడు.
వెంకటాచలానికి మించిన క్షేత్రం కానీ, వేంకటేశ్వరుడిని మించిన దైవం ప్రపంచంలో ఎక్కడా లేదు. తిరుమల వెళ్లేటప్పుడు ఏంచేయాలి అని సందర్భం వచ్చినప్పుడు. ఏ రోజైతే వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్లాలనుకుంటున్నామో ఆ రోజు ఆరాధన చేయాలి. వెంకటేశ్వర స్వామి ఫొటోకు పూజాదికాలు చేసుకొని, పొంగలి నైవేద్యం పెట్టి, మీ వద్దకు మేము వస్తున్నాం, మాకు దర్శనం కలిగించు స్వామి అంటూ దేవ దేవుడిని వేడుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టాలి.
తిరుమల వెళ్లిన తరువాత చాలా మంచి చేసే తప్పులు, చెప్పులు వేసుకొని తిరుగుతారు. తిరుమలలో చెప్పులు వేసుకోవడమనేది నిషిద్దం వెంకటాచలం మొత్తాన్ని సాల గ్రామంగా చెబుతారు. అంత పెద్ద సాల గ్రామం ఎక్కడా లేదని శాస్త్రం చెబుతోంది. అలాంటి సాల గ్రామం ప్రదేశానికి వెళ్లేటప్పుడు స్త్రీలైనా, పురుషులైనా చెప్పులు వేసుకోకుండా వెళ్లాలి. నడవగలిగిన సామర్ధ్యం ఉన్నవారు నడిచి స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా శ్రేష్టమైన విషయం.
కొంత మందికి శని జరుగుతూ ఉంటుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని సాగుతుంది. ప్రస్తుతం మకర, కుంభరాశుల వారికి ఏలి నాటి శని జరుగుతూ వుంది. కర్కాటక రాశివారికి అష్టమ వని, వృశ్చిక రాశి వారికి అర్డాష్టమ శని జరుగుతుంది. ఈ రాశివారు నడిచి స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి శనిదేవుడి ఆగ్రహం పోయి, అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిది కఠిన శిల. కఠిన శిల అంటే నల్లగా ఉన్నది అని అర్థం. విగ్రహాల్లో చాలా రకాలు ఉంటాయి. ఉత్తర భారతంలో తెలుపు రాయితో చేసిన విగ్రహాలు ఉంటాయి. దక్షిణ భారతంలో అయితే నలుపు రంగు విగ్రహాలు ఉంటాయి. కాబట్టి ఈ కఠిన శిల, నలుపు విగ్రహాలని ఆరాధిస్తే శని తొలగిపోతుంది.

స్వామివారికి నడిచి వెళ్లి దర్శించుకోవడం వల్ల, మనకు ఎక్కువ కష్టపడి వెళ్లడం వల్ల శని దేవుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. తిరుమల కొండ ఎక్కిన తరువాత చాలా మంది గెస్ట్ హౌసుల్లో, రూముల్లో స్నానం చేస్తారు. అలా కాకుండా స్వామి వారి ఆలయం పక్కనే సరస్సు ఉంటుంది. అదే సరస్సులో స్నానం చేయాలి. ఎందుకంటే ఆ సరస్సులో కోనేరులో సరస్వతీ నది ప్రవహిస్తోందని వరాహ పురాణంలో చెప్పబడి వుంది. కాబట్టి అక్కడ స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. శారీరకంగా ఏవైనా అనారోగ్యాలు ఉంటే కూడా తొలగిపోతాయి. స్వామి వారి కరుణ ఉంటుంది. స్నానం చేసేటప్పుడు, సబ్బులు, షాంపూలు లాంటివి ఉపయోగించకూడదు. బట్టలు కూడా ఉతక వద్దు. ఇలా చేయడం పెద్ద దోషంగా శాస్త్రం చెబుతోంది.
అక్కడ వున్న వరాహ క్షేత్రానికి అధిపతి వరాహ స్వామి వారు. వెంకటేశ్వర స్వామి మొదటిసారి భూలోకానికి వచ్చినప్పుడు వరాహ క్షేత్రంలో ఉంటానని అడిగినప్పుడు దాన్ని వరాహ స్వామి తిరస్కరించారు. మీరు ఇక్కడ ఉంటే నన్ను ఎవరూ పట్టించుకోరని అంటారు. దీంతో వెంకటేశ్వర స్వామి ఒక వరమిచ్చారు. తిరుమలకు వచ్చిన వారు మొదటగా వరాహస్వామిని దర్శించకున్న తర్వాతే తనను అనగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలన్నారు. కాబట్టి తిరుమల వెళ్లినప్పుడు మొట్టమొదటగా వరాహస్వామిని దర్శించుకున్నాకే వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలి. ఇలా చేయకుండా నేరుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే దర్శన ఫలితం ఉండదని శాస్త్రం చెబుతోంది.

గోవింద నామ స్మరణ చేస్తూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. స్వామి వారి దర్శనం తరువాత బయట వకుళమాత ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి తల్లి గారే వకుళమాత. ఈ మాత వున్న ఆలయం ఎదురుగానే స్వామివారి పోటు ఉంటుంది. పోటు అంటే ప్రసాద శాల. ఆమె కనుసన్నల్లోనే ప్రసాదాలు తయారు చేస్తారని శాస్త్రం చెబుతోంది. అక్కడ బయట అర్చకులు తీర్థం ఇస్తారు. ఆ తీర్థాన్ని తీసుకొని సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా చేస్తే చాలా మంచిది. భగవంతుడు ఇచ్చిన ఎనిమిది ముఖ్యమైన భాగాలైన రెండు కళ్లు, రెండు చెవులు, రెండు కాళ్లు, రెండు చేతులూ భూమికి ఆనించి మొక్కాలి. ఇలా సాష్టాంగ నమస్కారం చేయడం అత్యంత ఉత్తమమైంది. మహిళలు ఈ సాష్టాంగ నమస్కారం చేయాలన్న నియమం లేదు. వారు మోకాళ్లపైన కూర్చొని అర్థ సాష్టాంగ నమస్కారం చేయవచ్చు.
తరువాత స్వామి వారి శిఖరంపైన వెంకటేశ్వర స్వామివారు వెండితో కనబడుతుంటారు. ఇక్కడ ఇలా శిఖరంపైన వుండడం వల్ల విమాన వేంకటేశ్వరస్వామి అని అంటారు. బంగారు శిఖరంపైన స్వామివారు వెండితో కనబడుతుంటారు. లోపల సరిగ్గా దర్శనం చేసుకోలేని వారు బయటకు వచ్చి ఈ వెండితో వున్న స్వామివారిని దర్శనం చేసుకుంటే అంతే భాగ్యం, పుణ్యం లభిస్తుంది.
అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే నరసింహస్వామి వారు ఉంటారు. నరసింహ స్వామి వారిని దర్శించుకొని అక్కడి నుంచి ఈశాన్య దిశలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్తంభం చుట్టూ గంధంతో ముగ్గు వేసి ఉంటుంది. ఆ రాతి స్తంభం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయాలి. ఎందుకంటే తిరుమల ఆలయం నిర్మించేముందు మొట్టమొదటగా నిర్మించిన స్తంభం ఇదే. ఆ తరువాతే మొత్తం ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తరువాత బయటకు వస్తే ప్రసాదశాల ఉంటుంది. అక్కడి నుంచి మనం ఉంటున్న సత్రానికి తిరిగి రావచ్చు.
తిరుమలలో ఉన్నంతసేపు కోపతాపాలు లేకుండా ఉండాలి. ఎవరినీ నిందించకూడదు. అక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా ఎవరైతే వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారో వారికి మాత్రమే స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications