Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఈ నెలలో గృహ ప్రవేశానికి అనుకూలమైన తేదీలు, శుభ ముహుర్తాలివే..
హిందూ సాంప్రదాయం ప్రకారం గృహ ప్రవేశం అనేది చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు గృహ ప్రవేశాన్ని రెండు రకాలుగా జరిపేవారు
మీరు నవంబర్ నెలలో కొత్త ఇంటిని కొన్నారా? లేదా మీ ఇంటి నిర్మాణాన్ని ఈ నెలలో పూర్తి చేసేశారా? అన్ని పూర్తయ్యాక మంచి ముహుర్తం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే గృహ ప్రవేశానికి సంబంధించి ఈ నెలలో అనుకూల తేదీలు, పూజా వేళాలు, మరియు హోమం, వాస్తు శాంతి పూజల వివరాలను తెలుసుకోండి.

ఎందుకంటే గృహ ప్రవేశం అంటేనే హిందూ సంప్రదాయం ప్రకారం చాలా ఆచారాలు, ముహుర్తాలు, నక్షత్రాలు, తిథులు మరియు సమయాలను చాలా మంది పాటిస్తారు. కాబట్టి మీరు మీ కొత్త ఇంట్లోకి ప్రవేశించడానికి మీకు అనుకూలమైన తేదీలను ఎంచుకోండి.

గృహ ప్రవేశానికి చాలా ప్రాధాన్యత..
హిందూ సాంప్రదాయం ప్రకారం గృహ ప్రవేశం అనేది చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు గృహ ప్రవేశాన్ని రెండు రకాలుగా జరిపేవారు. తొలుత కొత్త పెళ్లికూతురు పుట్టింటి నుండి అత్తారింటిలో అడుగు పెట్టినప్పుడు ఘనంగా జరుపుకునే వేడుక. ఇదంతా ఎందుకు జరుపుకుంటారంటే అత్తారింట్లో అడుగు పెట్టిన కోడలు ఆ ఇంటి భవిష్యత్తుని, వంశం అభివృద్ధి, ఇంటి జీవన శైలిలో ఎన్నో రకాల అభివృద్ధి పరమైన పనులకు మరియు మార్పులకు దోహదపడుతుంది. ఏ కోడలు అయినా అత్తింట్లో అడుగు పెట్టిన తర్వాత తన పుట్టింటి ఆత్మీయతకు దూరమైనప్పటికీ మెట్టినింటి మెరుగుదల కోసం తన వంతుగా ఎనలేని సేవలు అందిస్తుంది. ఆ కుటుంబం మంచి కుటుంబం అనే పేరు రావడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే గృహ ప్రవేశానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు.

నివాస యోగ్యం చేసే ప్రక్రియనే ..
ఇక రెండో రకం విషయానికొస్తే ఏదైనా ఒక ఇంటిని కొత్తగా నిర్మాణం చేసినప్పుడు దాన్ని నివాస యోగ్యం చేసే ప్రక్రియనే గృహ ప్రవేశ ప్రక్రియ అంటారు. ఇందుకు గాను ముందే ఇంటి ప్లాన్, కట్టే విధానం, రంగులు వేయడం తదితర వాటినన్నింటిని పూర్తి చేస్తాం. అంతే కాదు ఆ స్థలంలో అనుకూల శక్తి సైతం వస్తుంది అనే చాలా ముఖ్యమైన విషయం. ఇంకోవైపు గృహప్రవేశం అనేది ఒక చిన్న ప్రతిష్ట లాంటిదే.

నవంబర్ 9వ తేదీ..
శనివారం నాడు శుభ ముహుర్తం : ఉదయం 6:39 నుండి మధ్యాహ్నం 2:39 గంటల వరకు
నక్షత్రం : రేవతి
తిథి : త్రయోదశి

నవంబర్ 13వ తేదీ..
బుధవారం నాడు శుభ ముహుర్తం : ఉదయం 6:42 నుండి రాత్రి 10:02 గంటల వరకు
నక్షత్రం : రోహిణి
తిథి : ద్వాదశి

నవంబర్ 14వ తేదీ..
గురువారం నాడు శుభ ముహుర్తం : ఉదయం 6:42 నుండి సాయంత్రం 6:43 గంటల వరకు
నక్షత్రం : రోహిణి, మృగశిర
తిథి : తృతీయ

నవంబర్ 15వ తేదీ..
శుక్రవారం నాడు శుభ ముహుర్తం : ఉదయం 6:43 నుండి రాత్రి 7:46 గంటల వరకు
నక్షత్రం : మృగశిర
తిథి : త్రయోదశి

నవంబర్ 21వ తేదీ..
గురువారం నాడు శుభ ముహుర్తం : ఉదయం 6:49 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు
నక్షత్రం : ఉత్తర ఫాల్గుణి
తిథి : దశమి

నవంబర్ 22వ తేదీ..
శుక్రవారం నాడు శుభ ముహుర్తం : ఉదయం 6:49 నుండి సాయంత్రం 4:42 గంటల వరకు
నక్షత్రం : ఉత్తర ఫాల్గుణి
తిథి : దశమి, ఏకాదశి

నవంబర్ 30వ తేదీ..
శనివారం నాడు శుభ ముహుర్తం : ఉదయం 6:56 నుండి సాయంత్రం 6:56 గంటల వరకు
నక్షత్రం : ఉత్తర ఆషాఢ
తిథి : పంచమి



Click it and Unblock the Notifications
