Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
డిసెంబర్ నెలలో వివాహాలకు ముఖ్యమైన ముహూర్తాలు, తేదీలు ఏంటో చూడండి..
వివాహ వేడుకలో వధూవరుల జీవితాలలో చాలా కీలకమైనవి. మనకు ఎన్ని బంధాలు ఉన్నా వివాహ బంధాన్ని మించి ఏది ఉండదని చాలా మంది చెబుతారు.
భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో గొప్పది. హైందవ సంప్రదాయం ప్రకారం ఇద్దరి వ్యక్తుల మధ్య పవిత్రమైన బంధాన్ని కలిపే వేదిక వివాహ వేదిక. ఈ వివాహ వేడుకలో వధూవరుల జీవితాలలో చాలా కీలకమైనవి. మనకు ఎన్ని బంధాలు ఉన్నా వివాహ బంధాన్ని మించి ఏది ఉండదని చాలా మంది చెబుతారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో వారి జీవితంలో పెళ్లికి ముందు ఒకలాగా.. పెళ్లికి తర్వాత మరోలా అన్నట్టు ఉంటుంది. ఇంత ముఖ్యమైన తతంగాన్ని ఎవ్వరైనా ఏదో నామ్ కే వాస్తే అన్నట్టు చేసుకోవడానికి ఇష్టపడరు. చాలా మంది తమ పెళ్లి గురించి పది మంది పది కాలాల పాటు చెప్పుకోవాలని ఆశిస్తారు. అలాగే తమ పెళ్లి నాటి మధుర క్షణాలు తమ జీవితాంతం గుర్తుండిపోవాలని అనేక మంది భావిస్తారు.

అలాగే చాలా మంది ఆంగ్లేయుల చివరి సంవత్సరమైన డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఈ నెలలో తమ భాగస్వామికి మూడు ముళ్లు వేసి.. డిసెంబర్ నెలతో పాటు తమ బ్రహ్మాచార్యానికి ఒకేసారి వీడ్కోలు చెప్పాలనుకుంటారు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం చెబుదామని ఆశిస్తారు. గత ఏడాది కూడా ఇదే విధంగా ఎంతో మంది సినీ తారలు, సెలబ్రిటీలు ఎక్కువగా డిసెంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. ప్రియాంక చోప్రా నుండి దీపికా పదుకొనే వరకు చాలా మంది సంవత్సరం యొక్క చివరి నెలలో పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇదే పంథాను కొనసాగిస్తూ తాజాగా ఈ ఏడాది ఈ డిసెంబర్ నెలలో ప్రముఖ క్రికెట్ మనీష్ పాండే కూడా వివాహం చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం శుభప్రదమైన ముహుర్తంలో పెళ్లి చేసుకుంటే తమ వివాహ జీవిత బంధం చాలా బలంగా ఉంటుందని అనేక మంది హిందువులు నమ్ముతారు. అయితే మార్గశిర మాసం అయిన డిసెంబర్ నెలలో వివాహం చేసుకోవాలని అనుకుంటున్న వారందరి కోసం, ఈ ఆర్టికల్ లో మీ రాశి చక్రం ప్రకారం పెళ్లికి ఏరోజు మంచిగా ఉంటుంది. ఏ సమయానికి శుభ ముహూర్తం ఉంటుంది అనే అత్యంత విలువైన వివరాలను పొందుపరిచాము. అలాగే డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకునే వారందరికీ బోల్డ్ స్కై తెలుగు తరపున పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

డిసెంబర్ 5వ తేదీ..
2019 చివరి సంవత్సరం అయిన డిసెంబర్ 5వ తేదీ గురువారం వివాహానికి అత్యంత అనుకూలమైన తేదీగా జ్యోతిష శాస్త్రం చెబుతోంది.
ముహూర్తం : 5వ తేదీ రాత్రి నుండి 6వ తేదీ ఉదయం 7 గంటల వరకు
నక్షత్రం : ఉత్తర భాద్రపద
తిథులు : నవమి, దశమి

డిసెంబర్ 6వ తేదీ...
జ్యోతిష శాస్త్రం ప్రకారం డిసెంబర్ 5వ తేదీ కుదరని వారికి ఆ వెంటనే డిసెంబర్ 6వ తేదీ వివాహానికి సమయం మంచిగా ఉంది.
ముహుర్తం : ఉదయం 7 నుండి సాయంత్రం 4:32 గంటల వరకు
నక్షత్రం : ఉత్తర భాద్రపద
తిథి : దశమి

డిసెంబర్ 11వ తేదీ..
జ్యోతిష శాస్త్రం ప్రకారం డిసెంబర్ 11వ తేదీ అయిన బుధవారం రోజు పెళ్లికి అనుకూలంగా ఉంది.
ముహుర్తం : 11వ తేదీ రాత్రి 10:54 నుండి మరుసటి రోజు 12వ తేదీ ఉదయం 7:04 గంటల వరకు
నక్షత్రం : రోహిణి
తిథి : పౌర్ణమి

డిసెంబర్ 12వ తేదీ..
అదేవిధంగా డిసెంబర్ 12వ తేదీ అయిన గురువారం వివాహానికి సమయం అత్యంత అనుకూలంగా ఉంది.
ముహుర్తం : ఉదయం 7:04 నుండి మరుసటి రోజు అయిన 13వ తేదీ ఉదయం 6:19 గంటల వరకు
నక్షత్రం : మృగశిర
తిథి : ప్రతివాద

రాశి చక్రంప్రకారం పెళ్లికి శుభ తేదీలు..
మేష రాశి వారికి పెళ్లికి శుభప్రదమైన రోజు లేదు.

వృషభ రాశి..
ఈ రాశి వారికి వివాహానికి అనుకూలమైన తేదీలు : 1, 2,3, 6, 7, 8, 11

మిధున రాశి..
ఈ రాశి వారికి వివాహానికి అనుకూలమైన తేదీలివే.. 1, 2, 3, 6, 7, 8, 11

కర్కాటక రాశి
ఈ రాశి వారికి వివాహానికి అనుకూలమైన తేదీలివే.. 2, 3, 6, 7, 8, 11

సింహ రాశి..
ఈ రాశి వారికి వివాహానికి అనుకూలమైన తేదీలివే.. 1,2,3,.6,7,11

కన్య రాశి..
ఈ రాశి వారికి వివాహానికి అనుకూలమైన తేదీలివే.. 1, 2, 3, 6, 11

తుల రాశి..
ఈ రాశి వారికి వివాహానికి అనుకూలమైన తేదీలివే.. 2, 3, 6, 7

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి వివాహానికి అనుకూలమైన తేదీలివే.. 1,2,6

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి ఈ నెలలో వివాహానికి సంబంధించి ఎలాంటి తేదీలలో శుభ ముహుర్తాలేవీ లేవు.

మకర రాశి..
ఈ రాశి వారికి వివాహానికి అనుకూలమైన తేదీలివే.. 1,2,6, 7,8,11, 12

కుంభ రాశి..
ఈ రాశి వారికి వివాహానికి అనుకూలమైన తేదీలివే.. 1, 2, 3, 6, 7,

మీన రాశి..
ఈ రాశి వారికి వివాహానికి అనుకూలమైన తేదీలివే.. 1,2,3,6,7,8,11 మరియు 12



Click it and Unblock the Notifications