Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఈ వస్తువులను ఉంచితే అదృష్టం మీ వెంటే ఉంటుంది
మీ పుట్టిన రోజు ఆధారంగా బర్త్ నంబర్ తెలుసుకోవొచ్చు. అలాగే బర్త్ నంబర్ ఆధారంగా మీరు కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే మీకు అన్ని లాభాలే కలుగుతాయి. మరి మీ బర్త్ నంబర్ ఏమిటో తెలుసుకోండి.
మమ్మల్ని దురదృష్టం పట్టి పీడిస్తుంది. మాకు అదృష్టం కలిసి రావాలంటే ఏం చెయ్యాలని చాలా మంది సతమతమవుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కో కారణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొందరు ఏదైనా పని ప్రారంభిద్దామంటే చాలు ఏవేవో అడ్డంకులు వస్తుంటాయి.
మరికొందరు తమ ప్రయత్నాన్ని కొనసాగించి తుది దశకు చేరుకుంటున్నామంటున్న తరుణంలో ఇబ్బందుల పాలై ఆ పని మధ్యలోనే విడిచిపెట్టాల్సి వస్తుంది. వీటన్నంటినీ మీ బర్త్ నంబర్ ఆధారంగా ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకోవడం వల్ల అధిగమించవచ్చు.
మీ పుట్టిన రోజు ఆధారంగా బర్త్ నంబర్ తెలుసుకోవొచ్చు. అలాగే బర్త్ నంబర్ ఆధారంగా మీరు కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే మీకు అన్ని లాభాలే కలుగుతాయి. మరి మీ బర్త్ నంబర్ ఏమిటో తెలుసుకుని, దానికి అనుగుణంగా మీ ఇంట్లో ఆ వస్తువను ఉంచుకోండి. మీకు అన్ని శుభాలు కలిగే అవకాశం ఉంది.

బర్త్ నంబర్ 1
మీరు ఏ నెలలో అయినా సరే 1, 10, 19 లేదా 28 తేదీల్లో జన్మించినట్లయితే మీ బర్త్ నంబర్ 1 అవుతుంది. బర్ నంబర్ 1 ఉన్నవారికి ప్లూట్ (పిల్లన గ్రోవి) అదృష్టాన్ని తీసుకొస్తుంది. అందువల్ల మీరు ప్లూట్ ను ఇంట్లో ఉంచితే ఎల్లప్పుడు సంతోషంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.

బర్త్ నంబర్ 2
ఏ నెలలో అయినా 2, 11, 29 వ తేదీలలో పుడితే మీ బర్త్ నంబర్ 2 అవుతుంది. ఇలాంటి వారు ఏదైనా తెలుపు వస్తువును ఇంట్లో ఉంచుకోవాలి. దీంతో మీరు ఆరోగ్యంతో పాటు సంతోషాలను పొందగలుగుతారు.

బర్త్ నంబర్ 3
ఏ నెలలో అయినా సరే 3, 12, 30 వ తేదీల్లో జన్మిస్తే మీ బర్త్ నంబర్ 3 అవుతుంది. రుద్రాక్ష పూసలు మీకు చాలా శుభప్రదమైనవి. వీటిని మీరు ఇంటిలో ఉంచుకుంటే ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారు.

బర్త్ నంబర్ 4
మీరు ఏ నెలలో అయినా 4, 13, 22 వ తేదీల్లో జన్మించినట్లయితే మీ బర్త్ నంబర్ 4 అవుతుంది. మీరు గాజుకు సంబంధించిన ఏదైనా ఒక వస్తువును ఇంట్లో ఉంచుకోవడం మంచిది. దాంతో మీకు అదృష్టం కలిసి వస్తుంది.

బర్త్ నంబర్ 5
మీరు ఏ నెలలో అయినా 5, 14, 23 వ తేదీలలో పుట్టినట్లయితే మీ బర్త్ నంబర్ 5 అవుతుంది. మీరు ఇంట్లో లక్ష్మి దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల మీరు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు.

బర్త్ నంబర్ 6
మీరు ఏ నెలలో అయినా సరే 6, 15, 24 వ తేదీల్లో జన్మించినట్లయితే మీ బర్త్ సంఖ్య 6 అవుతుంది. మీరు ఇంట్లో నెమలి ఈకలు ఉంచుకోవడం మంచిది. దీంతో మీపై కృష్ణుడి కరుణ ఉంటుంది. మీకు ఎలాంటి సమస్యలు రావు.

బర్త్ నంబర్ 7
మీరు 7, 16, 25 తేదీల్లో జన్మించినట్లయితే మీ బర్త్ సంఖ్య 7. మీరు ముదురు గోధుమ ఉండే రుద్రాక్షలను ఇంటిలో ఉంచుకోవడం మంచిది. అవి మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయి.

బర్త్ నంబర్ 8
8, 17, 26 వ తేదీల్లో జన్మించిన వారు బర్త్ నంబర్ 8 కిందకు వస్తారు. బ్లాక్ క్రిస్టల్ మీరు ఇంట్లో ఉంచుకోవడం వల్ల నరదిష్టితో పాటు ఇతర దిష్టిలు తొలుగుతాయి. ఫలితంగా మీరు సంతోషంగా ఉంటారు.

బర్త్ నంబర్ 9
ఏ నెలలో అయినా 9, 18, 27 వ తేదీలలో జన్మించిన వారు
బర్త్ నంబర్ 9 కిందకు వస్తారు. మీరు ఇంట్లో రెండు పిరమిడ్ ఆకారంలో ఉండే వస్తువులను ఉంచుకోవాలి. దీనివల్ల మీరు సంతోషంగా ఉంటారు.



Click it and Unblock the Notifications
