Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
ప్రతి ఇంటి ముందు తులసి మొక్క ఉండాల్సిందేనా ?
భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలలో తులసికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతి హిందువుల ఇంటి ముందు తులసి మొక్క పెట్టుకుంటారు. తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ప్రస్తుతమున్న అపార్ట్ మెంట్లలో కూడా చిన్నదైనా సరే తులసి మొక్క పెట్టుకుంటే మంచిదని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అయితే తులసి మొక్కకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ? ఇంటి ముందు తులసి మొక్క ఉండాల్సిందేనా ? ఈ ఆచారం వెనక ఉన్న కారణమేంటి ?
అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే.. ఏ నూనెతో దీపం చేయాలి ?
పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాల వెనక ఖచ్చితంగా ఆరోగ్య కారణాలతో పాటు, సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. అందుకే వాటిని సంప్రదాయం రూపంలో అయితే.. మనం పర్ఫెక్ట్ గా ఫాలో అవుతామని.. ఖచ్చితంగా పాటిస్తామని సూచిస్తారు. ఇంటి ముందు తులసి మొక్క పెట్టుకోవడం వెనక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, సైంటిఫిక్ రీజన్స్ కూడా దాగున్నాయి.

సాధారణంగా ప్రతి మొక్క, చెట్టు కార్భన్ డై ఆక్సైడ్ పీల్చుకుని, ఆక్సిజన్ వదులుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ తులసి మొక్క ఇందుకు భిన్నమైనది. తులసి రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ ను వదిలే అద్భుతమైన గుణం కలిగి ఉంటుంది. అందుకే ఈ మొక్కను ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందవచ్చనే ఉద్ధేశ్యంతో ఈ సంప్రదాయం తీసుకొచ్చారు.
తులసి సర్వరోగ నివారిణి
అలాగే తులసి మొక్కలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఘాటైన సువాసన కలిగిన తులసి.. ఈగలు, దోమలు, పాములు, క్రిమీకీటకాలను ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. అందుకే భారతీయ సంప్రదాయంలో తులసికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు.. తులసి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చాయి. ఇంతటి గొప్ప గుణాలు కలిగిన తులసి మొక్క ఇంటి ముందు ఉండటం శ్రేయస్కరమే కదా..!



Click it and Unblock the Notifications