Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, అంగరంగ వైభవంగా బోనాలు.. ఆషాఢ మాసంలోనే ఎందుకు?
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. కొత్తగా పెళ్లైన ఆడ పిల్లలు పుట్టింటికి వెళ్లడంతో పాటు బోనాలు పండగను ఘనంగా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ బోనాల పండుగ మరింత వైభవంగా జరుగుతుంది. అందులోనూ హైదరాబాద్ లో అయితే నెలరోజుల పాటు సాగే ఈ పండును చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. అయితే ఇంత వైభవంగా జరిపే ఈ బోనాల పండుగను ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బోనం అంటే భోజనం అని అర్థం. గ్రామ దేవతలకు బోనం సమర్పించడం అంటే.. అమ్మవారికి నైవేద్యం వండి మొక్కు చెల్లించుకోవడమే. అయితే ముందుగా కుండను పసుపు, కుంకుమ, సున్నం, పూలు, వేప కొమ్మలతో అలంకరించి దానిపై దీపం వెలిగిస్తారు. అందులో నైవేద్యంగా వండిన పదార్థాలను పెట్టి బోనాన్ని తయారు చేస్తారు. ఆ తర్వాత కుండను తలపై పెట్టుకొని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. విస్తారంగా వర్షాలు కురిపించాలని, అంతా ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటారు. అయితే ఈ పండుగను కేవలం ఆషాఢ మాసంలోనే జరుపుతారు.
అందుకే ఆషాఢమాసంలో బోనాలు:
ఆషాఢ మాసంలో అమ్మవారు (గ్రామ దేవతలు) తమ పుట్టింటికి వెళ్తారని ప్రజల నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మను తమ ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలా భావించి భక్తి, శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో నైవేద్యం సమర్పిస్తారు. పూర్వకాలంలో అయితే బోనాల పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కోడి పంజులు, మేకలు, గొర్రెలను బలిస్తున్నారు. అంతే కాదండోయ్ బోనం ఎత్తిన మహిళలపై అమ్మవారు ఉంటుందని అంతా నమ్ముతారు.
బోనాల్లో ఉపయోగించే వస్తువులకు ఉన్న ప్రాముఖ్యత:
మహంకాళి అంశ రౌద్రాన్ని చూపిస్తుంది కాబట్టి ఆమెను శాంతింప జేయడానికి మహిళలు ఆలయాన్ని సమీపించగానే వారి పాదాలపై భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు. ఆషాఢ మాసం వర్షాలు కురవడంతో పాటు క్రిమి కీటకాలు, వైరస్ ద్వారా అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. పూర్వకాలంలో వైద్యవిజ్ఞాన శాస్త్రం పరిణతి చెందక ప్రచారం కాలంలో పల్లెటూర్లలో ప్లేగు, కలరా, మశూచి, వంటి అంటు వ్యాధులు ప్రబలి గ్రామాలకు గ్రామాలే స్మశానాలుగా మారేవి. అయితే ఇలాంటి వాటి నుంచి తమను రక్షించమని వేడుకుంటూ కూడా గ్రామస్థులు గ్రామ దేవతలకు బోనాలు తీసేవారు. ఇందులో ఉపయోగించే వేప, పసుపు వంటివి వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయి.
మొక్కులకు అనుగుణంగా దేవతలకు బోనాలు:
ఎల్లమ్మ, మైసమ్మ, పెద్ద పోచమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ, కట్ట మైసమ్మ, మాతమ్మ.. ఇలా పలు రకాల దేవతలకు ప్రజలు బోనాలు తీస్తుంటారు. వారి వారి మొక్కులకు అనుగుణంగా ఆయా దేవతలకు బోనాలను సమర్పిస్తారు. బోనాలు ఎత్తుకొని వెళ్తుండగా.. కొన్ని చోట్ల కింద కొత్త చీరలు పరుస్తారు.శివ సత్తులు నృత్యాలు చేస్తుంటారు. ఆటపాటలతో అంతా కలిసి అమ్మవారికి చెంతకు చేరుకుంటారు. బోనాలు కింద దింపి.. నైవేద్యాలను సమర్పిస్తారు. ప్రజలంతా తమ మొక్కులను చెల్లించుకుంటారు. కాసేపు అక్కడే కూర్చొని మళ్లీ ఆ ఖాళీ బోనాలను ఎత్తుకొని ఇళ్లకు చేరుకుంటారు. ఇలా బోనాల పండగను భక్తి, శ్రద్ధలతో ముగిస్తారు.
వ్యవసాయ పండగలకు ముందు బోనాలు:
ఇలా ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసంలో తమ తమ స్తోమతకు తగ్గట్లుగా బోనాల పండుగను చేసుకుంటారు. చిన్నగా అయినా సరే కానీ కచ్చితంగా ఈ పండుగ చేస్తారు. ఆ పండుగ తర్వాతే వ్యవసాయ పనులను ప్రారంభించుకుంటారు. గ్రామాలను చల్లగా ఉంచేవి ఆ గ్రామ దేవతలే అని ప్రజల ప్రగాఢ నమ్మకం. అందుకే ఎక్కువగా పల్లెలు, గ్రామాల్లో ఉండే ప్రజలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మధ్య మధ్యలో కూడా తమ ఇష్టానుసారంగా బోనాలు సమర్పిస్తారు. ముఖ్యంగా పెళ్లి వంటి శుభకార్యాలు చేస్తుంటే కచ్చితంగా బోనాల పండగ చేసుకుంటారు. కానీ ఆషాఢ మాసంలో మాత్రం ఊరంతా ఒకేసారి చేసుకుంటారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications