Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
బోనాల పండగ వెనకవున్న రహస్యాలు..? సాక్షాత్తు అమ్మవారి దర్శనం..!
గత నాలుగు వందల సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలందరినీ బోనాలు పండగ ఏకం చేస్తోంది. బోనాలు పండగ పుట్టింది 400 ఏళ్ల క్రితమే. అంతకు ముందు బోనాలు పండగ లేదు. బోనాలు పండగ గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. బోనాలు పండగ ఎందుకు జరుపుతారో కూడా చాలా మందికి తెలియదు. కేవలం తెలంగాణ ప్రాంతంలోనే ఈ బోనాలు పండగ వుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మాత్రమే ఈ పండగ ఘనంగా జరగుతుంది. మరి బోనాల పండగ చరిత్ర, సంస్కృతి, బోనాలు అసలు కథే ఏంటో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం.

ప్రతీ పండగ వెనుక ఒక చరిత్ర దాగి వుంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఘనంగా జరిగే బోనాల పండగ వెనక కూడా ఒక పెద్ద చరిత్రదాగి వుంది. తెలంగాణలో పల్లవులు పాలించే కాలం నుంచి ఈ బోనాల పండగ జరుగుతుంది. కాకతీయ రాజులు, గోల్కొండ కోట వున్నప్పటి నుంచి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు. కులీకుతుబ్ షాహీలు కూడా ఈ బోనాల పండుగను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అయితే ఈ బోనాలు పండగ హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా చేసుకుంటుంది మాత్రం 1869 నుంచేనని తెలంగాణ, హైదరాబాద్ చరిత్ర మనకు చెబుతోంది.
బోనాల పండుగను చేసుకోవడానికి రెండు ప్రధాన కారణాలు వున్నాయ్. 1869లో హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి బాగా వ్యాపించింది. అప్పట్లో దీనికి చికిత్స లేకపోవడం వల్ల చాలా మంది మరణించారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న జవాన్లు కొంతమంది మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినీ మహాకాళేశ్వరం ఆలయానికి వెళ్లారు. హైదరాబాద్‌లో ప్రజలందరూ ప్లేగు వ్యాధి నుంచి బయటపడాలని ఉజ్జయినీ ఆలయంలో పూజలు జరిపించారు. హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి గనుక తగ్గితే హైదరాబాద్‌లో ఉజ్జియినీ అమ్మవారికి గుడికట్టిస్తామని మొక్కుకున్నారు. ఆ మహంకాళీ అమ్మవారు వారి కోరికను మన్నించడంతో ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టింది.
మొక్కు తీర్చుకోవడానికి జవాన్లు సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ అమ్మవారికి దేవాలయాన్ని కట్టించారు. అప్పుడు అమ్మవారికి ఘనంగా పూజలు చేసి బోనాలను సమర్పించుకున్నారు. ఇక బోనాల వెనక వున్న మరో రెండవ సంఘన 1908లో జరిగిన మూసీ ఉదంతం. ఈ సంవత్సరం తీవ్రమైన వరదలతో హైదరాబాద్ అతలాకుతలమైంది. దీంతో అప్పటి మహారాజు కిషన్ ప్రసాద్ సూచన మేరకు లాల్‌దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అలా మూసీ నది కూడా ఉప్పొంగడం తగ్గింది. అప్పటి నుంచి పాతబస్తీ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో ఆశాడమాసం చివరి ఆదివారంలో బోనాల ఉత్సవాలను జరుపుతూ వస్తున్నారు. అలా తెలంగాణలో, హైదరాబాద్‌లో బోనాల పండుగ ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు.

ఇక బోనాల పండగ ఎలా చేస్తారో తెలుసుకుందాం. బోనాలు అంటే భోజనం. అమ్మవారికి భోజనాన్ని సమర్పించడాన్నే బోనం సమర్పించడంగా చెప్పుకుంటాం. అమ్మవారికి ఈ భోజనాన్ని, రుచిగా, శుచిగా, భక్తితో మహిళలే తయారు చేస్తారు. ఈ బోనాన్ని బియ్యం, పెరుగు, పాలు, బెల్లంతో వండి తాయరు చేశి ఒక రాగి పాత్రలో లేదంటే కొత్త మట్టి కుండలో పెడతారు. ఇక బొట్లు, పువ్వులు, పసుపు కుంకుమలతో వేపాకు తోరణాలు పెట్టి, పైన దీపం పెట్టి ఆ బోనాన్ని అలంకరిస్తారు. ఈ బోణాన్ని మహిళలు తమ నెత్తిపైన పెట్టుకొని ఆలయానికి బయల్దేరుతారు. ఇలా తలపై బోనం పెట్టుకున్న మహిళలని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు.
ఆగ్రహంతో వున్న అమ్మవారిని శాంతింపచేయడానికి బోణాలను తీసుకెళ్తున్న మహిళల కాళ్లపై నీళ్లు పోస్తారు. ఆలయానికి బోనాణ్ని సమర్పించి, అమ్మవారికి చీర, బోట్లు, ప్రసాదం సమర్పించుకొని మొక్కుకుంటారు. ప్రతీ సంవత్సరం దక్షియాణ ప్రారంభ కాలంలో ఈ బోణాల పండుగను నిర్వహిస్తారు. తెలంగాణలో ఆషాడ మాసంలో ఈ బోణాలు ప్రారంభమైతాయ్.
హైదరాబాద్‌లో సికింద్రాబాద్ ఉజ్జయినీ, శాలిబండలోని అక్కన్న మాదన్న ఆలయం, లాల్ దర్వాజ సింహవాహినీ ఆలయం, ఇలా తెలంగాణలోని అన్ని అమ్మవారి ఆలయాల్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా జరుగుతాయ్. బోనాల్లో పోతరాజులు ప్రత్యేక ఆకర్షణా నిలుస్తారు.



Click it and Unblock the Notifications