Latest Updates
-
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా
కూతురు తల్లిదండ్రులకు తలకొరివి పెట్టవచ్చా..?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, హిందూ శాస్త్రం ప్రకారం సంతానం వున్న వారికే మోక్షం లభిస్తుందని అనడంలో నిజం లేదు. సంతానం లేని వారికి కూడా మోక్షం లభిస్తుంది. కొడుకులు పెట్టలేదని చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తూ వుంటారు. దృతరాష్ట్రుడికి కూడా 100 మంది కొడుకులు పుట్టినా చివరికి తలకొరివి పెట్టడానికి కూడా ఎవ్వరూ లేరు. ఎంతమంది కొడుకులను కన్నా కూడా ఇప్పటికీ చాలా మంది దృతరాష్ట్రుడిని తిడుతూ వుంటారు. వెంకటేశ్వరస్వామి భక్తురాలు వెంగమాంబకు కూడా సంతానం లేదు కానీ ఆమె మోక్షాన్ని పొందింది. ఆదిశంకరాచార్య స్వామి పెళ్లి చేసుకోకపోయినా ఆయనకు మోక్షం లభించింది. నారదుడు, భీష్ముడు ఇలా ఎంతో మంది సంతానం లేకపోయినా మోక్షాన్ని పొందారు.

కొడుకులు లేకపోయినా మనం చేసే సత్కర్మల వల్ల మనకు మంచి జరుగుతుంది, మనకు మోక్షం లభిస్తుంది. బిడ్డలు లేనటువంటి వారు మంచి దాన ధర్మాలు చేస్తూ, పూజలు చేస్తూ వుంటే మోక్షాన్ని పొందుతారు. ఆడపిల్లలు మాత్రమే వున్నారని, కొడుకులు లేరని చాలా మంది బాధపడిపోతుంటారు. ఆడపిల్లలను కన్నవాళ్లే అదృష్టవంతులు. ఒక్క ఆడపిల్ల వున్నా వంశం మొత్తం తరిస్తుంది అని శాస్త్రాల్లో పురాణాల్లో వుంది.
ఆడపిల్లకు పెళ్లి చేసే సమయంలో కన్యాదానం చేసే సందర్భంలో ఆడపిల్లను లక్ష్మీదేవిగా భావిస్తారు. పెళ్లి కొడుకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. కన్యాదానం సమయంలో అమ్మాయి తల్లిదండ్రుల చేత ఓ విష్ణు స్వరూపుడా నీకు నా కూతురును లక్ష్మీదేవిగా భావించి నీకు కన్యాదానం చేస్తున్నాను. కన్యాదానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. పూర్వం ఆడపిల్లలు లేని వారు ఎవరైనా ఒక ఆడపిల్లను కన్యాదానం చేసేవారు.
కన్యాదానం చేయడం వల్ల తల్లిదండ్రులు శాశ్వతంగా స్వర్గలోకంలో వుంటారని శాస్త్రం చెబుతోంది. కన్యాదానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆడపిల్లలను కన్న వాళ్లు అదృష్టవంతులుగా భావించాలి. సీతాదేవిని కన్యాదానం చేసి జనకమహారాజు మోక్షాన్ని పొందాడు. ఆడపిల్లలను కన్నవారికి శాశ్వత బ్రహ్మనివాసం వుంది.

ఆడపిల్ల తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేసి దహన సంస్కారాలు చేయవచ్చు. కూతురుకి కొడుకు లేకపోతే, లేదా తల్లిదండ్రులకు శిశ్యుడు లేకపోతే, బంధువుల్లో ఎవరైనా తలకొరివి పెట్టవచ్చు, వాళ్లు కూడా లేకపోతే అల్లుడు తలకొరివి పెట్టవచ్చు. అల్లుడు కూడా లేని సందర్భంలో కూతురు పిండ ప్రదానం చేసి దహనసంస్కారాలు చేయవచ్చు.
కూతురికి తల్లిదండ్రి లేకపోతే తాతను కన్యాదానం చేయవచ్చు, లేదంటే పెద్దమ్మ, పెద్దనాన్న చేయవచ్చు, లేదంటే చిన్ననాన్న, పిన్నమ్మ కన్యాదానం చేయవచ్చు. వీళ్లు కూడా లేకపోతే అన్నావదిన అయినా కాళ్లు కడిగి కన్యాదానం చేయవచ్చు. మేనమామ కూడా కాళ్లు కడిగి కన్యాదానం చేయవచ్చు. వీళ్లెవ్వరూ లేకపోయినా తల్లి కాళ్లు కడిగి కన్యాదానం చేయవచ్చు.
స్త్రీలు రెండవ పెళ్లి నిరభ్యరంతంగా చేసుకోవచ్చు. భర్త మరణిస్తే స్త్రీలు రెండవ పెళ్లి చేసుకోవచ్చు. పరాయి స్త్రీల వ్యామోహంలో పడితే కూడా రెండవ పెళ్లి చేసుకోవచ్చు. భర్త నపుంసకుడైనా కూడా స్త్రీ రెండవ పెళ్లి చేసుకోవచ్చు. భర్త సన్యాసంలో కలిసిపోయినా రెండవ పెళ్లి చేసుకోవచ్చు.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్ని ప్రముఖ జ్యోతిష్యుల నుంచి పండితుల నుంచి ప్రముఖ హిందూ శాస్త్ర పురాణాల గ్రంధాల నుంచి స్వీకరించింది. అయితే మేము వీటిని ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించము.



Click it and Unblock the Notifications