Latest Updates
-
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.!
టాయిలెట్ వాడిన తరువాత గుడికి వెళ్తే ఏమవుతుందో తెలుసా? పండితులు ఏం చెబుతున్నారంటే?
హిందూ సంప్రదాయం ప్రకారం దేవతలకు నెలవైన గుడులు చాలా పవిత్రమైనవిగా మనం భావిస్తుంటాం. గుడులు దగ్గర నుంచి ప్రయాణిస్తున్న ఆ దేవుళ్లను మనసులో నమస్కరించుకుని వెళ్తుంటాం. ఎంతో పవిత్రంగా భావిస్తూ ఆ గుడులకు ముందు చెప్పులు కూడా విప్పము. శుభ్రంగా స్నానం చేసుకొని, ఎలాంటి మలినాలు లేకుండా గుడులు వెళ్తుంటాం. దేవుడి దగ్గరకు వెళ్లే సమయంలో శుభ్రంగా, పవిత్రంగా వెళ్తుంటాం. అయితే ఆ దైవ దర్శనానికి వెళ్లే సమయంలో లైన్ ఉంటే.. కచ్చితంగా వాష్‌రూం వినియోగించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అలానే దైవ దర్శనం చేసుకుంటాం.
ఈ నేపథ్యంలో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. దైవ దర్శనానికి వెళ్లే సమయంలో వాష్‌రూం వినియోగిస్తే నేరుగా దైవ దర్శనానికి వెళ్తే మంచిది కాదని, చేతులు కాళ్ళు శుభ్రం చేసుకొని వెళ్లాలని చెబుతుంటారు. కొందరు మాత్రం అలానే నేరుగా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఇంతకీ వాష్‌రూం వెళ్లి వచ్చిన తరువాత దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఎందుకు చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోవాలి? అలానే వెళితే ఏమవుతుంది? దేవుడు ఆగ్రహిస్తాడా? లేదా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆరోగ్య సంరక్షణ
సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే బాత్‌రూంలో అనేక రకాల బ్యాక్టీరియా, వైరసులు ఉండే అవకాశం ఉంటుంది. మనం నేరుగా బాత్‌రూం వినియోగించడం వలన అక్కడ ఉండే వైరస్ కణాలు, బ్యాక్టీరియాలు మనకు కూడా సోకె అవకాశం ఉంటుంది. అవి చేతులపై లేదా మన దుస్తువులపై ఉండే పోయే ప్రమాదం ఉంటుంది. ఇది వైద్యపరంగా కూడా నిరూపితమైంది. ఈ నేపథ్యంలోనే అలానే గుడిలో ప్రవేశించడం వలన.. ఆ వైరస్, బ్యాక్టీరియా కణాలు.. గుడి ఆవరణలో చేరిపోవడం, లేదా అక్కడ ఉండిపోవడం వలన అవి ఇతరులకు కూడా సోకె అవకాశం ఉంటుంది. దీనివలన స్వచ్ఛత, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందుకే గుడికి వెళ్లే సమయంలో బాత్రూం వినియోగిస్తే కచ్చితంగా అంతా శుభ్రం చేసుకొని వెళ్లాలని సూచిస్తుంటారు.
పవిత్రత కోల్పోవడం:
మన హిందూ సంప్రదాయంలో దేవతలన్నా, దేవతలు కొలువై ఉండే దేవాలయాలైనా చాలా పవిత్రంగా చూసుకుంటారు. గుడి ముందు ఎలాంటి పవిత్రమైన పనులు చేయరు. ఆచారాలను తుడిచిపెట్టుకుపోయే ఎలాంటి హానికరమైన పనులను కూడా ఆచరించరు. అలాగే మన హిందూ సంప్రదాయాల ప్రకారం.. గర్భ గుడిలోకి వెళ్లే ముందు శరీరాన్ని, శరీరంలోని అన్ని అవయవాలను పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలని ఉంటుంది. అందులో ముఖ్యంగా, శరీర సుద్ధి. శరీరంపై ఎలాంటి మలినాలు, లేదా దుర్గంధాలు ఉన్నా.. ఆ గుడి ప్రాంగణం అపవిత్రమవుతుందని భావిస్తారు. అందుకే చాలా మంది గుడికి వెళ్లే సమయంలో వాష్‌రూంకి వెళ్లి వస్తే శుభ్రంగా, మలినాలను కడుక్కొని వస్తారు.
ఆధ్యాత్మిక ఆచారం:
ఆధ్యాత్మికతకు నిదర్శనం మన భారతదేశం. అలాంటి దేశంలో చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం కూడా ఆధ్యాత్మికతకు నిదర్శనమే. గుడిలో గంటలను మోగించినప్పుడు, పూజలు పునస్కారాలు చేసినపుడు, నమస్కారాలు చేసినప్పుడు చేతులు శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకే ఆధ్యాత్మికతలో భాగంగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతుంటారు. మలినమైన చేతులతో దేవుళ్లను నమస్కరించడం కూడా మంచిది కాదు. అందుకే చేతులను శుభ్రంగా కడుక్కొని గుడిలకు వెళ్తుంటారు. ఇది మానసిక ప్రశాంతతకు కూడా దోహపడుతుంది. అందుకే గుడికి వెళ్లే సమయంలో బాత్రూం వినియోగిస్తే కచ్చితంగా శుభ్రంగా, మలినాలను తొలగించుకొని చేతులను కడుక్కొని వెళ్ళాలి. అదే మంచిది.



Click it and Unblock the Notifications