Latest Updates
-
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం!
Char Dham Yatra 2023: వరదలకూ చెక్కుచెదరని కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు కట్టారంటే?
హిందువులకు అత్యంత పవిత్రమైన దివ్యక్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఆలయం ఒకటి. మందాకిని నది ఒడ్డున సముద్ర మట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో కేదార్‌నాథ్ ఆలయం ఉంటుంది. 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంటుంది ఈ దివ్యక్షేత్రం.
కేదార్‌నాథ్ దేవాలయం చోటా చార్ ధామ్ యాత్రలోని నాలుగు ప్రసిద్ధ పవిత్ర క్షేత్రాల్లో ఒకటి. ఇది పంచ కేదార్‌లలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం, పంచ కేదార్ అంటే గర్వాల్ హిమాలయాల్లోని 5 ప్రసిద్ధ శివాలయాల సమూహం.

కేదార్‌నాథ్ దేవాలయ విశిష్టత:
పురాణాల ప్రకారం విష్ణు అవతారాలైన నరనారాయణులు భరత ఖండంలోని బదరికాశ్రయంలో తీవ్రమైన తపస్సు చేస్తారు. వారి తపస్సుకు మెచ్చిన పరమ శివుడు భూమి నుండి లింగాకారణంలో ఉద్భవించాడు. నరనారాయణులకు వరం ప్రసాదిస్తాడు. వారు శివుడిని కేదార్‌నాథ్‌లోనే జ్యోతిర్లింగంగా శాశ్వతంగా ఉండిపోమని కోరుతారు. వారి కోరిక మేరకు శివుడు అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.
కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు:
ప్రస్తుతం ఉన్న ఆలయానికి పక్కనే ఉన్న కేదార్‌నాథ్ ప్రారంభ ఆలయాన్ని పాండవులు నిర్మించారని పురాణాలు చెబుతున్నాయు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆస్తి కోసం, రాజ్యం కోసం సొంత సోదరులను చంపామన్న అపరాధభావంతో పాండవులు మోక్షం కోసం కైలాసానికి వెళ్తారు.
ఎద్దు వేషంలో దాక్కున్న శివుడిని ఎట్టకేలకు భీముడు గుర్తించాడు. భీముడు శివుడిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు శివుడు తన వీపు భాగాన్ని వదిలిపోయాడు. అలా నేటికీ కేదార్‌నాథ్‌లో శివుడిని ఎద్దు రూపంలోని వెనక భాగాన్ని పూజిస్తారు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యుడు పునరుద్ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
కేదార్‌నాథ్ రక్షించేది ఆయనే:
కేదార్‌నాథ్ దేవాలయానికి సమీపంలో బైరోనాథ్ దేవాలయం ఉంటుంది. కేదార్‌నాథ్ ఆలయానికి బైరోనాథ్ ఆలయం రక్షణగా, కాపలాగా ఉంటుందని విశ్వాసం. కేదార్‌నాథ్‌ను సందర్శించే వారు బైరోనాథ్ దేవాలయాన్నీ సందర్శిస్తారు.

జ్యోతిర్లింగాలలో ఒకటి:
కేదార్‌నాథ్ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. విష్ణు అవతారాలైన నరనారాయణుల తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వారిని వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు వారు జ్యోతిర్లింగంగా కేదార్‌నాథ్ లో ఉండిపోమని అడుగుతారు. అలా 12 జ్యోతిర్లింగాలలో కేదార్‌నాథ్ ఒకటిగా మారింది.
కేదార్‌నాథ్ ఆలయ విశిష్టత:
కేదార్‌నాథ్ ఆలయాన్ని సుమారు వేయి సంవత్సరాల క్రితం నిర్మించారని అంటారు. ఉత్తరాఖండ్ లో 2013 లో భారీ వరదలు వచ్చి అల్లకల్లోలం సృష్టించాయి. ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయాయి. భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే ఈ వరదలు కేదార్‌నాథ్ దేవాలయాన్ని మాత్రం ఏమీ చేయలేవు. కేదార్‌నాథ్ ఆలయం చెక్కుచెదరకుండా ఉంది.
కర్ణాటక వీరశైవులే పుజారులు:
కర్ణాటకకు చెందిన వీరశైవులు కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాన పూజారులుగా ఉంటారు. వీరినే రావల్ అని కూడా పిలుస్తారు. రావల్ కేదార్‌నాథ్ ఆలయంలో పూజ చేయనప్పటికీ, ఇతరు పూజారులు రావల్ సూచనల మేరకే పూజలు నిర్వహిస్తారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications