Just In
- 39 min ago
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- 3 hrs ago
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- 4 hrs ago
Taurus Horoscope 2021 : వృషభరాశి వారు సంపద పెంచుకుంటారు.. అది ఎప్పుడంటే...?
- 5 hrs ago
తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తోందా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
Don't Miss
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Movies
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దత్తాత్రేయుడిని త్రిమూర్తుల అవతారమని ఎందుకంటారో తెలుసా...
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు.
ఈ సంవత్సరం దత్తాత్రేయ జయంతిని డిసెంబర్ 29వ తేదీన అంటే మంగళవారం నాడు జరుపుకుంటారు. అత్రి మరియు అనసూయ దేవి కుమారుడైన దత్తాత్రేయుడిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అవతారంగా భావిస్తారు.
ఈ పవిత్రమైన రోజున భక్తులందరూ ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీర్వాదం పొందాలంటే.. ఈ వ్రతం కథ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే...
దత్తాత్రేయ జయంతి ఎప్పుడు? దత్త జయంతి విశిష్టత ఏమిటి?

దత్తాత్రేయుని జననం..
పురాణాల ప్రకారం, మహర్షి అత్రి ముని, తన భార్య అనసూయ సాధువు యొక్క మూడు ప్రపంచాలలో కీర్తింపబడటం ప్రారంభమైంది. ఇది చూసిన పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతి మాత కూడా తమ భర్త గురించి ఇలాగే జరగాలని కోరుకున్నారు. ఈ మేరకు వీరు ముగ్గురు తమ భర్తను అభ్యర్థించడం ప్రారంభించారు.

అత్రి ఆశ్రమానికి..
అప్పుడు బ్రాహ్మణులు అత్రి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సమయంలో మహర్షి అత్రి తన ఇంట్లో లేరు. సతీ అనసూయ అతడిని పలకరించడానికి అక్కడి చేరుకుంది. అప్పుడు బ్రాహ్మణుల రూపంలో వచ్చిన త్రిమూర్తులు ఒక పరీక్ష పెట్టారు.

వస్త్రాలు లేకుండా..
పురాణాల ప్రకారం.. సతి అనసూయ ఒంటిపై నూలు పోగు లేకుండా ఆ త్రిమూర్తులకు ఆహారం పెట్టాలని నిబంధన పెట్టారు. అయితే ఆమె కొంచెంసేపు సమయం తీసుకుని.. అందుకు అంగీకరించి.. తను ఒప్పుకుంది. అయితే అదే సమయంలో త్రిమూర్తులను 6 నెలల వయసు ఉన్నవారిగా మారిపోమని చెప్పింది.

తన శక్తులతో..
అలా అనసూయ తన యొక్క దైవిక శక్తులను ఉపయోగించి వారి ముగ్గురిని శిశువులుగా మార్చింది. అప్పుడు వారు ఏడుపు మొదలుపెట్టడంతో.. వారిని తన ఒడిలోకి తీసుకుని.. పాలిచ్చి.. వారిని ఊయలలో ఊపి అనంతరం వారికి ఆహారం కూడా ఇచ్చింది.

త్రిమూర్తుల భార్యల ఆందోళన..
అయితే అదే సమయంలో తమ భర్తలు తిరిగి రాకపోవడంతో త్రిమూర్తుల భార్యలైన పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతి మాతలు ఆందోళన చెందుతారు. అదే సమయంలో నారదుడు అక్కడికి చేరుకుని.. జరిగిన విషయాన్ని అంతా వారికి చెబుతాడు. దీంతో వారు తమ పొరపాటును గ్రహించి.. సతి అనసూయ వద్దకు వెళ్లి క్షమాపణ చెబుతారు.

అసలైన రూపంలోకి..
ఆ తర్వాత అనసూయ త్రిమూర్తులను సాధారణ రూపంలోకి తీసుకొస్తుంది. ఈ సంఘటనతో సంతోషపడ్డ త్రిమూర్తులు ఆమెకు ఓ వరం ఇచ్చారు. అప్పుడు ఆమె త్రిమూర్తులకు తాను మళ్లీ శిశు రూపాన్ని ఇవ్వాలని అనుకుంటున్నానని చెబుతుంది. అలా ఆమె కోరిక మేరకు.. అనసూయ గర్భం నుండి విష్ణువు, బ్రహ్మ, శివుని అంశలు కలిగిన దత్తాత్రేయుడు జన్మించాడు. అందుకే దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల త్రిమూర్తుల ఆశీర్వాదం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.