Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
దసరా రోజు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఈ నైవేద్యం సమర్పించాలి!
దేవి శరన్నవరాత్రులు దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఏడు రోజుల పూజలు పూర్తయ్యాయి. ఇంకో రెండుల్లో దసరా కూడా వచ్చేస్తుంది. అయితే మిగిలిన ఈ రెండు రోజులు దేవిని ఏ విధంగా పూజించాలి? అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అనేది ఇప్పుడు చూద్దాం.
ఎనిమిదో రోజు:
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారు సౌమ్య రూపంలో దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. అదే శాక్తేయ రూపంలో మహా గౌరీ అలంకారంలో భక్తులందరినీ దర్శనమిస్తుంది. ఎనిమిదో రోజు దుర్గాదేవి అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించాల్సిన అవసరముంటుంది. వాటిలో బెల్లం పొంగలి, చెక్కెర పొంగలి, పాయసాన్నం వంటివి నైవేద్యంగా సమర్పించాలి. వీటిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి కటాక్షాలు అనుగ్రహించ వచ్చు.

తొమ్మిదో రోజు:
నవరాత్రుల్లో తొమ్మిదో రోజు అమ్మవారు సౌమ్య రూపంలో మహిషాసుర మర్ధిని అలంకారంలో దర్శనమిస్తుంది. అదే శాక్తేయ రూపంలో సిద్ధిధాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని రూపంలో ఉండే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే.. వడపప్పు పానకం, పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. అదే సిద్ధిదాత్రి అలంకరణలో ఉండే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే.. పాయసాన్నం నైవేద్యంగా సమర్పిస్తే, అమ్మవారి దయ, కృప మీకు అనుగ్రహిస్తుంది.
దసరా రోజు:
నవరాత్రులు పూర్తయిన తరువాత దసరా రోజు(విజయదశమి రోజు) అమ్మవారు సౌమ్య రూపంలో శ్రీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది. అదే శాక్తేయ రూపంలో భ్రమరాంబిక అలంకరణలో భక్తులందరికీ తన దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది. దసరా రోజు సౌమ్య రూపంలో ఉండే శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో ఉండే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే.. కొబ్బరి కాయ ముక్కలు, అరటి పండు ముక్కలు, పాయసాన్నం నైవేద్యంగా సమర్పించాలి. అదే శాక్తేయ అలంకరణలో భ్రమరాంబిక అలంకరణలో ఉండే అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలంటే.. పులిహోరను నైవేద్యంగా సమర్పించొచ్చు.
ఇలా నవరాత్రి ఉత్సవాల్లో మిగిలిన మూడు రోజులు సౌమ్య రూపంలో ఉండే అమ్మవారు ఉండే అలంకరణను బట్టి, శాక్తేయ రూపంలో ఉండే అమ్మవారి అలంకరణను బట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, పూజ ముగిసిన తరువాత ఆ నైవేద్యాన్ని కుటుంబ సభ్యలందరూ తీసుకుంటే, అమ్మవారి కరుణా కటాక్షాలు, అనుగ్రహం పొందొచ్చని పండితులు చెబుతున్నారు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పూజలు నిర్వహించి, పైన పేర్కొనబడిన నైవేద్యాల్లో మీకు వీలైన నైవేద్యాన్ని సమర్పించి.. అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము.



Click it and Unblock the Notifications