Latest Updates
-
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే!
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి దేవాలయం.. మూడవ ఆదివారం బోనాల సంబరాలు..!!
ప్రతీ సంవత్సరం జరిగే బోనాలు పండగల్లో సికింద్రబాద్‌లొో చాలా అట్టహాసంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌లో జులై 7 నుంచి ఆగస్టు 4 వరకు బోనాల పండగ జరగుతుంది. నగరంలో ఉన్న అమ్మవారి ఆలయాల్లో ఈ బోనల పండగ జరగుతుంది. బోనాల పండగకు పెద్ద చరిత్రే ఉంది. నవాబ్ కాలంలో వచ్చిన వరదల నుంచి కొలరా వ్యాధి నుంచి అమ్మవారే కాపాడిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాంకాలి ఆలయానికి కూడా ప్రత్యేక చరిత్ర ఉంది.

ఆషాడంలో మొదటి వారం జరిగే బోనాల తరువాత రెండవ వారం సికింద్రాబాద్ ఉజ్జెయినీ ఆలయంలో జరుగుతాయ్. అయితే రెండవ వారం ఈ సారి జులై 21న వచ్చింది. అయితే బోనాలు పండగ ఉన్నంత వరకు ప్రతీ ఆదివారం ఇక్కడ అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. ఇక్కడ రెండవ వారంలో అమ్మవారి బోనాలు ముగిసినప్పటికీ భక్తులు మూడవ వారంలో కూడా భారీగానే తరలివస్తుంది. ఇక్కడ కింద ఇచ్చిన ఫోటోల్లో చూడవచ్చు.

సికింద్రాబాద్ ఉజ్జెయినీ ఆలయాన్ని యంత్రం సాయంతో అక్కడ అమ్మవారిని ప్రతిష్టించారు. నవాబ్ కాలంలో తీవ్రంగా కలరా వ్యాధి వచ్చి హైదరాబాద్ సంస్థానంలో వేల మంది మరణించారు. ఇంకా వరుసగా ఆ మరణాలకు అడ్డు లేకపోవడంతో అప్పటి ఆర్మీ రెజిమెంట్ మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జెయినీ అమ్మవారిని దర్శించి అక్కడ అమ్మవారి అంశాన్ని యంత్రం రూపంలో తీసుకొని వచ్చి ఇక్కడ సికింద్రాబాద్లో ప్రతిష్టించారు. దీంతో హైదరాబాదద్‌లో కలరా వ్యాధి పూర్తిగా తగ్గిపోయి చాలా మంది ప్రాణాలు దక్కాయ్. అప్పటి నుంచి సికింద్రాబాద్ ఉజ్జెయినీ అమ్మవారు పూజలను, బోనాలను అందుకుంటున్నారు.

అయితే మూడవ ఆదివారం రోజు అంటే జులై 28న పోత రాజుల, జోగినీల హడావిడి ఎక్కువ లేదనే చెప్పుకోవచ్చు. దర్శనం కూడా కొన్ని నిమిశాల్లో అయిపోతుంది. కానీ భక్తుల రద్దీ మాత్రం ఆగడం లేదు. ఉదయం నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు.
ఉజ్జయినీ అమ్మవారు చాలా శక్తివంతమైన దేవతగా భక్తుల నమ్మకం. సికింద్రాబాద్ అమ్మవారి ఆలయానికి వచ్చి ఏది కోరుకున్నా అమ్మవారు తీరుస్తారని భక్తులు విశ్వసిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జెయినీ ఆలయం చుట్టూ ఉన్న చిరువ్యాపారస్తులందరూ ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, బిహార్ రాష్ట్రానికి చెందిన వారే అధికంగా ఉంటారు. బోనాల పండగ వచ్చిందంటే ఇక్కడ ఉన్న చిరువ్యాపారులకు పెద్ద పండగనే చెప్పుకోవచ్చు.

సికింద్రబాద్ ఉజ్జెయినీ మహాంకాళి బోనాలు జరుగుతున్నాయని తెలిసి వివిధ ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు ఇక్కడికి చేరుకున్నారు. వీధి వ్యాపారులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నితేష్. ఇతరు సికింద్రబాద్‌లో అతి పెద్ద పండగ జరగబోతోందని తెలిసి ఉత్తరప్రదేశ్ నుంచి సికింద్రబాద్ వచ్చి నెమిలీకలను అమ్ముతున్నాడు. మధ్యాహ్నం వరకు 200ల రూపాయలు సంపాదించానని చెబుతున్నాడు. ఇతనిలా ఎంతో మంది చిరు వ్యాపారులకు ఈ బోనాల పండగ రోజున కొంత లాభం చేకూరుతుంది.



Click it and Unblock the Notifications