Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
దేవోత్తానా ఏకాదశి: సంవత్సరంలో ఒకేసారి వచ్చే రోజు.. ఈరోజు ఇలా చేస్తే డబ్బుకు లోటు ఉండదు!
ఒక సంవత్సరంలో సాధారణంగా 24 ఏకాదశిలు ఉంటాయి. వాటన్నిటిలో కొన్ని మతపరమైన కారణాలు లేదా ఇతర ప్రాముఖ్యతల కారణంగా దేవోత్తానా ఏకాదశి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇతర 23 ఏకాదశులతో పోలిస్తే ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఈ దేవోత్తాన ఏకాదశి నవంబర్ 12వ తేదీన జరుపుకుంటున్నారు.
ఈరోజు ఏ సమయంలో ఈ దేవోత్తానా ఏకాదశిని జరుపుకోవాలి?, ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి?, ఈ ఏకాదశిని జరుపుకుంటే ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయి అనేది ఈస్టోరీలో తెలుసుకుందాం.
దేవోత్తానా ఏకాదశి ఎప్పుడు వస్తుంది?
దీపావళి తరువాత వచ్చే తొలి ఏకాదశిని దేవోత్తానా ఏకాదశి అని పిలుస్తుంటారు. ఈ ఏకాదశిని దేవప్రబోధిని ఏకాదశి, దేవతని ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. కార్తీకమాసంలో వచ్చే ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏకాదశి ముందు సుమారు నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. నాలుగు నెలల తరువాత, ఈ దేవోత్తానా ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని చెబుతుంటారు.

దేవోత్తానా ఏకాదశి రోజు ఏం చేయాలి?
దేవోత్తానా ఏకాదశి నాడు ఏదైనా మంచి పనులు ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. గృహ ప్రవేశాలు, శుభకార్యాలు, పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని పేర్కొంటుంటారు. ఈ దేవోత్తానా ఏకాదశి నాడు ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తే జీవితం చాలా సుఖమయంగా ఉంటుందని, అన్ని విధాలుగా కలిసి వస్తుందని పేర్కొంటుంటారు.
దేవోత్తానా ఏకాదశి ముహూర్తం ఎప్పుడు?..
ఈ దేవోత్తానా ఏకాదశి కార్తీకమాసంలో వస్తుంది. ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీ సాయంత్రం 06:46 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే నవంబర్ 12వ తేదీ సాయంత్రం 04:04 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలోనే ఈ దేవోత్తానా ఏకాదశి ఉంటుంది. ఈ సమయంలోనే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా చేపట్టాల్సి ఉంటుంది. ఈ దేవోత్తానా ఏకాదశి పరణ సమయం.. నవంబర్ 13వ తేదీ ఉదయం 6:18 గంటల నుంచి 10:08 వరకు ఉంటుంది.
దేవోత్తానా ఏకాదశి ప్రాముఖ్యత
కార్తీకమాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ దేవోత్తానా ఏకాదశి రోజు విష్ణువు, శివుడి ఆదరణ చేస్తారు. ఈ ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం ఉండడంతో పాటు విష్ణువును ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు. ఈరోజు పూజలు ఉపవాసాలు, దానాలు చేయాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అన్నం తినకూడదు. ఆహారంలో ఉప్పుడు అస్సలే వాడకూడదు. ఈరోజున శివుని ఆలయం, విష్ణువు ఆలయాన్ని సందర్శిస్తే మోక్షం కలుగుతుంది.
అలాగే ఈరోజు తులసి మొక్కకు పూలు పెట్టడం, తులసి కోట ముందు దీపం వెలిగించి కోటను అలంకరించడం, విష్ణుమూర్తిని అలంకరించి పువ్వులు, పండ్లు నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన పూజలు చేయాల్సి ఉంటుంది.
ఈ మంత్రం జపించాలి..
ఈ దేవోత్తానా ఏకాదశి నాడు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపించాలి. ఇలా జపించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. జీవితంలో కస్టాలు తొలగిపోతాయి. సుఖ సంతోషాలు జీవితంలో వెల్లివిరుస్తాయి. ఆ మంత్రం ఏంటంటే?
ఉత్తిష్టో కమలాకాంత
జగతాం మంగళం కురు
"బ్రహ్మేంద్రదగ్ని కుబేర సూర్యసోమాదిభిర్వందిత వందనీయ|
బుధ్యస్య దేవేశ జగన్నివాస మంత్రం ప్రభావేన సుఖేన దేవ!
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications