Latest Updates
-
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా..
దీపావళి 2019 : ఈ పండుగ రోజున పూజకి కావాల్సిన వస్తువులు, పూజాసామాగ్రి..
దీపావళి పండగను ఎక్కువ ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు. ఇది తిరిగిరావడానికి, కృతజ్ఞతలు తెలుపుకోటానికి వచ్చే సందర్భం.
దీవాలి లేదా దీపావళి హిందూమతం వారు ఎంతో సంతోషంగా పెద్దఎత్తున జరుపుకునే పండగ.ఈ పండగను ప్రత్యేకంగా చేసే విషయాలు చాలానే ఉన్నాయి ;
స్నేహితులు,కుటుంబం ఒకచోట చేరటం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం మరియు దీపాలవెలుగులు , రంగులు మరెన్నో.
కానీ దీపావళి పండగను ఎక్కువ ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు. ఇది తిరిగిరావడానికి, కృతజ్ఞతలు తెలుపుకోటానికి వచ్చే సందర్భం. ప్రజలు దేవతలకు తమ కృతజ్ఞతలను వచ్చే సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలనే విన్నపాలతో ఈ ప్రత్యేకదినం జరుపుకుంటారు.

దీపావళి పండగను ఐదు రోజులు చేసుకుంటారు. ధనతేరాస్ తో మొదలై భాయి ధూజ్ తో ముగుస్తుంది. ఈ ఏడాది దీపావళి 27వ తేదీ నుండి మొదలై 29 వరకు జరుపుకుంటారు. తొలిరోజు గోవర్ధన పూజ, లక్ష్మీ పూజ, ఆఖరిరోజున భాయిధూజ్ జరుపుకుంటారు.
దీపావళి ఉత్సవాలలో లక్ష్మీపూజ ఎంతో ముఖ్యమైనది. అందుకని, లక్ష్మీపూజకి కావాల్సిన సామాగ్రిని తెలుసుకోవటం ముఖ్యం.అన్నీ అదేరోజు సమకూర్చుకోవటం సాధ్యం కాకపోవచ్చు, అదీ మీకు ఇది మొదటిసారి లేదా కొత్త అయితే అసలు అవదు. అందుకని అలాంటి పాఠకులకు సాయపడటానికి మేము మీకోసం లక్ష్మీపూజకి కావాల్సిన వస్తుసామగ్రి లిస్టును తీసుకొచ్చాం.

లక్ష్మీపూజ పళ్ళెం తయారీకి కావాల్సిన వస్తువులు
పువ్వులు
ప్రమిద
ఘంట
అగరుబత్తులు
గంధం లేదా కుంకుమ
శంఖం
గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి ఏ పూజకైనా సిద్ధం చేయాల్సిన ప్రాథమిక వస్తువులు. మనం ఇంకా చాలా వస్తువులు జతచేయవచ్చుకానీ ముందు సింపుల్ గానే మొదలుపెడదాం. అన్నీ అలంకరించిన పూజాపళ్ళేలను బహుమతులుగా ఒకరికొకరు ఇచ్చుకుంటారు కూడా. బయట కూడా తమ వ్యాపారాలు వృద్ధి చెందుతాయని వీటిని తయారుచేసి అమ్ముతారు.
పూజాపళ్ళెం ఎలా తయారుచేయాలి
గుండ్రటి పళ్ళేన్ని ఎంచుకోండి.
పళ్ళెం మధ్యలో స్వస్తిక ఆకారాన్ని గంధం లేదా కుంకుమతో గీయండి.
మధ్యలో ప్రమిదను వుంచండి.
అగరుబత్తులను, ఘంటను ఉంచండి.
శంఖాన్ని కూడా ఒకపక్కన పెట్టండి.
ఖాళీగా ఉన్నచోట్ల పూలతో ముఖ్యంగా మందారాలతో నింపితే పళ్ళెం అందంగా కన్పిస్తుంది.

లక్ష్మీపూజకి కావాల్సిన వస్తువులు
ఓంకారం ఉన్న వెండి నాణేలు (లేదా బంగారు నాణాలు)
ప్రమిదలు
మట్టితో చేసిన వస్తువులు – అగరుబత్తుల స్టాండు, మట్టి దీపాలు మరియు కాటుక తయారుచేసే మట్టిపాత్ర
మైనపు దీపాలు
పూజాపళ్ళెం
కాచని పాలు
బియ్యం
లక్ష్మి, గణేషుడి దేవతా పటాలు
మెరిసే సిల్కు గుడ్డ
స్వీట్లు
అగరుబత్తులు
పువ్వులు
కమలాలు
నీటికలశం
హారతి ఇవ్వటానికి పాత్ర

గుర్తుంచుకోవాల్సిన విషయాలు
పూజలో మొదటగా కావాల్సినవి నాణేలు. వెండి నాణేలు ఎక్కువగా వాడినా బంగారంవి కూడా వాడవచ్చు. కొంతమంది చిన్నదీపావళిరోజున ఒకరకం, అసలు పండగనాడు మరొకరకంవి వాడతారు. 11,21,31 లేదా 101 సంఖ్యల్లోనే నాణాలను వాడాల్సి ఉంటుంది.
పూజకి పెట్టే ప్రమిదల సంఖ్య కూడా 21 లేదా 31 గానే ఉండాలి.
ఇంటిని అలంకరించటానికి మైనపు దీపాలను వాడవచ్చు
అన్ని ప్రమిదలు పట్టేట్లా పెద్ద పళ్లాన్నే వాడండి. చిన్నపళ్ళెంలో నాణేలు పెట్టుకోండి.
సింధూరం, బియ్యం, కాచని పాలను రెండు సగభాగాలు చేయండి. ఒక భాగాన్ని పూజకోసం అట్టేపెట్టుకుని మరొకభాగాన్ని పూజలో పాల్గొనేవారి తిలకం దిద్దటానికి వాడండి.
లక్ష్మీ అమ్మవారు, గణేషుడి దేవతాపటాలను చిన్నదీపావళి నాడు కూడా వాడవచ్చు. విగ్రహాలను ధనతేరాస్ నాడు పూజకి వాడండి.
సిల్కు గుడ్డ మెరిసే రంగులో ఉండాలి. దీన్ని నాణాలు ఉన్న పళ్ళెంతో పూజాస్థలంలో ఉంచండి.
దీపావళి పండగనాడు పొద్దున సమయంలో అన్నిటిని చక్కగా సర్దిపెట్టుకోవచ్చు. పూజ సాయంత్రం చేస్తారు. తర్వాత బాణసంచాలు కాల్చటం, అందర్నీ కలసి సంతోషంగా పండగ జరుపుకోవటం జరుగుతుంది.



Click it and Unblock the Notifications