Latest Updates
-
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి!
వైకుంఠ ఏకాదశి నాడు ఇలా చేస్తే మోక్షం గ్యారెంటీ!..సకల సుఖాలు లభిస్తాయి
ప్రతి సంవత్సరం పౌష మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు వైకుంఠ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. దీనిని పౌష పుత్ర ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి రోజున పూజ, ఉపవాసం వల్ల ప్రపంచంలోని సకల సుఖాలు లభిస్తాయని, జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని మత విశ్వాసం. సంతానం పొందాలనుకునే దంపతులకు ఈ ఉపవాసం ముఖ్యంగా ఫలవంతంగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం తొలి వైకుంఠ ఏకాదశి ఏ రోజున జరుపుకుంటారు, ఉపవాసం ,పూజ విధానం, ఏకాదశి ప్రాముఖ్యత తదితర వివరాలను ఇప్పుడు చూద్దాం.
వైకుంఠ ఏకాదశి ఎప్పుడు
పంచాంగం ప్రకారం పౌష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తేదీ జనవరి 09 మధ్యాహ్నం 12.22 నుండి ప్రారంభమై జనవరి 10 రాత్రి 10:19 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో వైకుంఠ ఏకాదశి ఉపవాసం జనవరి 10 న జరుపుకుంటారు. ఈ రోజు తెల్లవారుజామునే 3:30 గంటలకు వైష్ణవ ఆలయంలో ద్వార దర్శనం ప్రారంభం అవుతుంది. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభ ముహూర్తం.

బ్రహ్మ ముహూర్తం - ఉదయం 05:27 నుండి 06:21 వరకు
అభిజీత్ ముహూర్తం - మధ్యాహ్నం 12:08 నుండి 12:50 వరకు
సంధ్యా సమయం - సాయంత్రం 05:40 నుండి 06:07 వరకు
వైకుంఠ ఏకాదశి పూజ విధానం
ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అప్పుడు విష్ణువును ధ్యానించి ఉపవాసం చేయాలని సంకల్పించండి. ఇంటిలోని పూజ గదిని శుభ్రం చేసి, గంగాజలంతో విష్ణువు విగ్రహానికి స్నానం చేయించండి. స్వామికి పసుపు వస్త్రాలు ధరించి, తులసి, పండ్లు, పువ్వులు, పంచామృతాలు, స్వీట్లు సమర్పించండి. విష్ణు సహస్రనామం, భగవద్గీత లేదా ఇతర మత గ్రంథాలను పఠించండి. రాత్రి జాగరణ చేసి భజన కీర్తనలు చేయండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రోజు శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం వలన మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఉపవాసం
ఈ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి. నక్షత్ర దర్శనం తర్వాత పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. పంచాంగం ప్రకారం ఉపవాసం విరమించే సమయం జనవరి 11 ఉదయం 07:15 నుండి 08:21 వరకు. ద్వాదశి రోజున బ్రాహ్మణునికి తినిపించి దానాలు చేసి ఉపవాసం విరమించండి.
వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత
పిల్లల సంతోషాన్ని కోరుకునే దంపతులకు వైకుంఠ ఏకాదశి వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు నశించి మోక్షానికి మార్గం సుగమం అవుతుంది. కుటుంబంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించడం ద్వారా విష్ణువు అనుగ్రహం పొంది జీవితంలో సానుకూలత చేకూరుతుందని భక్తుల విశ్వాసం.
వైకుంఠ ఏకాదశి వ్రతం కథ
పురాణాల ప్రకారం సుకేతుమన్ అనే రాజు ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. దీంతో తన మరణానంతరం తన పూర్వీకులకు ఎవరు మోక్షాన్ని అందిస్తారో అని రాజు ఆందోళన చెందాడు. దీని తర్వాత రాజు రాజ్యం విడిచి అడవికి వెళ్ళాడు. ఈ సమయంలో అతను ఋషులను కలుసుకున్నాడు. రాజు తన కష్టాలను ఋషులకు చెప్పాడు. దీంతో ఆ బుషులు పౌషపుత్రద ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని రాజుకు సలహా ఇచ్చారు. వారి సలహా మేరకు రాజు పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచారబద్ధంగా ఆచరించాడు తర్వాత అతను సంతానం పొందాడు.
ప్రత్యేక యోగాల కలయిక
వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో అన్ని కార్యాలలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ప్రపంచానికి తలుపు తెరుచుకుంటుందని భక్తులు నమ్ముతారు. 2025 సంవత్సరంలో మొదటి ఏకాదశి శుక్రవారం వస్తుంది. శ్రీమహావిష్ణువు భార్య,సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి ఈ రోజు అంకితం చేయబడినందున ఇది చాలా పవిత్రమైనది.ః
ఈ మంత్రాన్ని జపించాలి
వైకుంఠ ఏకాదశి రోజున ఎన్ని ఎక్కువసార్లు వీలయితే అన్నిసార్లు "ఓం నమో నారాయణాయ నమః" అనే మంత్రాన్ని లేదా "జై శ్రీమన్నారాయణ!" అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
ఈ దానాలు శ్రేష్ఠం
వైకుంఠ ఏకాదశి రోజు బ్రాహ్మణులకు వస్త్రదానం,సువర్ణదానం, భూదానం, జలదానం, అన్నదానం చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు తులసి మొక్కను దానంగా ఇవ్వడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.



Click it and Unblock the Notifications











