Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
అప్పులన్నీ తీరిపోవాలా..? అయితే ప్రతీ అమావాస్య రోజున ఇలా చేయండి..!!
ప్రతి ఒక్కరికి ఓ జన్మ నక్షత్రం ఉంటుంది. ఈ జన్మనక్షత్రాలతో కొన్ని రోజులు వస్తాయ్. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ రోజున మామిడి చెక్కతో మీరు పీట చేయించుకోవాలి. తరువాత అమావాస్య రోజున ఉదయమే నిద్ర లేవాలి. కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయాలి. మీకు కుదిరితే సాంప్రదాయ వస్త్రాలు వేసుకొని పూజకు సిద్ధంగా ఉండాలి. ఆ రోజున తయారు చేయించనటువంటి మామిడి చెక్కకు పసుపు రాయాలి. దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, తెల్లని వస్త్రం పరిచి దానిపైన లక్ష్మీ దేవి అమ్మవారి ఫోటో లైదంటే విగ్రహం పెట్టాలి.

ఇత్తడి చెండు లేదంటే వెండి చెంబుకు కంకణం కట్టి కళషంగా చేయాలి. అందులో నీళ్లు పోసి, లవంగాలు, యాలాకులు, దాల్చిన చెక్క, పచ్చ కర్పూరం వేయాలి. చెంబులో మామిడాకులు పెట్టి అందులో కొబ్బరికాయ పెడితే కళశం స్థాపన అవుతుంది.
తరువాత లక్ష్మీ అమ్మవారికి 108 ఎర్ర గులాబీలు, లేదంటే 108 తామరపువ్వులు సమర్పించుకోవాలి. నైవేద్యానికి ఏదైనా ఒక తియ్యని ప్రసాదాన్ని రెడీ చేసుకోవాలి. అమ్మవారికి ఈ ప్రసాదాన్ని నివేదన చేసి ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఆరోజు రాత్రి కూడా దీపారాధన చేసుకొని, ధూప, దీప, నైవేద్యాలు చెల్లించుకోవాలి. తరువాత చంద్రుడిని దర్శనం చేసుకొని నేలపైన పడుకోవాలి. పడుకునే ముందు ఏదైనా అల్పాహారం తీసుకొని పడుకోవాలి.
మరుసటి రోజు ఉదయమే లేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకొని పూజా గదిలోకి వెళ్లి అక్కడు ఉన్న కళశంలోని నీటిని ఒక బాటిల్‌లో పోసుకోవాలి. పూజకు సంబంధించిన పువ్వులు, కర్పూరం, అగరబత్తీలు ఉపయోగించినవి ఏవైతే ఉన్నాయో, వాటిని అక్కడ ఉన్న ఎర్రని వస్త్రంలో కట్టివేసి ఏదైనా నదిలో వేయాలి. కళశం నీరు పోసుకున్న బాటిల్‌కు గ్రీన్ కలర్ దారం కట్టి ఇంటికి ఈశాన్యం వైపున వేలాడదీయాలి. ఇలా ప్రతీ అమావాస్యకు చేసుకుంటూ ఉండాలి. బాటిల్‌లో ఉన్న కళశపు నీటిని మొక్కలకు పోయాలి.
ప్రతీ అమావాస్యకు ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబం చేసిన అప్పులు క్రమంగా తీరిపోవడం జరుగుతుంది. మంచి అవకాశాలు కూడా వస్తాయ్. లక్ష్మీ అమ్మవారికి ఈ పూజ చేసేటప్పుడు చాలా భక్తితో చేయాలి. అప్పుడు చక్కని ఫలితాలను మనం చూడగలుగుతాం. కేవలం అప్పు బాధలే కాకుండా కుటుంబ సమస్యలు కూడా తగ్గిపోతాయ్.



Click it and Unblock the Notifications
