Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
Vastu Shastra Tips : రోజూ సాయంకాలం వేళ ఈ పనులు చేస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్టే...!
సాయంకాలం వేళ ఈ పనులు చేస్తే మీరు చాలా నష్టపోతారట.
మనలో చాలా మంది ఇప్పటికీ వాస్తుశాస్త్రాన్ని నమ్మేవారు ఉన్నారు. వారు తమ ఇంట్లో ప్రతిదీ వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇంటి నిర్మాణం నుండి ఇంటి లోపల ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలి..

ఎక్కడ ఉంచకూడదు అనే విషయాలను వాస్తు శాస్త్రం ప్రకారం తూ.చ తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అలా చేస్తే తమ ఇంట్లో ధనలక్ష్మీ ఉంటుందని.. తమకు ఆరోగ్యం, ఆదాయం విషయంలో అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు.

అంతేకాదు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని.. అది బాగుంటేనే మనందరం ప్రశాంతంగా జీవించగలమని నమ్ముతారు. లేదంటే ప్రతిదీ గందరగోళంగా మారుతుంది. అయితే అలాంటి విషయాలను ఇప్పటితరం వారు పెద్దగా పట్టించుకోవడం లేదు.

అయితే వాస్తుశాస్త్రం ప్రకారం సాయంకాలం వేళ కొన్ని పనులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదట. అలా చేస్తే మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్టేనని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పనులేంటి.. అవి ఎందుకు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆడవారిని అవమానించడం..
వాస్తు శాస్త్రం ప్రకారం, సాయంకాలం వేళ ఆడవారిని అస్సలు అవమానించకూడదట. ఇలా చేస్తే చాలా ప్రమాదకరమని పండితులు చెబుతున్నారు. కేవలం ఇంట్లోనే కాదు.. ఆఫీసులో కూడా సాయంకాలం వేళ మహిళల్ని వేధించడం మరియు నిందించడం వంటివి చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుందట. ఆ తల్లికి అలా ఒక్కసారి కోపం వస్తే.. అది ఎప్పటికీ వెళ్లిపోదట. ఆ తర్వాత మీరు ఎన్ని పూజలు, పునస్కారాలు చేసిన ఫలితం ఉండదట. అందుకే ఎన్ని గొడవలొచ్చినా.. సాయంత్రం వేళలో ఆడవారితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది.

సాయంత్రం నిద్రపోకూడదు..
మనలో చాలా మందికి సాయంకాలం వేళ ఎక్కువగా నిద్ర వస్తుంటుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వారి వారి పని పరిస్థితులను బట్టి చాలా మంది సాయంకాలం వేళ నిద్రపోతుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంకాలం వేళ నిద్ర పోకూడదంట. అలా నిద్రపోయే వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదట. కాబట్టి ఆ సమయంలో ఎంత నిద్ర వచ్చినా ఆపుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే ఓసారి ముఖం కడుక్కుని ఏదైనా పని చేసేందుకు ప్రయత్నించండి. అయినా కూడా మీకు నిద్ర వస్తున్నట్లయితే మీరు ఎవరితోనైనా మాట్లాడటం మొదలుపెడితే మంచి ఫలితం ఉంటుంది.

చీపురు వాడకూడదు..
సాయంకాలం సమయంలో మీ ఇంటిని శుభ్రం చేసుకునేందుకు చీపురును అస్సలు వాడకూడదట. అంటే ఆ సమయంలో మీ ఇంటిని అస్సలు శుభ్రం చేసుకోవద్దని కాదు.. ఒకవేళ మీరు సాయంత్రం వేళలో చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే.. మీ ఇంట్లో మంచి అంతా బయటకు వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు. అదే సమయంలో లక్ష్మీదేవి కూడా వెళ్లిపోతుందట. కాబట్టి సాయంకాలం లోపు చీపరుతో మీ ఇంటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

తులసి మొక్కకు నీరు వేయొద్దు..
సాయంత్రం వేళలో తులసి మొక్కకు నీరు వేయకుండా ఉండాలట. అదే విధంగా తులసి మొక్క యొక్క ఆకులు, పువ్వులు, కాయలను కోయడం వంటి పనులను అస్సలు చేయకూడదట. ఇలా చేసినా కూడా లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్లిపోతుందట. ఆ తర్వాత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా లక్ష్మీదేవి అస్సలు కరుణించదట. అంతేకాదు మీకు అప్పటి నుండి ఎక్కడ లేని కష్టాలు, దరిద్రం వచ్చి చేరుతుందట. కాబట్టి సాయంకాలం ఇలాంటి పనులను అస్సలు చేయకండి..



Click it and Unblock the Notifications