Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
దుర్గా పూజ 2019 : తొమ్మిది రకాల దుర్గమ్మ విగ్రహాల గురించి తెలుసుకుందామా..
గిరిజన దేవత రూపంలో ఉన్న దుర్గాదేవి ఇక్కడ గిరిజన శైలిలో అలంకరించబడి ఉంటుంది. ఆమె విగ్రహానికి ఉండే చీరను ఒక ‘సంతాల్‘ మహిళకు కట్టినట్టుగా ఉంటుంది.
దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను తొమ్మిది రూపాలలో మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన విజయవాడలోని అమ్మవారి దేవాలయంలో దుర్గమ్మను పది రూపాలలో అలంకరిస్తారన్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ దసరా సందర్భంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారని కూడా చాలా మందికి తెలుసు. కానీ మన దేశంలో దుర్గమాతను ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాలుగా అంటే వారి వారి ప్రదేశాలకు తగ్గట్టు, అక్కడి వాతావరణానికి తగ్గట్టు విగ్రహాలను ప్రతిష్టిస్తారని చాలా మంది తెలియదు. ఆ తొమ్మిది రకాల ప్రతిమల గురించి ఈ స్టోరీలో మేము తెలియజేస్తాం.

సాంప్రదాయకంగా దుర్గమ్మ విగ్రహాలలో రెండు రకాలు ఉన్నాయి. ఈ దేవతను 'షోలా' లేదా థర్మోకోల్ తో అలకరించినప్పుడు ఆ రూపాన్ని 'షోలార్ సోజ్' అంటారు. దుర్గా దేవిని వెండి వస్త్రాలతో అలంకరించినప్పుడు ఆ అలంకారాన్ని 'దాకేర్ సాజ్' అని అంటారు. కానీ ప్రస్తుత నవరాత్రుల సందర్భంగా అనేక రకాల దుర్గమ్మ ప్రతిమలను ప్రయోగాత్మకంగా ప్రతిష్టిస్తుంటారు. దుర్గామాత ప్రతిమలలో ప్రతి ఒక్క విగ్రహం ఒక ఇతివృత్తంపై ఆధారపడి ఉంటుంది. ఈప్రతిమలను ప్రతిష్టించే ప్రదేశాలలో అక్కడి వాతావరణానికి అనుగుణంగా తీర్చిదిద్దుతారు. అలా తొమ్మిది రకాల ప్రతిమలు ఏవేవో ఈరోజు తెలుసుకుందాం.

1) షోలార్ సాజ్ దుర్గమాత..
షోలార్ సాజ్ దుర్గమాత విగ్రహాన్ని సాంప్రదాయ బద్ధంగా ‘షోలార్ సాజ్‘లో అలంకరిస్తారు. ఈ దేవత విగ్రహానికి తెల్లని థర్మోకోల్ దుస్తులలో మరియు అసురుడికి సంబంధించిన ఆకుపచ్చ రూపంతో భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది.

2) పాట్ ఎర్ ఠాకూర్..
పాట్ ఎర్ ఠాకూర్ అనే దుర్గమ్మ విగ్రహం కుండల రూపంలో తయారు చేయబడి ఉంటుంది. ఈ విగ్రహాన్ని కుండల మాదిరిగా రూపొందిస్తారు. బెంగాలీలో అమ్మవారికి సంబంధించిన ఈ రూపాన్ని ‘పాట్ ఎర్ ఠాకూర్‘ అని పిలుస్తారు. ఈ దేవత ప్రతిమను బంకమట్టితో తయారు చేస్తారు.

3) వెదురు దేవత..
వెదురు దేవత అంటే ఇక్కడ దుర్గామాతను వెదురు కర్రలు మరియు ఎండుగడ్డితో అందంగా అలంకరిస్తారు. ఈ దేవతకు ఈ రకమైన గ్రామీణ శైలి అలంకరణ చాలా తక్కువ ఖర్చుతో మరియు కళాత్మకంగా రూపొందిస్తారు.

4) గిరిజన దేవత..
గిరిజన దేవత రూపంలో ఉన్న దుర్గాదేవి ఇక్కడ గిరిజన శైలిలో అలంకరించబడి ఉంటుంది. ఆమె విగ్రహానికి ఉండే చీరను ఒక ‘సంతాల్‘ మహిళకు కట్టినట్టుగా ఉంటుంది. ఈమె తలకు కూడా బెంగాల్ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వారికి లాగానే అలంకరిస్తారు.

5) వారియర్ దేవత..
వారియర్ దేవత అని పిలువబడే ఈ దుర్గమాత ప్రతిమను యుద్ధం కోసం సిద్ధంగా ఉన్న ఒక యోధురాలిగా రూపొందిస్తారు. ఒక్క దుర్గామత విగ్రహాన్నే కాకుండా ఆమె పిల్లలు, లక్ష్మీ, సరస్వతీ, గణేష్, కార్తీక్ విగ్రహాలను కూడా యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నట్లు అలంకరిస్తారు.

6) దాకేర్ సాజ్..
దాకేర్ సాజ్ అనే ఒకే సాంప్రదాయ దాకేర్ సాజ్ అలంకరణను బల్లపరుపుగా ఉన్న వెండి షిల్లింగులతో అలంకరిస్తారు. ఈ అలంకరణ రూపంలో ఉన్న దుర్గాదేవత ముగ్ధమనోహరంగా కనిపిస్తుంది.

7) మానవత్వం కోసం..
మానవత్వం చూపే కరుణామూర్తిగా ఇక్కడ దుర్గామాతను మానవ రూపంలో అలంకరిస్తారు. ఒక మైదానంలో సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త అయిన మదర్ థెరిసా శిల్పం కూడా ఉంటుంది.

8) కులో మరియు కోరి దేవత
కులో మరియు కోరి దుర్గాదేవతను ఒక ‘కులో‘ లేదా ఒడ్ల నుండి బియ్యం వేరు చేయడానికి ఉపయోగించే ఒక గడ్డి ట్రే లోపల లేదా ఒక ‘కోరి‘ లేదా (నాణెం)లో పొందుపరుస్తుంటారు. ఈ రకమైన అలంకరణలో బెంగాల్ గ్రామీణ జీవితంలోని ప్రత్యేకమైన అంశాలు ప్రతిబింబిస్తాయి.

9) కోనో ఏక్ గన్యెర్ బోధు..
నవరాత్రుల్లో చివరి రూపం కోనో ఏక్ గన్యెర్ బోధు రూపం. ఈ రూపంలో దుర్గా దేవిని బెంగాల్ లోని గ్రామీణ వివాహిత మహిళలాగా అలంకరిస్తారు. ఆ దేవతకు బెంగాలీ శైలిలో ఎర్ర అంచుతో ఉన్న రెడ్ అండ్ వైట్ కలర్స్ తో ఉన్న చీరను కడతారు. అలాగే ఆమె 10 చేతులకు ఎరుపు మరియు తెలుపు ఉన్న నత్తగుల్ల షెల్ గాజులను వేస్తారు.



Click it and Unblock the Notifications