Latest Updates
-
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే!
రూపాయి బిళ్ళతో గురువారం ఇలా చేస్తే.. మీ ఇంట్లో డబ్బుల వర్షమే.. లక్ష్మీ కటాక్షం కొరకు తప్పక ఇలా చేయాల్సిందే!
'ధనం మూలం ఇదం జగత్'. అంటే ధనమే అన్నిటినీ నడిపిస్తుంది, అన్నిటికీ కారణమవుతుందని మన పెద్దలు చెబుతుంటారు. ఆ ధనాన్ని సంపాదించాలంటే ఒళ్ళు వంచి పని చేయాలి. రాత్రింబవుళ్లు పని చేస్తేనే ఆ ధనాన్ని మనం సంపాదించగలం. అయితే కొందరికి మాత్రం ఆ దానం ఎంత సంపాదించినా నిలువ ఉండదు. సంపాదించిన సంపాదన అలా ఆవిరైపోతూ ఉంటుంది. ఆ లక్ష్మీ అనుగ్రహం లేక ఇంట్లో డబ్బులు కూడా నిలువ ఉండవు.
అయితే ఆ డబ్బులు నిలువ ఉండి, క్రమంగా మీ ఆస్తి పాస్తులు పెరగాలంటే కొన్ని పరిహారాలు, నివారణ చర్యలు చేపట్టాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ చర్యలు చేపట్టడం వల్ల క్రమంగా ఆదాయం పెరుగుతుందని పేర్కొంటున్నారు. అయితే ఆ నివారణ చర్యలు ఏమిటి? ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

డబ్బులు నిలవాలంటే..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బులు నిలవాలంటే గురువారం పూట లక్ష్మీదేవికి ఈ పరిహారం చేయాలని చెబుతున్నారు. అదేటంటే.. గురువారం రోజు.. పూజ గదిలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలట. ఇలా దీపారాధన చేసే సమయంలో ఆ దీపం కుందిలో ఒక రూపాయి బిళ్ళను ఉంచాలని చెబుతున్నారు. అనంతరం దీపం పూర్తిగా వెలిగి ఆరిపోయాక.. అందులోని రూపాయి బిళ్ళను తీసి కొత్త బట్టతో శుభ్రంగా తుడుకొని పక్కన పెట్టుకోవాలంట.
ఇలా క్రమం తప్పకుండా 3 లేదా 12 లేదా 21 గురువారాలు పరిహారం చేస్తే.. లక్ష్మీ కటాక్షం మీపై ఉంటుందని చెబుతున్నారు. మూడు వారాలు మూడు రూపాయి బిళ్ళను తీసుకొని శుభ్రంగా తుడుచుకొని వాటిని పసుపు బట్టలో కట్టి.. ఆ బట్టపై పసుపు, కుంకుమ చల్లి డబ్బులు దాచే ప్రదేశంలో ఉంచాలంట. అలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆ ప్రదేశంలో కొలువై ఉంటుందని, క్రమంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇలా చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలుపుతున్నారు.
అప్పులు తీరాలంటే..
కొంతమందికి ఎంత సంపాదించినా డబ్బులు నిలువ ఉండదు. పైగా అప్పులు చేసుకుంటూ పోతూ వుంటారు. అలాగే కొంతమంది లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారికెప్పుడూ ఆ లోన్ కాదు, అవసరమూ తీరదు. అలాంటి వారు మంగళవారం నాడు ఈ పరిహారం చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో మల్లెనూనెతో దీపారాధన చేయాలట. ఆ తరువాత నల్ల శనగల గుగ్గిళ్ళను స్వామి వారికీ నైవేద్యంగా సమర్పిస్తే.. ఫలితాలు పొందొచ్చని పేర్కొంటున్నారు. ఇలా క్రమం తప్పకుండా 9 వారాలు పరిహారం చేయాలని తప్పకుండా ఫలితం కనపడుతుందని తెలుపుతున్నారు. ఇలా చేయడం ద్వారా క్రమక్రమంగా అప్పులు తీరి, లోన్లు కూడా మంజూరు అవుతాయని చెబుతున్నారు.
గమనిక: పైన పేర్కొనబడిన అంశాలన్నీ మాకు ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు లేదా ఇతరులకు చెప్పే ముందు తప్పనిసరిగా నిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకుంటే మంచిది. పైన పేర్కొనబడిన విషయాలకు బోల్డ్ స్కై బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications