Latest Updates
-
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.!
ప్రతి ఒక్కరికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది
ఒక్కొక్కరూ ఒక్కో స్టేజ్ లో సాధారణంగా రిటైర్ అవుతారు. శరీరానికి విశ్రాంతి అవసరమని భావించి 'రిటైర్ మెంట్' పద్దతి ఏర్పడింది. ఆరోగ్యానికి తగిన విధంగా వర్క్ చేసుకుంటారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి పనులను తగ్గించుకోవాలి. కుదరకపొతే మేనేజ్ చేసుకోవాలి. లేకపోతే వేరే విధంగా రిటైర్ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి, రిటైర్ అయిన వెంటనే ఫోకస్ ను ఆర్ధిక పరమైన, కుటుంబ పరమైన ఆలోచనల నుంచి ఆధ్యాత్మిక ఆలోచనలవైపు మరలించాలి. మన శరీరానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్న విషయాన్ని మరవకూడదు.
ఒక ఏజ్ కి వచ్చిన తరువాత, ఈ రోజు మీరెంత సంతోషంగా ఉన్నారని మీకనిపించినా, రేపటి రోజున ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు. జీవితమనేది నీటి బొట్టులాంటిది. జీవితం అంతమయ్యే సమయం అందరికీ వస్తుంది. ఆ సమయం రాదు అనేది కేవలం ఫూలిష్ నెస్. ఆ విషయాన్ని గ్రహించి అందుబాటులోనున్న సమయంలో సత్కర్మలను పాటిస్తూ ఉండాలి.

కాబట్టి, ప్రస్తుతం అందుబాటులోనున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని భౌతికమైన శరీరంపైనే కాకుండా ఆధ్యాత్మికవైపు కూడా దృష్టి సారించండి. కేవలం శరీరమే జీవితమనుకునే వారు వృద్ధాప్యమంటే భయపడతారు. ప్రతీది అర్థం పర్థం లేకుండా కనిపిస్తుంది. శరీరంలోని ఏ మాత్రం తేడా వచ్చినా భయపడిపోతారు. ఒకసారి ఆధ్యాత్మిక ఆనందం వైపు దృష్టి సారిస్తే వృద్ధాప్యం అనేది సమస్యే కాదు. అదొక వరమన్న భావన కలుగుతుంది.

కాబట్టి, ఒక ఏజ్ కి వచ్చిన తరువాత మీ జీవితంలోని కొంత సమయాన్ని ఆధ్యాత్మికత దిశగా కేటాయించాలి. జీవితాన్ని మొత్తం ఆధ్యాత్మికతకు కేటాయించలేని వారు కనీసం అందుబాటులోనున్న సమయాన్నైనా ఈ విధంగా సద్వినియోగపరిస్తే అంతకు మించింది ఏదీ లేదు.

పుట్టిన మరుక్షణం నుంచి శరీరానికి కూడా అంతిమ గడువు ఉంటుందన్న సంకేతాలు అందుతూనే ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించి అందుబాటులోనున్న జీవితాన్ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నించాలి. ప్రతి సారి జీవిత అంతిమ గడియల గురించి సంకేతాలు అందుతాయి. ఒకవేళ అవి గమనించకపోతే 50 ఏళ్ళ వయసుకి వచ్చే సరికి అర్థమయ్యే రీతిలో సంకేతాలు వస్తాయి. శరీరం దుర్భల స్థితికి చేరినా కూడా మీరా సంకేతాలు గమనించకపోతే ఒక సారి వెనక్కి చూసుకుంటే జీవితంలో ఏం సాధించామని అనుకుంటే ఏమీ కనబడవు.

మీలోపల శక్తివంతమైనదేదో ఉన్నప్పుడు వృద్ధాప్యమనేది సమస్యగా అనిపించదు. మరణం సంభవించినప్పుడు చిరునవ్వుతో ఉంటారు. శరీరమనేది తాత్కాలికమైనదని స్పష్టమవుతుంది. ప్రకృతి సహజసిద్ధమైన మరణమనేది సంభవిస్తుందన్న భయం ముందునుంచీ ఉండదు. సహజసిద్ధమైన ప్రక్రియకు భయమనవసరమనే భావన కలుగుతుంది. కొన్ని రకాల అజ్ఞానాల వల్ల మరణంపట్ల భయం కలుగుతుంది. ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే ఎటువంటి భయం ఉండదు. వాస్తవికతతో అలోచించి శరీరమనేది తాత్కాలికమైనదన్న విషయాన్ని గ్రహిస్తే ఎటువంటి భయాలూ ఉండవు.

వేరే కోణం నుంచి ఆలోచించకపోవడం వల్ల ఇటువంటి భయాలు కలుగుతాయి. తరచూ అనుభవాల ఆకులపై గాయాలే తలచుకుంటారు. వాటిపై జ్ఞానాన్ని గ్రహించరు. అనుభవసారం కలిగిన వారు తమ జీవితంలోకి ఒక్కసారి తొంగి చూసుకుని విశ్లేషిస్తే ఈ ప్రపంచం విభిన్న కోణాలలో కనిపిస్తుంది. వారి అనుభవ పాఠాలు ప్రపంచంలోని ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి.
మిగతా వారు మీకేన్ని రకాల బోధనలు వినిపించినా, ఆత్మ, పరమాత్మా మీరేనని ఎవరు చెప్పినా, మీ అనుభవాలన్ని భౌతిక కాయనివేనాన్న వాస్తవాన్ని గ్రహించాలి. భౌతిక కాయం అంతమయిపోతుందన్న విషయం వాస్తవం కాబట్టి అవి కూడా శరీరంతోనే పోతాయి. అనుభవాల పాఠాలను వివిధ కోణాలనుంచి విశ్లేషిస్తే శరీరమన్నది పెద్ద సమస్యగా అనిపించదు. మరణంపై భయం ఉండదు. జీవితానికి మరణానికి పెద్ద తేడా కనిపించదు.



Click it and Unblock the Notifications
