Latest Updates
-
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్తకి మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.! -
అన్నీ ఇచ్చాక కూడా ప్రేమ మారిపోయిందా? దానికి కారణం మీరు కాదు -
మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ 4 ఫ్రూట్స్‌తో ప్రమాదాన్ని అరికట్టొచ్చా.?
భక్తుల వివాదాన్ని స్వయంగా ప్రత్యక్షమై పరిష్కరించిన ఆంజనేయ స్వామి.. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా
హిందూమతంలో ఎక్కువమంది కొలిచే దైవం ఆంజనేయస్వామి. హిందువులు మాత్రమే కాదు అనేక ఇతర మతాలకు చెందినవాళ్లు కూడా హనుమంతుడిని కొలుస్తారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామా కూడా హనుమంతుడి భక్తుడే. సనాతన ధర్మంలో హనుమంతుడిని కలియుగ దేవుడు అంటారు. రాముడికి నమ్మిన బంటుగా,తనలోని శక్తి తనకు తెలియని అమాయకుడిగా,శుత్రువుగా ఎదురుగా నిలబడితే తన పరాక్రమంతో వారిని చిత్తు చేసే బలవంతుడుగా హనుమంతుడిని చూస్తారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో హనుమాన్ మందిరాలు ఉన్నాయి. మనదేశంలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గల్లీకో హనుమాన్ ఆలయం ఉంటది. అయితే ఒక హనుమాన్ ఆలయం మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనది. అత్యంత పురాతనమైన ఆలయమే కాకుండా ఈ ఆలయానికి వెళ్లి హనుమాన్ ని ఏది కోరుకుంటే ఆ కోరిక తీరుస్తాడని భక్తుల నమ్మకం. స్వయంగా ఆంజనేయస్వామి ఈ ఆలయంకి వచ్చి భక్తుల వివాదాన్ని పరిష్కరించినట్లు చెబుతుంటారు. ఈ హనుమాన్ టెంపుల్ ఎక్కడ ఉంది..ఈ టెంపుల్ ఎందుకు అత్యంత ప్రత్యేకమైనదో ఇప్పుడు చూద్దాం.

ఈ ఆలయం ప్రత్యేకతలు ఇవే
ఆంజనేయస్వామి ఆలయం లేని గ్రామం మనదేశంలో ఉండదు. కానీ స్వయంభూగా దర్శనమిచ్చే దేవాలయాలు చాలా తక్కువ, వాటిలో కూడా రెండు విగ్రహాలు ఉండటం చాలా అరుదు. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ ను ఛోటీ కాశీ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. జామ్ నగర్ జిల్లా ప్రజలు కొంచెం ఎక్కువ ఆధ్యాత్మిక,భక్తి భావం కలిగి ఉంటారు. జామ్ నగర్ జిల్లాలోని కుంట గ్రామంలో ఉన్న కుండలియా హనుమాన్ దేవాలయం దాదాపు 500 సంవత్సరాల పురాతనమైనది.
ఇక్కడ హనుమతుండు స్వయంగా వెలిసినట్లు చెప్తారు. ఈ ఆలయంలో రెండు విగ్రహాలు ఉన్నాయి, రెండు విగ్రహాలు దక్షిణ దిశలో ఉండటం విశేషం. ఈ ఆలయంలో కుండలియ హనుమంతుడు స్వయంభూ రూపంలో దర్శనమిస్తాడు. భక్తుల కోరికలు తీరుస్తున్నందున పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికి వెళ్తుంటారు. శనివారాలు,ప్రత్యేక సందర్భాలలో,పండుగల సమయంలో చాలా మంది భక్తులు దర్శనం కోసం కాలినడకన కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ఆలయంతో పాటు గోశాల కూడా ఉంది.
భక్తుల వివాదాం పరిష్కరించిన ఆంజనేయస్వామి
ఒక నమ్మకం ప్రకారం ఇంతకుముందు హనుమంతుడి విగ్రహం ఒకటి మాత్రమే ఈ ఆలయంలో ఉండేది. ఆ సమయంలో ఓ రోజు ఉదయం పూజ ఎవరు చేస్తారనే దానిపై పూజారికి, భక్తుల మధ్య వివాదం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించడానికి దేవునికి ప్రార్థన చేశారు. అప్పుడు ప్రధాన విగ్రహం వెనుక రెండవ విగ్రహం స్వయంగా కనిపించిందని చెబుతారు. ఈ ఆలయం జామ్ నగర్ ఉనికి కంటే ముందే ఉంది. ఇక్కడ కొన్నేళ్లుగా సాధువులు, మహంతులు పూజలు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications