Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
మహాశివరాత్రి, హోలీతో పాటు మార్చిలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...
2022 మార్చి నెలలో వచ్చే పండుగలు మరియు వ్రతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం, తెలుగు నెలల్లో ప్రతి నెలకు ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అలాగే ఫాల్గుణ మాసంలో వచ్చే మార్చి మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే మన భారతదేశాన్ని సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లకు పుట్టినిల్లుగా అభివర్ణిస్తారు.

ఫిబ్రవరి మాసంలో రథసప్తమి, వసంత పంచమి(సరస్వతీ దేవి), భీష్మఏకాదశి వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు మార్చి మాసంలోకి అడుగుపెట్టనున్నాం.

ఈ మాసం వేసవి నెల ప్రారంభాన్ని సూచిస్తుంది. అదేవిధంగా శీతాకాలం ముగింపును కూడా సూచిస్తుంది. ఈ సందర్భంగా ఈ నెలలో కూడా మహాశివరాత్రి, హోలీ వంటి ముఖ్యమైన పండుగలతో పాటు శుభముహుర్తాలు, వ్రతాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మహా శివరాత్రి (మార్చి 1, 2022)
2022 సంవత్సరంలో మహాశివరాత్రి మార్చి 1వ తేదీన మంగళవారం నాడు వచ్చింది. భారతదేశంలో హిందువులు జరుపుకునే వేడుకలలో ఇది ముఖ్యమైనది. ఈరోజు హిందువులందరూ ఉపవాసం ఉంటారు. అలాగే జాగరణ కూడా చేస్తారు. అన్నింటికంటే ముందు ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తారు. ఈ పవిత్రమైన రోజున శివనామ స్మరణ చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, కష్టాల నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

దయానంద సరస్వతి జయంతి (మార్చి 8, 2022)
దయానంద సరస్వతి జయంతి 2022 మార్చి 8వ తేదీ మంగళవారం నాడు వచ్చింది. భారతీయ సమాజ అభివృద్ధికి గొప్ప కృషి చేసిన గొప్ప తత్వవేత్త మరియు సంస్కర్త దయానంద సరస్వతిని ఈరోజు జ్ఞాపకం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత పాఠశాలలు మరియు కళాశాలలను కలిగి ఉన్న ఆర్య సమాజ్ వ్యవస్థాపకులు కూడా వీరే.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8, 2022)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 మంగళవారం నాడు వస్తుంది. ఈరోజున, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలు మరియు సంఘాలకు మహిళలు చేసిన కృషికి గౌరవం లభిస్తుంది. మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

రామకృష్ణ జయంతి (మార్చి 15, 2022)
భారత చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంస్కర్తలు మరియు సాధువులలో శ్రీ రామకృష్ణ పరమహంస ఒకరు. కలకత్తాలో జన్మించిన ఆయనకు పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఈయన స్వామి వివేకానందకు ఇష్టమైన గురువు. ఇదే రోజున ప్రదోష వ్రతం జరుపుకుంటారు.

పార్సీ న్యూ ఇయర్ (మార్చి 20, 2022)
పార్సీ న్యూ ఇయర్ 2022 మార్చి 20 ఆదివారం వస్తోంది. దీనికి పర్షియా రాజు పేరు పెట్టారు. చాలా మంది పార్సీలు ఈరోజును జరుపుకుంటారు మరియు కొత్త ఆరంభాలను సూచిస్తారు. ఈరోజు ఇరానియన్ క్యాలెండర్లో ఒక ముఖ్యమైన భాగంగా విస్తృతంగా జరుపుకుంటారు.

షాహీద్ దివాస్ (మార్చి 23, 2022)
దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప విప్లవకారుల జ్ఞాపకార్థం అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజున, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడిన భగత్ సింగ్, శివ్రామ్ రాజ్గురు మరియు సుఖ్దేవ్ థాపర్ లకు దేశం నివాళి అర్పిస్తుంది.

హోలిక దహనం (మార్చి 17, 2022)
హిందూ పురాణాల ప్రకారం, మార్చి 17 హోలీ దహనం చేసే రోజు. అంటే ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఈరోజున హోలిక అనే రాక్షసుడి రూపంలో ప్రజలు ఒకచోట చేరి కట్టెలను, పాతవస్తువులను కాలుస్తారు. కొంతమంది భక్తులు ఈ పగలు మరియు రాత్రి హోలీ వేడుకలను కూడా ప్రారంభిస్తారు.

హోలీ (మార్చి 18, 2022)
భారతదేశంలో ముఖ్యమైన పండుగలలో హోలీ ఒకటి. ఈరోజు రంగులను చల్లుకుంటూ వేడుకలు జరుపుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. హోలీని వసంత పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ మార్చి 18వ తేదీన అంటే శుక్రవారం నాడు జరుపుకోనున్నారు.

ఇతర ప్రత్యేక రోజులు
మార్చి 2, 2022, బుధవారం, ఫాల్గుణ అమావాస్య
మార్చి 14, 2022, సోమవారం, అమలకి ఏకాదశి
మార్చి 15, 2022, మంగళవారం, ప్రదోష్ ఉపవాసం (శుక్ల పక్షం)
మార్చి 21, 2022, సంకష్ట హర చతుర్దశి
మార్చి 28, 2022, పాపవిమోచని ఏకాదశి
మార్చి 29, 2022, ప్రదోష వ్రతం (క్రిష్ణ పక్షం)
30 మార్చి 2022, బుధవారం, మాస శివరాత్రి
2022 సంవత్సరంలో మహాశివరాత్రి మార్చి 1వ తేదీన మంగళవారం నాడు వచ్చింది. భారతదేశంలో హిందువులు జరుపుకునే వేడుకలలో ఇది ముఖ్యమైనది. దయానంద సరస్వతి జయంతి 2022 మార్చి 8వ తేదీ మంగళవారం నాడు వచ్చింది. .అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 మంగళవారం నాడు వస్తుంది.భారతదేశంలో ముఖ్యమైన పండుగలలో హోలీ ఒకటి. ఈరోజు రంగులను చల్లుకుంటూ వేడుకలు జరుపుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ పండుగ మార్చి 18వ తేదీన అంటే శుక్రవారం నాడు జరుపుకోనున్నారు.



Click it and Unblock the Notifications