Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
వినాయకుని కథలో నేర్చుకోతగ్గ పేరెంటింగ్ టిప్స్
వినాయక చవిథి వచ్చెస్తోంది.ప్రతీ ఇల్లు, వీధి,నగరం లోనే కాదు దేశమంతా మహా వైభవం గా ఈ పండగ ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది .
వినాయక చవితి పెద్దలకి సరదాగా అనిపిస్తే పిల్లలకి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని తీసుకొస్తుంది.ఈ పండుగని ఇళ్ళల్లో, దుకాణాల్లో, వీధుల్లో అన్నిచోట్లా జరుపుకుంటారు.వినాయుకుడిని “విఘ్న వినాశకుడు”అని కూడా పిలుస్తారు, అనగా విఘ్నాలని తొలగించేవాడని అర్ధం. ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలలో ఆయన మనకూడా ఉండి మనల్ని ఆశీర్వదించడం వల్ల మనకి భవిష్యత్తు మీద నమ్మకం ఏర్పడుతుంది.

ఉత్సవాలు జరిగిన తొమ్మిది రోజులూ ప్రజలందరూ ఆడి పాడి సంతోషంగా ఉంటారు.ఈ ఉత్సవాలని వైభవం గా నిర్వహించడానికి వినాయకుడు మనకి ఈ తొమ్మిది రోజులూ "ఈవెంట్ మేనేజర్” అవ్వడానికి అవకాశం ఇస్తాడన్నమాట. గణేశుడి కధని తరచి చూస్తే మనందరం నేర్చుకునే విషయాలెన్నో తెలుస్తాయి.”వినాయక జననం”కధ ద్వారా తెలుసుకోవాల్సిన పేరెంటింగ్ టిప్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము ...

1.గణేశుడి తల్లి పార్వతి ఆయనని తన శక్తి తో సృష్టించింది కానీ మహా శివుడికి ఈ విషయం గురించి తెలీక ఈ బాలుడు కైలాసం లో తనకి ప్రవేశం నిరాకరించడం చూసి ఆగ్రహంతో బాలుడిని సంహరించాడు.ఆ తరువాత తన అర్ధాంగి ద్వారా ఈ బాలుడి గురించి తెలుసుకుని పశ్చాతాపం చెందుతాడే కానీ ఈ అబ్బాయి ఉనికి గురించి పార్వతిని మాత్రం ప్రశ్నించడు.
నేర్చుకోవలసిన నీతి:పిల్లల విషయం లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లి తండ్రులు ఒకళ్ళనొకళ్ళు అస్సలు నిందించుకోకూడడు.పిల్లల భవిష్యత్తు ఆలోచించి వారి ప్రవర్తన కి తామే బాధ్యత వహించాలి.తప్పు నీదంటే నీది అని వాదులాడూకునే బదులు సమస్య కి తగిన పరిష్కారం ఆలోచించాలి.

2.మహాశివుడు తన పరివారానికి కనిపించిన మొదటి జంతువు తల ని నరికి తీసురమ్మని ఆదేశించాడు. వారు ఏనుగు తల తేవడం వల్ల అదే గణేశుడు ముఖం అయ్యింది.మన హిందూ పురాణాల ప్రకారం ఏనుగు ముఖం దివ్యమైనది, ధ్యానం చేయునప్పుడు ఏనుగు ముఖం మీద మనస్సు కేంద్రీకరించడం ఉత్తమం.
నేర్చుకోవలసిన నీతి:తండ్రి పిల్లల కోసం ఏమైనా చేసినప్పుడు తల్లి ప్రశ్నించరాదు, అలాగే తల్లి ఏదైనా చేస్తే తండ్రి కూడా ప్రశ్నించరాదు.అలా ఒకరినొరకు ప్రశ్నించుకునే బదులు తమ పిల్లల భవిష్యత్తు కోసం తపన పడే వారు తమని మించి ఎవరూ లేరని గుర్తెరగాలి.

3.ఒకరోజు తన పుట్టినరోజు నాడు భుక్తాయాసంతో గణేశుడు అడుగు తీసి అడుగెయ్యలేక ఇబ్బంది పడ్డాడు.మహా శివుని ఫాలా భాగం లో ఉన్న చద్రునికి ఈ దృశ్యం హాస్యాస్పదం గా అనిపించి ఫక్కున నవ్వాడు.గణేశునికి ఇది అవమానకరం గా అనిపించి చంద్రునిపై తన తల్లికి ఫిర్యాదు చేసాడు.ఆగ్రహించిన పార్వతి వెంటనే చంద్రుడిని శపించి ఆ తరువాత దానికి సడలింపు ఇచ్చింది.
నేర్చుకోవలసిన నీతి: మీ పిల్ల/పిల్లాడి మీద మీరు వాత్సల్యం చూపించడం నిజంగా అభినందనీయమే కానీ అది ఇతరులకి ఇబ్బంది కలిగించేది గా ఉండకూడదు.పిల్లల్ని గారాబం చెయ్యండి కానీ అంత కంటే ముందు మీరు ఒక సామాజిక బాధ్యత కలిగిన దేశ పౌరుడిని కూడా తీర్చిదిద్దాలని మరువవద్దు.

పండగలు మన జీవితం లో భాగం.ఇవి మనం మనిషిగా ఎలా ఉండాలో గుర్తు చెయ్యడానికే వస్తాయి.పండగల యొక్క అంతరార్ధాన్ని తెలుసుకున్నప్పుడే ఈ ఉత్సవాలు మరింత అర్ధవంతమవుతాయి.



Click it and Unblock the Notifications
