Latest Updates
-
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.?
తలరాతను మార్చుకోలేమా? ఫ్యూచర్లో కష్టమేనా? మీ నుదుటిపై గీతలు ఏమి చెబుతున్నాయో తెలుసా..
మీ నుదుటిపై గీతలను బట్టి మీ జీవితకాలం గురించి తెలుసుకోండి.
పురాణాల ప్రకారం, మనలో ప్రతి ఒక్కరికీ బ్రహ్మదేవుడు పుట్టిన వెంటనే నుదుటిపై కొన్ని రాతలు రాస్తాడు. అలా రాసిన దానిని చెరపటం అనేది ఎవరితరం కాదు.

అంతేకాదు మనిషి తలరాత రాసిన బ్రహ్మకు కూడా అది సాధ్యం కాదట. ఎందుకంటే మన తలరాత రాయడం వరకే ఆయన పని అంట. ఆ తర్వాత మనిషి తలరాతకి యముడు ఒక్కటే హక్కుదారుడు అని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. మనలో చాలా మంది తమకు ఏదైనా మంచి జరిగినా లేదా జరిగినా అంత తలరాత ఫలితమంటారు. అయితే ఆ తలరాతలకు.. మన జీవిత కాలానికి ఉన్న ఆసక్తికరమైన సంబంధాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అద్దంలో తలను..
ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ.. సెకండ్ వేవ్ పేరిట చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఇప్పుడంతా చెడ్డ కాలంగా భావించాలని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మన తలరాతకు మరియు ఫ్యూచర్ కు కూడా లింక్ ఉందని.. అందుకోసం మీరు అద్దంలో మీ తలను చూసుకుంటే కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

మీ నుదుటిపై ఒక లైన్..
మీరు అద్దంలో మీ నుదుటిని చూసుకున్నప్పుడు.. అక్కడ ఒక లైన్ మాత్రమే ఉంటే మీరు సుమారు 20 ఏళ్ల వరకు జీవిస్తారని.. అదే ఆ గీతలు 3 వరకు ఉంటే.. మీరు 40 ఏళ్లకు పైగా జీవిస్తారని చెబుతున్నారు. అయితే నుదుటి మధ్య నుండి మొదలై.. రెండేసి లైన్లు చెరోవైపుకీ వెళ్తే.. అలాంటి వారు కేవలం ఒక సంవత్సరం మాత్రమే బతుకుతారట.

పెద్ద గీతలుంటే..
మీ నుదుటిపై 2 పెద్ద గీతలుంటే.. మీరు సుమారు 70 ఏళ్లకు పైగా జీవిస్తారట. అదే విధంగా మూడు పెద్ద గీతలుంటే మీరు కచ్చితంగా షష్టి పూర్తి చేసుకుంటారని అర్థమట. ఒకవేళ మీ నుదుటిపై గీతలు కొన్ని స్పష్టంగా, మరికొన్ని అస్పష్టంగా ఉంటే.. అలాంటి వారంతా కచ్చితంగా 40 ఏళ్ల వరకు జీవిస్తారట.

గీతలు అలా ఉంటే..
మీ నుదుటిపై గీతలన్నీ రౌండ్ గా ఉంటే.. మీరు ఎంత సంపాదించినా.. ఆ సొమ్మునంతా ఖర్చు పెట్టడం లేదా కోల్పోవడమో జరుగుతుందట. మీ నుదుటిపై ఐదు లేదా ఆరు గీతలుంటే మీరు హాఫ్ సెంచరీ(50 ఏళ్లు) లైఫ్ గ్యారంటీగా లీడ్ చేస్తారట. అదే విధంగా మీ తలపై ఉండే జుట్టులోకి వెళ్తే.. అలాంటి వారు సుమారు 60 ఏళ్లు జీవిస్తారట.

ఏ గీతలు లేకపోతే..
కొందరికి నుదుటిపై ఎంత చూసుకున్నా గీతలనేవి అస్సలు కనిపించవు. అయితే అలాంటి వారు కచ్చితంగా 40 ఏళ్ల వరకు బతుకుతారట. అయితే అదే గీతలు అక్కడక్కడ గ్యాప్ వచ్చినట్టు ఉంటే.. మీకు మరణం త్వరగా సంభవిస్తుందట. మీ నుదుటి మధ్య భాగం నుండి కుడివైపు మూడు లేదా నాలుగు ముక్కలుగా ఉండే లైన్లుంటే.. అలాంటి వారు లీడర్లు లేదా యజమానులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

శక్తి ఆకారంలో ఉంటే..
కొందరికి నుదుటిపై గీతలు శక్తి ఆకారంలో ఉంటుంది. ఇలా ఉండే వారు అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సంపద పొందడమే కాదు.. వీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది. వీరు కచ్చితంగా వందేళ్లు జీవించే అవకాశం కూడా ఉంది. అదే విధంగా నుదుటిపై బాణం లాంటి గుర్తు ఉంటే.. వారు మంచి ప్రేమికులుగా మారిపోతారట. అదే విధంగా తలపై జుట్టు లేకుండా ఉన్న వారు రాజులా బతికేస్తారట.
గమనిక : ఇవన్నీ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెప్పిన వివరాలు మాత్రమే. దీనికి శాస్త్రీయ ఆధారాలు ఎక్కడా లేవు. కాబట్టి వీటిని నమ్మడం మరియు నమ్మకపోవడం అనేది మీ ఇష్టం.



Click it and Unblock the Notifications
