Ganesh Nimajjanam 2023: గణేష నిమ్మజ్జనం సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు?

Ganesh Nimajjanam 2023:వినాయకుని పూజకు చాలా కఠినమైన నియమాలు లేనప్పటికీ, శ్రద్ద మరియు భక్తితో చేసే పూజ మాత్రమే ఫలితాలను ఇస్తుంది. గణేశ చతుర్థి నాడు మనం వినాయకుడిని తీసుకొచ్చి ఒక శుభ ముహూర్తంలో కూర్చోబెట్టి పూజ చేస్తాము, అదేవిధంగా మనం శుభ ముహూర్తాన్ని చూసి నిమజ్జనం చేయాలి. గణేష స్థాపన, అలాగే నిమజ్జన సమయంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

గణేష్ చతుర్థి రోజున వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చి తిరిగి నమజ్జనం చేసే వరకు చేయవలసినవి మరియు చేయకూడని పనులు ఏమిటో చూద్దాం:

Ganesh Nimajjanam 2023: DOs and DONTs

గణేష నిమజనం సమయంలో ఏమి చేయాలి?

* వినాయకుడు ఇంట్లో ఉన్నప్పుడు సాత్విక (శాఖాహార)ఆహారాలు మాత్రమే తినాలి.

* గణపతిని నిమ్మజనంకు తీసుకుపోయే ముందు హారతి ఇవ్వాలి

* గణష విగ్రహం మట్టితో చేసి ఉండాలి. అప్పుడే విగ్రహం నీటిలో కరిగిపోతుంది. పెయింట్ చేయని విగ్రహం ఇంకా మంచిది.

* గణేశుడి విగ్రహాన్ని సముద్రం, నది లేదా చెరువులో నిమజ్జనం చేయాలి. మీరు దానిని నదిలో లేదా చెరువులో వదిలివేయాలనుకుంటే, మట్టి గణపతిని తీసుకొచ్చి, పూజించిన తర్వాత నిమజ్జనం చేయండి.

* ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన గణపతిని నదిలో నిమజ్జనం చేయకూడదు. ట్యాంక్ లేదా డ్రమ్‌లో ముంచండి. దీనివల్ల జలచరాలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల గణేశుడు సంతోషిస్తాడు.

ఏమి చేయకూడదు?

* వినాయకుడికి హారతి ఇవ్వకుండా నిమజ్జనం చేయరాదు

* గణేషుడిని ఊరేగింపును శుభ సమయంలో చేయాలి.

* వినాయక విగ్రహాన్ని నిమజ్జనంకు తీసుకెళ్లేటప్పుడు ఇంటి తలుపులు మూయకూడదు. ఎవరైనా ఒక్కరు ఇంట్లోనే ఉండాలి.

* పెద్ద విగ్రహాన్ని మోసుకెళ్లి కాలువ, చెరువు నీళ్లలో నిమజ్జనం చేసే బదులు పడవలో తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేయాలి.

గణేశ నిమజ్జనం ఎప్పుడు చేయవచ్చు?

గణేష్ విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ఒకటిన్నర, 3వ, 5వ, 7వ మరియు 11వ రోజులలో నిమజ్జనం చేయవచ్చు..

మీరు ఈ రోజుల్లో నిమజ్జనం చేయవచ్చు కాబట్టి ఈ శుభ సమయంలో చేయండి.

గణపతి నిమజ్జనానికి అనుకూలమైన సమయం
* జ్యోతిష్యుడు ప్రకారం, గణేష్ నిమజ్జనం ముహూర్తం మూడవ రోజు 21 సెప్టెంబర్ 2023 ఉదయం 06.09 నుండి 07.39 వరకు. ఇది కాకుండా, ఉదయం 10.43 నుండి మధ్యాహ్నం 03.15 వరకు మరియు సాయంత్రం 04.48 నుండి రాత్రి 09.15 వరకు ఉంటుంది.
* ఐదవ రోజు గణేష్ నిమజ్జనం చేయాలనుకునే భక్తులు 23 సెప్టెంబర్ 2023 ఉదయం 06.11 నుండి 07.40 వరకు, ఉదయం 09.12 నుండి 10.40 వరకు మరియు మధ్యాహ్నం 01.43 నుండి రాత్రి 07.42 వరకు చేయవచ్చు.
* ఏడవ రోజు అంటే 25 సెప్టెంబర్ 2023 నాడు ఉదయం 05.38 నుండి 07.09 వరకు, ఉదయం 08.39 నుండి 10.10 వరకు, మధ్యాహ్నం 01.11 నుండి 05.43 వరకు మరియు సాయంత్రం 05.43 నుండి 07.12 వరకు నిమజ్జనానికి అనుకూల సమయం.
* మీరు అనంత చతుర్దశి నాడు గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటే, మీరు 28 సెప్టెంబర్ 2023 ఉదయం 06.11 నుండి 07.40 వరకు, ఉదయం 10.42 నుండి 03.10 వరకు మరియు సాయంత్రం 04.41 నుండి రాత్రి 09.10 వరకు చేయవచ్చు.

Story first published: Monday, September 25, 2023, 15:30 [IST]
Desktop Bottom Promotion