Latest Updates
-
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.!
మహాభారతం వినాయకుడు ఎందుకు రాశాడు? ఏకదంతం వెనుక అసలు కథ మీకు తెలుసా!
మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప ఇతిహాసాలలో ఒకటిగా, పంచమ వేదంగా కీర్తించబడే మహాభారతం కేవలం కురుక్షేత్ర సంగ్రామానికి సంబంధించిన యుద్ధ గాథ మాత్రమే కాదు.. అది ధర్మం, కర్మ, తత్వశాస్త్రం, రాజనీతి, మానవ సంబంధాలు, జీవిత పరమార్థాన్ని వివరించే ఒక అనంత జ్ఞాన సముద్రం. లక్షకు పైగా శ్లోకాలతో, తరతరాలకు మార్గనిర్దేశం చేసే సార్వకాలిక సత్యాలతో నిండిన ఈ అద్భుత గ్రంథాన్ని మనకు అందించిన మహర్షి వేదవ్యాసుడు. అయితే ఈ మహా యజ్ఞంలో ఆయన కేవలం సంకల్పకర్త మాత్రమే.
మహాభారతాన్ని అక్షర రూపంలోకి తెచ్చిన ఘనత ప్రథమ పూజ్యుడైన వినాయకుడిదే. వ్యాసుడు చెబుతుండగా, గణపతి లిఖించిన ఈ అపురూప ఘట్టం వెనుక ఉన్న కారణాలు, దానిలోని అంతరార్థం తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ ఏడాది సెప్టెంబర్ 27, 2025న గణేశ చతుర్థి లేదా వినాయక చవితి జరుపుకోబోతున్న సందర్భంగా కొన్ని ఆశక్తికర విషయాలను ఇక్కడ చూడండి.

మానవాతీతమైన మహా కార్యం
మహాభారతంలోని కథలు, ఉపకథలు, పాత్రల మనోభావాలు, తాత్విక చర్చలు ఎంత క్లిష్టమైనవంటే.. వాటిని ఒక సాధారణ మానవుడు తన స్మృతిలో నిలుపుకుని, ఏకధాటిగా రాయడం అసాధ్యం. వ్యాస మహర్షి మనసులో మహాభారత కథ ఒక ప్రవాహంలా రూపుదిద్దుకుంది. ఆ జ్ఞాన గంగను ఏ మాత్రం ఆటంకం లేకుండా దానిలోని భావం, లయ, సారం చెడిపోకుండా అక్షరబద్ధం చేయడానికి అలౌకికమైన శక్తి, అసాధారణమైన మేధస్సు, అపరిమితమైన సహనం ఉన్న ఒక వ్యక్తి అవసరం.అలాంటి అసామాన్యమైన పనికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించగల ఏకైక దైవం విఘ్నహర్త అయిన గణేశుడే. మానవ మేధస్సుకు అందని ఆ బృహత్ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి దైవిక మేధస్సు కలిగిన వినాయకుడే సరైన ఎంపిక అని వ్యాసుడు గ్రహించాడు. ఇది కేవలం రాయడం కాదు, ఒక మహత్తర జ్ఞానాన్ని భవిష్యత్ తరాల కోసం భద్రపరచడం.
ఆదర్శ లేఖకుడు
దేవతాగణంలో గణేశుడు బుద్ధికి, జ్ఞానానికి అధిపతి. ఆయన ఏ విషయాన్నైనా తక్షణమే గ్రహించి అందులోని అంతరార్థాన్ని విశ్లేషించగల శక్తివంతుడు. మహాభారతంలోని శ్లోకాలలో ఎన్నో తాత్విక పొరలు, నైతిక సందిగ్ధతలు, గూఢార్థాలు దాగి ఉన్నాయి. వాటిని కేవలం విని రాయడం కాకుండా వాటి వెనుక ఉన్న లోతైన భావాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగల సమర్థుడు కావాలి. వ్యాసుడు చెప్పే ప్రతి పదాన్ని, దానిలోని ధర్మాన్ని, సూక్ష్మాన్ని గ్రహించగల ఏకైక వ్యక్తి గణపతి అని వ్యాసునికి తెలుసు. అందుకే ఈ గురుతర బాధ్యతను ఆయనకు అప్పగించాడు. ఇది కేవలం శారీరక శ్రమ కాదు, సంపూర్ణమైన బౌద్ధిక, ఆధ్యాత్మిక భాగస్వామ్యం.
నిబంధనలు
మహాభారతం రాసే మహత్కార్యాన్ని చేపట్టడానికి గణేశుడు అంగీకరించాడు.. కానీ ఒక షరతు విధించాడు. అదేంటంటే..వ్యాసుడు శ్లోకాలను ఎక్కడా ఆపకుండా ఏకధాటిగా చెబుతూ ఉండాలి. వ్యాసుడు ఒక్క క్షణం ఆగిపోయినా తాను రాయడం ఆపేస్తానని, మళ్ళీ రాయను అని వినాయకుడు వ్యాస మహర్షికి పెట్టిన కండీషన్. ఈ సవాలును స్వీకరించిన వ్యాసుడు దానికి ప్రతిగా తానూ ఒక షరతు విధించాడు.. గణేశా నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని వ్యాసుడు పెట్టిన కండీషన్. ఈ నిబంధన వల్ల రెండు ప్రయోజనాలు కలిగాయి.
ఒకటి..మహాభారతం కేవలం వేగంగా రాయబడటమే కాకుండా దాని సారాంశం గణపతి వంటి మహా మేధావి చేత వ్యాలిడేషన్ చేయబడింది. రెండు, వ్యాసుడు కొన్ని క్లిష్టమైన శ్లోకాలు చెప్పినప్పుడు, వాటిని గణేశుడు అర్థం చేసుకునే కొద్ది సమయంలో వ్యాసునికి తర్వాతి శ్లోకాలను మనసులో కూర్చుకోవడానికి అమూల్యమైన విరామం లభించింది. ఈ విధంగ, ఇద్దరి మధ్య జరిగిన ఈ ఒప్పందం..రైటింగ్ స్పీడ్ ని, డెప్త్ ని కంప్లీట్ గా బ్యాలెన్స్ చేసింది.

విరిగిన దంతం
మహాభారత రచన నిర్విరామంగా సాగుతోన్న సమయంలో గణేశుడు వాడుతున్న కలం విరిగిపోయింది. వ్యాసుని వాగ్ధార ఆగలేదు, గణపతి షరతు ప్రకారం తాను ఆగకూడదు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గణేశుడు తన దంతాలలో ఒకదానిని విరిచి, దానినే కలంగా చేసుకుని రాయడం కొనసాగించాడు. జ్ఞాన సముపార్జన కోసం, ఒక మహత్తర లక్ష్యం కోసం వ్యక్తిగత సుఖాలను, శారీరక సౌందర్యాన్ని కూడా త్యాగం చేయవచ్చని ఇది నిరూపిస్తుంది. ఆనాటి నుండి గణేశుడు ఏకదంతుడు అయ్యాడు. ఆ విరిగిన దంతం అంకితభావానికి, పట్టుదలకు, జ్ఞానం పట్ల ఆయనకున్న అపారమైన గౌరవానికి శాశ్వత చిహ్నంగా నిలిచిపోయింది.



Click it and Unblock the Notifications