Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా నుంచి వీటిని తెచ్చుకుంటే..మీ దరిద్రమంతా పోతుంది
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. గంగా, యమునా, అదృశ్య సరస్వతి నదుల సంగమం హిందూ మతంలో చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ సంగమంలో 144 ఏళ్లకొకసారి వచ్చే మహాకుంభమేళా సమయంలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించడమే కాకుండా జీవితంలో సానుకూలత, ప్రశాంతత లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడికి వచ్చే భక్తులు పవిత్ర స్నానం చేయడమే కాకుండా సాధువుల ఉపన్యాసాలు, మతపరమైన ఆచారాలలో కూడా పాల్గొంటారు.
ప్రయాగ్ రాజ్‌లో జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమవగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. మహాకుంభమేళాకి వెళ్లినవారు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కొన్నింటిని తమ వెంట తెచ్చుకోవడం శుభప్రదం అని పండితులు సూచిస్తున్నారు. మహా కుంభం నుండి తెచ్చిన వస్తువులు జీవితంలో ఆనందం, శాంతి , శ్రేయస్సును తెస్తాయని తెలిపారు.

కుంభమేళా నుంచి తిరిగొచ్చేటప్పుడు వీటిని తెచ్చుకోవాలి
పవిత్ర మట్టి
త్రివేణి సంగమం నేల అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సంగం నుండి తెచ్చిన మట్టిలో సానుకూల శక్తి ఉంటదని, ఇది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంచుతుందని నమ్ముతారు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా పూజా స్థలంలో ఈ మట్టిని ఉంచడం వల్ల ప్రతికూల శక్తి నశించి,సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుందని పండితులు తెలిపారు.
శివలింగం
మహాకుంభం నుండి శివలింగం లేదా పరాస్ రాయిని తీసుకురావడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో పూజా స్థలంలో దీనిని ప్రతిష్టించడం వల్ల కుటుంబానికి సుఖం, శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. ఇది ఆధ్యాత్మిక శక్తిని అందించడమే కాకుండా జీవితంలోని ఇబ్బందులను కూడా తొలగిస్తుంది.
తులసి ఆకులు
తులసి మొక్కదాదాపు ప్రతి హిందూ కుటుంబం ఇంట్లో కనిపిస్తుంది. మహాకుంభంలో తులసి ఆకుల ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఇక్కడి నుంచి తులసి ఆకులను తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోని దారిద్య్రం తొలగిపోయి ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయి. తులసిని లక్ష్మీ దేవి రూపంగా భావిస్తారు, దానిని ఇంట్లో ఉంచడం వల్ల సానుకూలత ఉంటుంది.
గంగా జలం
హిందూ మతంలో గంగాజలం స్వచ్ఛత, పవిత్రతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. మహాకుంభమేళా సమయంలో సంగమంలోని నీరు మరింత పవిత్రంగా మారుతుంది. దీనిని ఇంటికి తెచ్చి పూజా స్థలంలో ఉంచడం వల్ల కుటుంబ కలహాలు తొలగిపోయి ఇంట్లో శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. ఇది మాత్రమే కాకుండా గంగాజలం మతపరమైన ఆచారాలు, పూజలలో ఉపయోగించబడుతుంది.



Click it and Unblock the Notifications