Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
తిరుమల శ్రీవారి భక్తులకు ఎగిరి గంతేసే శుభవార్త..ఇకపై అలా..
తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తులకు గుడ్ న్యూస్. దర్శన టికెట్ విషయంలో మళ్లీ పాత పద్ధతినే పునరుద్దరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నిర్ణయించింది. గతంలో పర్యాటక శాఖ ద్వారా తిరుమల దర్శన టికెట్లు జారీ చేయగా ఆ తర్వాత ఈ పద్ధతిని రద్దు చేశారు. దీంతో ఏపీ టూరిజానికి గణనీయంగా ఆదాయం తగ్గింది. దీంతో టూరిజం శాఖ ఆదాయ మార్గాలను మెరుగుపరిచేలా టూరిజం శాఖ అధికారులు, ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ కార్యాచరణ రూపొందించారు.
టూరిజం ఆదాయం గణనీయంగా తగ్గడానికి ముఖ్య కారణం తిరుమల టూర్ ప్యాకేజ్ తో పాటు జారీ చేసే ప్రత్యేక ప్రవేశ దర్శనం లేకపోవటమే కారణమని నిర్ధారణకు వచ్చారు. దీంతో గతంలో మాదిరిగానే మళ్లీ పర్యాటకశాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నూకసాని బాలాజీ తెలిపారు. ఈ నిర్ణయంతో భక్తులకు మరింత ఈజీగా స్వామివారి దర్శనం లభించడమే కాకుండా పర్యాటక శాఖకు కూడా అదనపు ఆదాయం లభించనున్నట్లు చెప్పారు.

గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు, ఆర్టీసీలకు రూ.300 టికెట్లను భారీగా జారీచేసింది. ఏపీఎస్ఆర్టీసీ, టీజీఆర్టీసీ, కెఎస్ఆర్టీసీ, టిఎన్ఆర్టీసీ, ఏపీ టూరిజం, ఐఆర్సీటీసీ, ఇలా అనేక సర్వీసులకు టూరిజం కోటాలో మొత్తంగా అన్నింటికి కలిపి 5400 టికెట్లను కేటాయిస్తూ వస్తుంది టీటీడీ. ఆయా రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలను అభివృద్ధి చేసి ప్రజారవాణాకు ఆదాయాన్ని పెంచేందుకు ఈ టికెట్లను కేటాయించినట్లు అప్పట్లో టీటీడీ ధర్మకర్తల మండలి ప్రకటించింది. అయితే
ఈ టికెట్లను బ్లాక్ మార్కెట్ లో రూ. 5 వేలకు విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. పూర్తిస్థాయిలో దళారుల చేతిలో పడిపోయాయని టీటీడీకి అనేక విమర్శలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టి తర్వాత ఈ పద్దతిని టీటీడీ టీటీడీ రద్దు చేసింది. అయితే మళ్లీ ఏపీ టూరిజం ఛైర్మన్ విజ్ఞప్తి మేరకు పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో మళ్లీ పాత పద్దతి అమల్లోకి వస్తుంది.



Click it and Unblock the Notifications
