Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Guru Nanak Jayanti 2021 : సిక్కులు ఈ పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసా..
గురునానక్ జయంతి పర్వదినాన్ని ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
గురునానక్ జయంతి మొదటి సిక్కు గురువు గురునానక్ దేవ్ పుట్టినరోజు. ఈ పవిత్రమైన రోజును ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తూ ఉంటుంది.

ఈరోజున సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ ఒకేసారి పఠిస్తారు. ఈ ఏడాది నవంబర్ 19వ తేదీన కార్తీక పౌర్ణమి నాడు అంటే గురునానక్ జయంతిని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఈ పండుగను ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం...

గురునానక్ జయంతి..
పది మంది సిక్కు గురువులలో మొదటి వ్యక్తి అయిన గొప్ప గురువు గురునానక్. ఈయన పుట్టినరోజునే గురునానక్ జయంతిని జరుపుకుంటారు. ఈయన క్రీ.శ.1469లో క్షత్రియ కుటుంబంలో జన్మించారు. గురునానక్ జన్మస్థలం, రాయ్ భోయ్ తల్వాండి, పాకిస్థాన్ లోని లాహోర్ లో ఉంది.

బాల్యంలోనే ఆధ్యాత్మకత..
గురునానక్ బాల్యం నుండే ఆధ్యాత్మిక విషయాలపై, మంచితనం మరియు భక్తి వైపు మొగ్గు చూపాడు. తను వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లల సంతానం కలిగి ఉన్నప్పటికీ, సత్యం యొక్క పిలుపును గ్రహించి, తన సమయాన్ని అంతా సర్వశక్తిమంతుడికి కేటాయించడానికి తను కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టాడు.

ఎంతోమందికి స్ఫూర్తి..
గురునానక్ జయంతి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే.. గురుదేవ్ యొక్క జీవితం ప్రజలకు ఎంతగానో స్ఫూర్తిస్తుంది. ఎందుకంటే అతను అనుసరించిన మార్గం చాలా ఆదర్శవంతమైన మార్గం. ఈ జయంతి రోజున ప్రపంచంలోని ప్రతి ఒక్క సిక్కు ఈ పండుగను అంకితభావంతో జరుపుకుంటారు. ఈ సమయంలో చాలా మంది గురుద్వారాలకు హాజరవుతారు. అయితే దీనికి హాజరు కాలేనివారు మాత్రం ఇంట్లోనే వేడుకలు నిర్వహిస్తారు.

ఐక్యతా భావం..
గురునానక్ పుట్టినరోజు సందర్భంగా సమాజం ప్రత్యేక లంగర్ (భోజనం)ను ఉచితంగా ఏర్పాటు చేస్తారు. వర్గవిభజనల భావం లేకుండా ప్రజలు దీనిలో చేరతారు. అందుకే ఈ పండుగ వైవిధ్యంలో ఐక్యతా భావం కనిపిస్తుంది.

గురునానక్ జయంతి రోజున..
గురునానక్ జయంతి రోజున సిక్కులందరూ పూజలు చేస్తారు. కరా ప్రసాద్ (తీపి వంటకాలను) తయారు చేసి అందరికీ ఉచితంగా పంచుతారు. అలాగే కొత్త బట్టలు ధరించి ఆనందిస్తారు. హిందువుల దీపావళి రోజున టపాసులు ఎలా కాలుస్తారో.. సిక్కులు కూడా గురునానక్ జయంతి రోజున కాకర్లను కాల్చి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ జయంతి యొక్క అంతర్లీన సందేశం అతని మార్గాన్ని అనుసరించడం మరియు ప్రపంచమంతా ప్రేమను వ్యాప్తి చేయడం.
2021వ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 19వ తేదీన శుక్రవారం నాడు గురునానక్ జయంతి పండుగను జరుపుకోనున్నారు.



Click it and Unblock the Notifications