Latest Updates
-
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
Hanuman Jayanti: ఆంజనేయుడి అనుగ్రహం పొందేలా..మీ బంధుమిత్రులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలను ఇలా చెప్పండి
ప్రతి ఏటా చైత్ర మాసంలోని శుక్ష పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ ఏడాది పౌర్ణమి తిథి ఏప్రిల్ 12(శనివారం) తెల్లవారుజామున 3:21 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 13 ఉదయం 5:51 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఏప్రిల్ 12న జరుపుకుంటారు. అయితే హనుమంతుని జన్మదినం గురించి కొన్ని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని పురాణాల ప్రకారం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున హనుమంతుడు జన్మించాడని విశ్వసిస్తారు. అందుకే ఈ రోజును కూడా హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. అయితే చాలామంది చైత్ర పౌర్ణమి రోజునే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.
హిందూమతంలో హనుమంతుడిని కలియుగ దేవుడిగా భావిస్తారు. ఎనిమిది మంది అమరులలో ఒకడైన ఆంజనేయుడు ఇప్పటికీ భూమిపై తిరుగుతూను ఉన్నాడని నమ్ముతారు. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన హనుమాన్ జయంతిని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రామ భక్తులు,ఆంజనేయ స్వామి భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా పూజా కార్యక్రమాలు, అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 12న రాముడి నమ్మడి బంటు హనుమంతుడి పుట్టిన రోజు సందర్భంగా మీ ప్రియమైనవారికి ఆశీస్సులు, శుభాకాంక్షల సందేశాలను పంపండి..తద్వారా ఆంజనేయస్వామి ఆశీస్సులు వారి జీవితాల్లో నిలిచి ఉంటాయి. మీ కుటుంబసభ్యులకు, ఫ్రెండ్స్ కు, ప్రియమైన వారికి పంపగల కొన్ని శుభాకాంక్షల సందేశాలను ఇక్కడ చూడండి.

ఆంజనేయస్వామి కృప పొందేలా తెలుగులో ఇలా శుభాకాంక్షలు చెప్పండి
-ఆంజనేయస్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలి. మీ కష్టాలన్నీ తొలగిపోవాలి. మీ జీవితంలో ఆనందం వెల్లివిరియాలి. జై హనుమాన్
-శ్రీరాముని ఆశీస్సులు మెండుగా ఉన్నవాడు..గద మోసేవాడినని గర్వించేవాడు..బజరంగీ అని గుర్తింపు పొందినవాడు..కష్టాలను తొలగించేవాడు..అతడే హనుమంతుడు. హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు.
-హృదయాలలో శ్రీరామడు, శరీరాలలో హనుమంతుడు ఉన్నవారు నిజమైన భక్తులు. ఆంజనేయస్వామి ఆశీస్సులు మీపై ఉండాలి. మీ జీవితం ఎప్పుడూ ఆనందంతో నిండి ఉండాలి. జై బజరంగబలి.
-ఈ పవిత్రమైన రోజున హనుమంతుని ఆశీస్సులు మీ జీవితంలో శాంతి,సంతోషం,శ్రేయస్సుని నింపాలని కోరుకుంటున్నాను.
-హనుమాన్ శక్తి ఎవరి దగ్గర ఉంటుందో వారి జీవితం ఎప్పటికీ ఓడిపోదు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-శక్తి, భక్తి, ధైర్యానికి ప్రతీక అయిన హనుమంతుడి జన్మదినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు.
-హనుమంతుడి భక్తి మార్గంలో నడుస్తూ మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించండి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-హనుమంతుడి పాదాలలో ఆనందం,శాంతి,శ్రేయస్సు శక్తి ఉంది. ఆయన ఆశీస్సులతో ప్రతిరోజు మీకు శుభం కలుగుతుంది. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-ఆంజనేయస్వామి ఆశీస్సులు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఉంచుగాక. ఆయన కృపతో మీ జీవితం కొత్త దిశను కనుగొనుగాక. జై హనుమాన్.
-జీవితంలోని చెడు విషయాలు, ప్రమాదాల నుండి మిమ్మల్ని రక్షించడానికి హనుమంతుడు ఎల్లప్పుడూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-ఆంజనేయుడి నాయం జపిస్తే రాక్షసులు, దయ్యాలు, భూత ప్రేత పిశాచులు దగ్గరికి రావు,వ్యాధులు తొలగిపోతాయి. హనుమాన్ వీరను నిరంతరం జపించడం ద్వారా అన్ని బాధులు తొలగిపోతాయి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
-హనుమా, అంజనీ తల్లికి ప్రియమైనవాడిని. నువ్వు లేకుండా శ్రీరాముడు అసంపూర్ణుడు. రాముడు సీత నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు. నీ భక్తుల కలలను నువ్వు నెరవేరుస్తావు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
-నిజమైన రామ భక్తుడైన హనుమంతుడు మీ జీవితంలో చాలా ఆనందాన్ని,విజయాన్ని తీసుకురావాలి, హనుమాన్ జయంతి సందర్భంగా మీకు అనంతమైన ఆశీస్సులు.
-మీ కష్టాలన్నీ తొలగించి మీకు విజయాన్ని అందించాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-హనుమంతుని భక్తి మార్గంలో నడుస్తూ మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించండి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-ఈ శుభ సందర్భంలో హనుమంతుని శక్తి, ధైర్యం మీకు స్ఫూర్తినివ్వాలి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-హనుమంతుని భక్తి మార్గంలో నడుస్తూ, మన జీవితాలను సార్థకం చేసుకుందాం.
-హనుమంతుడు మనకు ఆదర్శం, ప్రేరణ.
-హనుమంతుని కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉండాలి.
-హనుమాన్ జయంతి వేడుకలు మీ జీవితంలో మరింత సంతోషాన్ని, సానుకూలతను తీసుకురావాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications