Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Maha Shivratri 2025 Wishes: శివానుగ్రహం పొందేలా..మీ బంధుమిత్రులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలా చెప్పండి
శివభక్తులకు అత్యంత ముఖ్యమైన హిందూ పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఫాల్గుణ మాసం కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివరాత్రి జరుపుకుంటున్నారు. ఈ శివుని పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున శివ భక్తులు ఆచారాలతో శివుడిని పూజిస్తారు. శివయ్య అభిషేక ప్రియుడు. అందుకే మహా శివరాత్రి వేళ శివుడిని స్మరించుకుంటూ ప్రదోష వ్రతం వేళ శివయ్యకు జలాభిషేకం, రుద్రాభిషేకం, బిల్వ పత్రాలతో శివయ్యకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల, రాత్రంతా జాగారం చేయడం వల్ల,ఉపవాస దీక్ష పాటించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతారు.
శాస్త్రాల ప్రకారం, మహాశివరాత్రి నాడు శివుడిని పూజించడానికి రాత్రి సమయం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఫాల్గుణ మాసం కృష్ణ పక్ష చతుర్దశి తేదీ ఫిబ్రవరి 26న ఉదయం 11:08 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 27న ఉదయం 08:54 గంటలకు ముగుస్తుంది. మహాశివరాత్రి నేడే శివుడు తాండవం చేశాడని, పార్వతీదేవిని పెళ్లాడింది కూడా ఈ రోజునే అని చెబుతుంటారు. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా మీ ఫ్రెండ్స్, బంధువులకు,కుటుంబసభ్యులకు పంపగలిగే మహాదేవ్ పట్ల భక్తితో నిండిన కొన్ని శుభాకాంక్షల సందేశాలు ఇక్కడ చూడండి.

మెసేజ్ లు, వాట్సాప్ స్టేటస్, ఇన్ స్టా స్టోరీస్ కి మహాశివరాత్రి శుభాకాంక్షల సందేశాలు
-హర హర మహదేవ శంబో శంకర.. ఇహపరముల నేలే జయ జగదీశ్వర.. కోరిన వారి కోరికలన్నీ తీర్చేటి ఈశ్వరుడి చల్లని దీవెనలు ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ మీకు మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
-నువ్వే కాలవు, నువ్వే మహాకాలవు,నువ్వే ప్రపంచం, త్రిలోకం,నువ్వే శివశక్తితో పాటు శివభక్తి, నువ్వే సత్యం, నువ్వే ప్రపంచం, నువ్వే మహాకాలవు కూడా. మహా శివరాత్రి శుభాకాంక్షలు.
- ఓం నమః శివాయ. మహా శివరాత్రి శుభాకాంక్షలు!
-శివరాత్రి రాత్రి శివుని ఆశీస్సులు మీ జీవితంలో కొత్త శక్తిని, ఆశను తీసుకురావాలి.
-పరమశివుడి ఆశీస్సులతో మీ జీవితంలోని ప్రతి కష్టం తొలగిపోయి విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. శివరాత్రి శుభాకాంక్షలు.
-హర్ హర్ మహాదేవ్! మహా శివరాత్రి శుభాకాంక్షలు!
-మహా శివరాత్రి పవిత్ర రాత్రి మీ భయాలను విడిచిపెట్టి శాంతిని స్వీకరించండి. హర్ హర్ మహాదేవ్!
-పరమశివుడు మన జీవితాల నుండి అన్ని అడ్డంకులను తొలగించి శాంతి, ఆనందాన్ని కలిగించుగాక. మహా శివరాత్రి శుభాకాంక్షలు!
-ఈ మహా శివరాత్రి రోజు శివుడు మీకు బలం, జ్ఞానం, శ్రేయస్సును అనుగ్రహిస్తాడు. మహాశివరాత్రి శుభాకాంక్షలు.
- నా కుటుంబం నుండి మీకు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడిన మహా శివరాత్రి శుభాకాంక్షలు.
-ఈ మహా శివరాత్రి మీ ఇంటికి సంతోషం, శ్రేయస్సు, శాంతిని కలిగిస్తుందని కోరుకుంటూ హ్యాపీ మహాశివరాత్రి.
-ఈశ్వరుడి భక్తిలో మునిగిపోండి, ఆయన కృప ద్వారా మీ జీవితంలో ప్రతి విజయం, ఆశీర్వాదం ఉంటుంది. శివరాత్రి శుభాకాంక్షలు.
-పరమశివుడు మీ జీవితాల నుండి అన్ని అడ్డంకులను తొలగించి, మీకు శాంతి, ఆనందాన్ని కలిగించుగాక. మహా శివరాత్రి శుభాకాంక్షలు!
-ఈ మహా శివరాత్రి నాడు శివుడు మీకు బలం, జ్ఞానం, శ్రేయస్సును అనుగ్రహిస్తాడు. మహాశివరాత్రి శుభాకాంక్షలు.
-సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేవి శివుని మూడు కళ్లు. అలా మూడింటిని కలిగి ఉండటం అనేది శివుని ప్రత్యేకత. అంతటి సర్వశక్తిమంతుడైన శివుని ఆశీస్సులు.. మీకు.. మీ కుటుంబ సభ్యులకు నిత్యం ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ మహా శివరాత్రి
-"ఓం నమః శివాయ" అనే శక్తివంతమైన మంత్రాన్ని జపిద్దాం. మన హృదయాలలో, గృహాలలో శాంతిని ఆహ్వానిద్దాం.
-మహా శివరాత్రి ఈ పవిత్ర రాత్రిలో మన భయాలను విడిచిపెట్టి, శాంతిని అలవర్చుకుందాం. హర్ హర్ మహాదేవ్.
-ఓ జంగమా.. ఓ లింగమా.. పక్కనే పార్వతమ్మా.. తలపై గంగమ్మ.. మెడలో సర్పమా.. బూడిద దేహమా.. సిగలో చందమామ.. స్రుష్టినే స్రుష్టించగల దైవమా.. మాఘ మాసంలో మళ్లీ పుట్టిన పరమాత్ముని ఆశీస్సులతో మీరు ప్రతి విషయంలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ... మీకు మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
-మహాకాళ జపం చేయడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి. మహా శివరాత్రి శుభాకాంక్షలు! మహాశివరాత్రి శుభాకాంక్షలు.
-శివుని పేరు జపించడం ద్వారా శివరాత్రి అంతా గడపండి. ఆ దేవ దేవుని ఆశీర్వాదం పొందండి. ఈ సందర్భంగా బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications
