Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు..
శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పచ్చదనం, ఆధ్యాత్మిక శోభ, పండుగల సందడి. అందులోనూ ముఖ్యంగా ముత్తైదువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ వరలక్ష్మీ వ్రతం. అష్టైశ్వర్యాలకు, సకల శుభాలకు ప్రతీక అయిన ఆ వరలక్ష్మీ దేవిని పూజించడం ద్వారా కుటుంబంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు వెల్లివిరుస్తాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం.
ఈ ఏడాది ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీ బంధుమిత్రులకు ఎలా విషెస్ తెలియజేయాలో ఇక్కడ చూడండి.

వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు
-మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.
-వరలక్ష్మీ దేవి ఆశీస్సులతో మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరిసంపదలతో తులతూగాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వరలక్ష్మీ వ్రతం 2026.
-ఈ శ్రావణ శుక్రవారం మీ జీవితంలో సుఖశాంతులు నింపాలని ఆకాంక్షిస్తూ.. వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.
-అష్టలక్ష్ముల దివ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. హ్యాపీ వరలక్ష్మీ వ్రతం 2026.
-మీ కుటుంబానికి వరలక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా లభించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
-వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి మీ ఇంట కొలువుదీరి, సుఖసంతోషాలు ప్రసాదించుగాక. హ్యాపీ వరలక్ష్మీ వ్రతం 2026.
-మీ ఇల్లు అమ్మవారి దివ్య కాంతితో శోభిల్లి, ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు.

వరలక్ష్మీ వ్రత మెసేజ్ లు
-సంపద, ఆరోగ్యం, శాంతి, సమృద్ధి.. ఇవన్నీ వరలక్ష్మీ దేవి మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వరలక్ష్మీ వ్రతం 2026.
-వరలక్ష్మీ రూపంలో ఉన్న ఆ దివ్య శక్తి మీ కుటుంబాన్ని అన్ని వేళలా రక్షించుగాక.
-కలశంలో కొలువైన మహాలక్ష్మి మీ కష్టాలన్నీ తొలిగించి లక్ష్మీ కటాక్షం అందించాలని ప్రార్థిస్తున్నాను.
-పసుపు కుంకుమల శోభతో, తోరాల బంధంతో శ్రావణ లక్ష్మి మీ ఇంట వెలవెలలాడాలి. వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు
-భక్తిశ్రద్ధలతో చేసే ఈ వరలక్ష్మీ వ్రతం మీ జీవితంలో సరికొత్త కాంతులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.
-మీ ఇంట పసిడి కాంతులు నిండాలని, ముత్తైదువుల దీవెనలు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.
సోషల్ మీడియా స్టేటస్ లు
-వరమిచ్చే తల్లి వరలక్ష్మి అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక. హ్యాపీ వరలక్ష్మీ వ్రతం.
-లక్ష్మీదేవి ఎక్కడైతే పూజలందుకుంటుందో, అక్కడ దారిద్ర్యానికి స్థానం ఉండదు. హ్యాపీ వరలక్ష్మీ వ్రతం.
-శుభ శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబానికి లభించుగాక
-అష్టలక్ష్మీ రూపాలతో వర్ధిల్లే ఆ తల్లి కటాక్షం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. మీ ఇంట సిరిసంపదలు నిండాలని కోరుకుంటూ.. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
-విశ్వాసం ఉన్నచోట ఆశ ఉంటుంది, భక్తి ఉన్నచోట దైవ కృప ఉంటుంది. మీ ప్రార్థనలు ఫలించి ఆ తల్లి మీ కోరికలన్నీ నెరవేర్చాలని ఆకాంక్షిస్తూ.. హ్యాపీ వరలక్ష్మీ వ్రతం.
-దీపాల వెలుగు మీ ఇంటిని ప్రకాశవంతం చేయుగాక. వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ జీవితాన్ని శాంతి, సంతోషాలతో నింపుగాక. హ్యాపీ వరలక్ష్మీ వ్రతం.
అమ్మవారి దివ్య మంత్రాలు
మహాలక్ష్మీ మూల మంత్రం
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధ లక్ష్మై నమః.. సకల కార్యసిద్ధిని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి నమస్కరిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మీ వ్రతం 2026 శుభాకాంక్షలు.
లక్ష్మీ గాయత్రీ మంత్రం
ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.. శ్రీమహావిష్ణువు దేవేరియైన ఆ మహాలక్ష్మి మమ్మల్ని సన్మార్గంలో నడిపించుగాక అని ప్రార్థిస్తూ.. వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.
వరలక్ష్మీ ధ్యాన మంత్రం
పద్మాసనస్థితాం దేవీం పరబ్రహ్మ స్వరూపిణీమ్.. పద్మంలో ఆసీనురాలై, కోరిన వరాలిచ్చే పరబ్రహ్మ స్వరూపిణికి ప్రణామాలు అర్పిస్తూ 2026 వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.
సంపద, ఐశ్వర్య ప్రాప్తి మంత్రం
ఓం హ్రీం శ్రీం క్రీం క్లీం శ్రీ లక్ష్మీ మమ గృహే ధనం పూరయ.. మా గృహాన్ని ధనధాన్యాలతో నింపి, మా చింతలను బాపే మహాలక్ష్మికి హవిస్సులు అర్పిస్తూ.. మీ కుటుంబానికి శుభాకాంక్షలు.
సర్వాభీష్ట ప్రదాయక మంత్రం
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి..సమస్తమూ తెలిసిన, వరాలిచ్చే, దుఃఖాలను నివారించే ఓ మహాలక్ష్మీ దేవీ నీకు నమస్కారాలు. అందరికీ వరలక్ష్మీ వ్రతం 2026 శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications
