Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్‌లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
అష్టాదశ శక్తిపీఠాలు ఏవి ? వాటికి వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ?
అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకుంటే.. పుణ్యఫలం సిద్ధిస్తుందని ఒక నమ్మకం ఉంది. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయని భక్తులు భావిస్తారు.
పురాణం ప్రకారం పార్వతీదేవి తండ్రి దక్షుడు మహాయాగం చేస్తాడు. ఈ యాగానికి ముల్లోకాలలోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఇష్టంలేని పెళ్లి చేసుకున్న పార్వతీ, పరమేశ్వరులను ఆహ్వానించరు. అయితే తండ్రి చేస్తున్న యాగానికి వెళ్లాలని పార్వతీదేవి పరమేశ్వరుడిని వేడుకుంటుంది. అందుకు శివుడు అంగీకరించడు. దీంతో అవమానంగా భావించిన పార్వతీదేవి ఉగ్రరూపిణిగా అవతారమెత్తి తన శరీరాన్ని 18 ముక్కలుగా విసిరి వేస్తుంది. అలా ఆ శరీర భాగాలు భూలోకంలో 18 చోట్ల పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. వాటినే అష్టాదశ శక్తి పీఠాలుగా భావిస్తున్నాం. ఈ అష్టాదశ శక్తిపీఠాలనే మహాశక్తిపీఠాలు అని కూడా పిలుస్తారు. ఈ శక్తిపీఠాలు మనదేశంలోనే కాక.. పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ దేశాలలో కూడా ఉన్నాయని చెబుతున్నాయి.

1.శాంకరీదేవి తృణకోమలి, శ్రీలంకలో కేవలం శాంకరీదేవి ఆలయ స్తంభం మాత్రమే ఉంది.
2.కామాక్షీదేవి కంచి, తమిళనాడులో ఉంది. ఇక్కడ సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటే కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది.
3.శృంఖలాదేవి పాండువా, పశ్చిమబెంగాల్ లో ఉంది. అమ్మవారి ఉదర భాగం పడిన చోటుగా చెబుతుంటారు.
4.చాముండేశ్వరీదేవి మైసూరు, కర్ణాటకలో ఉంది. ఇక్కడ హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం.
5.జోగులాంబాదేవి ఆలంపూర్, తెలంగాణలో ఉంది. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు ఇది.
6.భ్రమరాంబికాదేవి శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం.
7.మహాలక్ష్మీదేవి కొల్హాపూర్, మహారాష్ట్రలో ఉంది. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు.
8.రేణుకాదేవి మహుర్, మహారాష్ట్రలో పార్వతీదేవి కుడిచేయి పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు.
9.మహాకాళీదేవి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది.
10.పురుహూతికాదేవి పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ లో దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశంగా వివరిస్తారు.
11.గిరిజాదేవి జాజ్‌పూర్, ఒడిశాలో అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి.
12.మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్ లో సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు పురాణాలు చెబుతాయి.
13.కామరూపాదేవి గువాహటి, అసోంలో సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం.
14.మాధవేశ్వరీదేవి ప్రయాగ, ఉత్తరప్రదేశ్ లో అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు పడినట్టు ప్రతీతి.
15.వైష్ణవీదేవి కాంగ్రా, జ్వాలాముఖి, హిమాచల్‌ప్రదేశ్ లో అమ్మవారి నాలుక పడిందని చెబుతుంటారు.
16.సర్వమంగళాదేవి గయ, బీహార్ లో సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం.
17.విశాలాక్షీదేవి వారణాసి, ఉత్తరప్రదేశ్ లో సతీదేవి చెవి కుండలం.. విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం.
18.సరస్వతీదేవి కాశ్మీర్ లో ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ఇవి అత్యంత ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాల విశేషాలు.



Click it and Unblock the Notifications