For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడికి వెళ్లే సంప్రదాయం ఎందుకు వచ్చింది ?

By Swathi
|

ఆధ్మాత్మిక చింతన, ఆధ్యాత్మిక భావనలు ఉన్నవాళ్లు, పూజలు, పునస్కారాలు ఇష్టపడేవాళ్లు, దేవుడిని నమ్మేవాళ్లు ఆలయాలకు వెళ్తూ ఉంటారు. రోజూ వెళ్లేవాళ్లూ ఉంటారు. వారానికి ఒకసారి వెళ్లేవాళ్లు ఉంటారు. వీలుకాని వాళ్లకు.. అప్పుడప్పుడు గుడికి వెళ్లే అలవాటు ఉంటుంది. కనీసం పండుగలు, శుభకార్యాలు ఉన్న సమయంలోనైనా ఆలయానికి వెళ్తారు. అయితే ఇలా గుడికి వెళ్లే సంప్రదాయం ఎలా వచ్చింది ? మనం గుడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి ? గుడికి వెళ్లకపోతే దేవుడి అనుగ్రహం లభించదా ?

హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు ?

spirituality

ఆలయాలకు ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలు, పెద్దలు.. అని తేడా లేకుండా అందరూ వెళ్తుంటారు. కానీ ఎందుకు వెళ్తామనే విషయంపై చాలా మంది ఆలోచనకు వచ్చిండదు. మనసులో బాధగా ఉన్నప్పుడు, ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, కాలక్షేపం కోసమో దేవాలయానికి వెళ్దామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. ఇలాంటి అవసరాలు, ఆలోచనల కోసం కాదు ఆలయానికి వెళ్లే సంప్రదాయం పుట్టుకొచ్చినది. ఆలయ దర్శనం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి.

సోమనాథ్ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ఎంట్రీ..!! ఎందుకు ?

ఆలయాలకు స్థల మహత్యం ఉంటుందని ఎప్పుడైనా విన్నారా ? అవును మన దేశంలో ఉన్న ఆలయాలను ప్రత్యేకంగా పవిత్ర ప్రదేశాలు భావించిన ప్రాంతాల్లోనే నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భూమిలో ఎక్కడైతే ఆకర్షణ తరంగాలు ప్రసరిస్తాయో.. ఆ ప్రాంతాల్లోనే ఆలయాలు నిర్మించారు. అంటే భూమిలో పాజిటివ్ ఎనర్జీ ప్రసరమయ్యే ప్రాంతాల్లో మాత్రమే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అందుకే గుడిలోకి అడుగుపెట్టగానే చాలా ప్రశాంతంగా ఉందన్న భావనలో మనలో కలుగుతుంది.

అయ్యప్ప భక్తులు ఒకరిని ఒకరు స్వామి అని ఎందుకు పిలుచుకుంటారు ?

spirituality

మరొక విశేషం కూడా ఉంది. గర్భగుడికి ఎదురుగా మూలవిరాట్ ఉంటుంది. ఈ ధ్వజస్తంభాన్ని రాగి రేకుపై పెడతారు. ఎందుకంటే.. ? రాగిరేకుకి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే గుణం ఉంటుంది. దీంతో గుడి చుట్టూ పరిసరాలకు రాగిరేకు ద్వారా శక్తి తరంగాలు వ్యాపిస్తాయి. అందుకే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే సంప్రదాయం ఉంది. ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల.. మనలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే అప్పుడప్పుడు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. నిత్యం చేస్తే ఎక్కువ ఫలితాలు పొందవచ్చు. కాబట్టి గుడివెళ్లే సంప్రదాయం ద్వారా మనం పాజిటివ్ ఎనర్జీ పొందుతాం. ఇదే ఈ సంప్రదాయం వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్.

English summary

If God Is Everywhere, Why Go to the Temple?: Why Do We Go To Temple and How Does It Help Us?

It becomes easy for a devotee to concentrate in worshiping God in a temple where hundreds of devotees come for the same purpose. The environment of the temple produces a psychological effect which helps in concentration.
Story first published: Tuesday, January 19, 2016, 17:57 [IST]
Desktop Bottom Promotion