For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఇస్లాంలోని ముఖ్యమైన భోధనలు

  |

  అనేక శతాబ్దాల క్రితo, ఇప్పటి ప్రపంచానికి పూర్తిగా భిన్నమైన సంస్కృతీ సంప్రదాయాలతో కూడిన ప్రపంచం ఉండేది. వారి భాష కూడా కాలానుగుణంగా పరిణామం చెందింది. వారి ప్రయత్నాలు నేటి తరానికి శూన్యమే అయినా వారి కాలం మాత్రం అనేక రహస్యాలతో కూడుకుని ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.

  ఒకానొక సమయం, అనేకములైన మతాలు, సాంప్రదాయాలు పుట్టిన కాలంగా చెప్పబడుతున్నది. ఈ మతాలలో అత్యధిక శాతం ఇప్పటికీ కొనసాగుతున్న మైనారిటీ వర్గాలను కలిగి ఉన్నాయి. కానీ వాటన్నిటిలో ప్రపంచ ముఖ చిత్రాన్నే మార్చిన రెండు ప్రధాన మతాలు మాత్రo, క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతం. ఈ రెండింటిలోనూ, ఇస్లాం పురాతనమైనదిగా చెప్పబడింది.

  Important Teachings of Islam

  ఇస్లాం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు మీ మనస్సులో మెదిలే మొదటి విషయం ఏమిటి? తప్పనిసరిగా నమాజు సమయంలో దేశవ్యాప్తంగా వినిపించే లౌడ్ స్పీకర్లు, రంజాన్, బక్రీద్ వంటి గొప్ప గొప్ప పండుగలు, విస్తృతమైన పురాతన మసీదులు. అంతేకాకుండా కొన్ని విభిన్నమైన ఆహారాలు, ముఖ్యంగా బిర్యాని, హలీం కబాబ్స్, ఖీర్ వంటివి కూడా ఇస్లాం మనసులో మెదలగానే తట్టే ఆహారపదార్దాలుగా ఉన్నాయి. మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడే ఆహార పదార్ధాలు వీరి సొంతం. ఇస్లాం కూడా ప్రజలలో ప్రతికూల, సానుకూల ఆలోచనలు కూడా తెస్తుంది అంటే నమ్మగలరా.

  ఇస్లాం అంటే ఏమిటి?

  ప్రతి ధర్మం వలె, ఇస్లాం ఖురాన్లో వ్రాయబడిన వ్యాఖ్యలపై పూర్తిగా ఆధారపడి ఉంది. ఖురాన్, ఇస్లాం మతంలో అత్యున్నత అధికారాన్ని కలిగి దేవుని పదాలతో ఉన్నతమైన సూచనలను ఇస్తుంది. ఇస్లాo మతంలో మరొక ముఖ్యమైన శక్తి, మహమ్మద్ ప్రవక్త. హదీథులను పిలిచే కాగితపు ముక్కలలో పవిత్ర ప్రవక్త యొక్క అన్ని సూచనలు కూడా ప్రస్తావించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఏ విషయాన్ని పరిష్కరించడానికైనా ఈ సూచనల మీదనే ఆధారపడుతారు.

  ఇస్లాం గురించి తెలుసుకోవాలంటే ఖుర్ఆన్ అర్థం చేసుకోవాలి. అపార్థం ఎక్కడ వస్తుంది అనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఖురాన్ నిజానికి అరబిక్లో వ్రాయబడింది, ఇది ప్రాచీన భాష. అనేకమంది ముస్లింలు చిన్న వయస్సు నుండి అరబిక్ భాషను చదవడం మరియు వ్రాయడానికి తర్ఫీదు పొందుతున్నప్పటికీ, వారు చదివిన పాఠాల అర్థాల గురించి తరచుగా సందేహాలతోనే ఉన్నారు. ఇస్లాం మత నాయకులు మరియు ఇతర వ్యక్తులు పూర్తిగా గ్రంథాలను అర్థం చేసుకోవడంలో కొన్ని అర్ధాలు తారుమారయ్యి, పురుషాధిక్యత అన్న అంశమే ఎక్కువ ప్రస్పుటంగా కనిపించింది.

  వాస్తవానికి ఖురాన్ పురుషులు మరియు స్త్రీల సమానత్వం గురించి పదే పదే చెప్పింది. ఖుర్ఆన్ లో అనేక ఇతర ముఖ్యమైన బోధనలు కూడా ఉన్నాయి. ఖురాన్, మతం గురించిన స్పష్టమైన అవగాహన కలిగి ఉండటానికి సహాయపడుతుంది.

  ఇస్లాం యొక్క ముఖ్యమైన బోధనలు-

  1)ఇస్లాం మతం అంటేనే శాంతి, సహనం మరియు ప్రేమకు ప్రతిరూపం. ఏ పరిస్థితులలో అయినా ప్రజలను హతమార్చడం అనేది మనిషిచేసే చర్యలలో అతి పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని చిందించేలా చేసిన ఎవరైనా నిరంతరంగా నరకం యొక్క మంటల్లో కాల్చివేయబడుతారని చెప్పబడినది. ఖుర్ఆన్, ఇస్లాం మతాన్ని కఠినంగా అహింసా మార్గంలో వ్యాప్తి చేయడం గురించే ప్రస్తావిస్తుంది. వాస్తవానికి, హంతకులను కూడా చంపడానికి అనుమతించదు ఖురాన్, ఒక్క అల్లాహ్ మాత్రమే న్యాయం చేయగలడు అని విశ్వసిస్తుంది.

  2)తూర్పు దేశాలలో అనేక మార్గాల్లో మహిళలను నియంత్రిస్తున్నప్పటికీ, పురుషులు మరియు మహిళల సమానత్వం గురించి ఇస్లాం ఖచ్చితంగా ప్రస్తావిస్తుంది. ఖుర్ఆన్ ప్రకారం, భార్య ఒక వ్యక్తి జీవితంలో అతిపెద్ద సంపదగా పరిగణించబడుతుంది. అల్లాహ్ తన భార్యను రాణిలాగా పరిగణిస్తున్న వ్యక్తికి ఎంతో సంతోషాన్ని కలుగజేస్తాడని నమ్మకం. స్త్రీలు డ్రైవ్ చేయకూడదని లేదా ఓటు వేయడానికి అనుమతించబడరు అని ఎక్కడా లేదు. వాస్తవానికి, తన భర్తకు ఆర్ధికంగా సహాయపడటానికి ఒక మహిళ తమ గృహాల వెలుపలకు వెళ్ళటానికి కూడా అనుమతి ఉంది. అనేకమంది యువతులు నేడు పురుషులతో సమానంగా విద్యాభ్యాసాలు, ఉద్యోగాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కూడా. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మిగిలిన అనేక తూర్పు దేశాలతో పోలిస్తే, మన దేశంలో ముస్లిం మహిళలకు స్వేచ్చా వాయువులు ఎక్కువే. కానీ, స్త్రీ పురుష సమానత్వం అన్న ఆలోచన వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు నేటికీ తలెత్తడం భాదాకరమైన విషయం.

  3)ముస్లింలు సర్వశక్తిమంతుడైన అల్లాపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. ఖుర్ఆన్ ప్రకారం అల్లాహ్ ఇష్టానికి లొంగిపోయేవాడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుతాడు. అల్లా మాటను, అల్లా స్మరణను మరచి ఇస్లాం వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు అల్లా దీవెనలను ఎన్నటికీ పొందలేదని ఖురాన్ చెప్తుంది.

  4)ఇస్లాం ధర్మంలో అసూయ మరియు వెన్నుపోటు అనునవి క్షమించలేని పాపంగా పరిగణించబడుతున్నాయి. ఖురాన్లో అధిక కోపం, మరియు అసంబద్ద పదాలను వినియోగించరాదని కూడా చెప్పబడింది. అటువంటి చర్యలు సంబంధాల నాశనానికి హేతువులుగా పరిణమిస్తాయి అని చెప్పబడింది. కావున మాట్లాడే మాటలలో, చేసే పనుల్లో నిబద్దత ఆలోచన ఉండాలని సూచిస్తుంది.

  5)ఇస్లామిక్ వివాహం అంటేనే ఎల్లప్పుడూ ఒక చర్చకు దారితీసే అంశంగా ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఖుర్ఆన్ ప్రకారం, మొదటి భార్య మానసికంగా లేదా భౌతికంగా అనారోగ్యంగా ఉన్న పక్షంలోమాత్రమే మరొక స్త్రీని వివాహం చేసుకోవడానికి అనుమతి ఉంది. కానీ ఆ వివాహానికి కూడా భార్య అనుమతి తప్పకుండా అవసరమవుతుంది. సరైన విధి విధానాలు పాటించని కొందరి మూలంగా ఇంకనూ అనేక సమస్యల్లో వివాహ బంధాలు కొట్టుమిట్టాడుతున్నాయి.

  6) మంచి పనులు ఇస్లాం మతం యొక్క చాలా ముఖ్యమైన భాగం. ఎటువంటి ప్రతిఫలం ఆశించని పవిత్ర మనిషి చేత చేయబడిన మంచి పనులు అల్లాహ్ చేత స్వీకరించబడి, ఊహించలేని రీతిలో ఆ వ్యక్తి ఉత్తమమైన ఫలాలను తిరిగి పొందగలడు.

  7)భూమిపై ప్రతి మానవుడు సమానంగా జన్మిస్తాడని ఇస్లాం బోధిస్తుంది మరియు దేవుడు వారికి సమాన అవకాశాలు ఇస్తాడు. సమానత్వం ఖురాన్ లో నొక్కిచెప్పబడింది మరియు అల్లా తన భక్తులను ఇతరులను గౌరవించమని మరియు ఇతర మతస్థులను కూడా తమ వలెనే ఆరాధించమని భోదిస్తున్నాడు.

  8) ప్రతి సాంప్రదాయం మరియు ముస్లింలు అనుసరిస్తున్న అనేక ఆచారాల వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. రంజాన్ పవిత్ర నెలలో ఉపవాసం లేదా నమాజ్, రోజు 5 సార్లు చేయడం వంటి వాటి ద్వారా మానవ శరీరoలోని అనేక టెర్మినల్ వ్యాధుల నుండి దూరంగా ఉంచి శరీరం మరియు మనస్సును చురుకుగా మరియు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.

  ఇస్లాం మతం శాంతికి చిహ్నంగా, హింసకు వ్యతిరేకంగా చెప్పబడినది. ఖురాన్ ను నరనరాన ఇముడ్చుకున్న ఏ ముస్లిం కూడా అల్లాకు వ్యతిరేకమైన పనులు చేయడని చెప్పబడినది.

  ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆద్యాత్మిక అంశాల గురించిన విషయాల కై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం మీద మీ అభిప్రాయాలని క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

  English summary

  Important Teachings of Islam

  Important Teachings of Islam Many Centuries ago, the world was different from the present. Yet our ancestors were intelligent enough to save everything in writing. But alas!! Their language also evolved with time, making their efforts null and their period as mysterious as themselves.
  Story first published: Saturday, June 16, 2018, 12:20 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more